AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jr.NTR  : ‘ఎన్టీఆర్ గురించి నేను అప్పుడే చెప్పాను.. కానీ నా మాట ఎవరు నమ్మలేదు’.. హీరోయిన్ షాకింగ్ ట్వీట్..

ఇక యూట్యూబ్ ను షేక్ చేసిన నాటు నాటు పాటతో ఆస్కార్ బరిలో నిలిచారు. ఆర్ఆర్ఆర్ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాందించుకున్న తారక్ గురించి హీరోయిన్ పాయల్ ఘోస్ ఆసక్తికర ట్వీట్ చేసింది.

Jr.NTR  : 'ఎన్టీఆర్ గురించి నేను అప్పుడే చెప్పాను.. కానీ నా మాట ఎవరు నమ్మలేదు'.. హీరోయిన్ షాకింగ్ ట్వీట్..
Ntr, Payal Ghosh
Rajitha Chanti
|

Updated on: Dec 24, 2022 | 5:01 PM

Share

దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మికంగా రూపొందించిన ట్రిపుల్ ఆర్.. ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ సినిమాతో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, నందమూరి నటసింహం జూనియర్ ఎన్టీఆర్ పాన్ ఇండియా క్రేజ్ సంపాదించుకున్నారు. ఇందులో వీరిద్దరి నటనకు మన దేశంలోనే కాదు.. విదేశీయులు సైతం ఫిదా అయ్యారు. ఇక యూట్యూబ్ ను షేక్ చేసిన నాటు నాటు పాటతో ఆస్కార్ బరిలో నిలిచారు. ఆర్ఆర్ఆర్ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాందించుకున్న తారక్ గురించి హీరోయిన్ పాయల్ ఘోస్ ఆసక్తికర ట్వీట్ చేసింది. ఎన్టీఆర్ గురించి తను అప్పుడే చెప్పానని.. కానీ తన మాటలు అప్పుడు ఎవరు నమ్మలేదంటూ చెప్పుకొచ్చింది. ఎన్టీఆర్ కు వచ్చిన గ్లోబల్ లెవల్ క్రేజ్ చూసి సంతోషం వ్యక్తం చేసింది.

తారక్, తమన్నా జంటగా నటించిన ఊసరవెల్లి సినిమాలో పాయల్ ఘోష్ నటించింది. ఈ చిత్రంలో తమన్నా స్నేహితురాలిగా ఆమె కనిపించింది. అప్పుడే తారక్ నటనకు ఆమె పెద్ద ఫ్యాన్ అయ్యింది. ఈ క్రమంలోనే ఆర్ఆర్ఆర్ రిలీజ్ కు ముందే.. 2020లో ఈ సినిమాతో తారక్ డెఫినెట్ గా ఒక గ్లోబల్ ఫేస్ అవుతాడని చెప్పింది. ఇక ఇప్పుడు అలాగే కాగా.. తను చెప్పిన ఈ విషయాన్ని గుర్తు చేస్తూ అప్పుడు నేను ఎన్టీఆర్ గురించి ఇదే విషయం చెబితే అందరూ నా మాటలు విని నవ్వారు. నా మాటలు ఎవరు నమ్మలేదు. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ ఓ గ్లోబల్ ఫేస్ అయ్యాడు అంటూ సంతోషంతో ట్వీట్ చేసింది. ఇక పాయల్ ఘోష్ ట్వీట్ పై ఆనందం వ్యక్తం చేస్తున్నారు తారక్ ఫ్యాన్స్.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం ఎన్టీఆర్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. అలాగే.. కేజీఎఫ్ చిత్రంతో సంచనలం సృష్టించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలోనూ తారక్ నటించనున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రేమించి పెళ్లాడి.. 9 నెలలకే భార్యను హతమార్చిన భర్త!
ప్రేమించి పెళ్లాడి.. 9 నెలలకే భార్యను హతమార్చిన భర్త!
మేకప్‌కి నో చెప్తున్నా భారీ ఆఫర్లు..! స్టార్ నటి సీక్రెట్ ఏంటి?
మేకప్‌కి నో చెప్తున్నా భారీ ఆఫర్లు..! స్టార్ నటి సీక్రెట్ ఏంటి?
అప్పటి కల్లా ఫైళ్లన్నీ ఆన్‌లైన్ కావాలి.. కలెక్టర్లకు చంద్రబాబు..
అప్పటి కల్లా ఫైళ్లన్నీ ఆన్‌లైన్ కావాలి.. కలెక్టర్లకు చంద్రబాబు..
ఒక దశాబ్దపు ప్రస్థానం! ఆ సూపర్‌‌హిట్ సినిమాకు పదేళ్లు
ఒక దశాబ్దపు ప్రస్థానం! ఆ సూపర్‌‌హిట్ సినిమాకు పదేళ్లు
మైక్రోవేవ్ ప్రాణాంతకమా? ఈ నిజాలు తెలిస్తే షాక్ అవుతారు!
మైక్రోవేవ్ ప్రాణాంతకమా? ఈ నిజాలు తెలిస్తే షాక్ అవుతారు!
చలితో బరువుతగ్గొచ్చట.. బ్రౌన్ ఫ్యాట్ సీక్రెట్ చెప్పిన సైంటిస్టులు
చలితో బరువుతగ్గొచ్చట.. బ్రౌన్ ఫ్యాట్ సీక్రెట్ చెప్పిన సైంటిస్టులు
మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన, బంగారం, వెండి ధరలు
మహిళలకు గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన, బంగారం, వెండి ధరలు
అందుకే అవకాశాలు కోల్పోయాను.. హీరోయిన్ తాప్సీ..
అందుకే అవకాశాలు కోల్పోయాను.. హీరోయిన్ తాప్సీ..
ఈ చైల్డ్ ఆర్టిస్ట్‌ను గుర్తుపట్టారా? నెట్టింట ఫొటోలు వైరల్
ఈ చైల్డ్ ఆర్టిస్ట్‌ను గుర్తుపట్టారా? నెట్టింట ఫొటోలు వైరల్
ఖాళీ క్లాస్ రూమ్‌లు.. తుస్సుమన్న గ్యారెంటీలు.. కాంగ్రెస్‌పై..
ఖాళీ క్లాస్ రూమ్‌లు.. తుస్సుమన్న గ్యారెంటీలు.. కాంగ్రెస్‌పై..