Megastar Chiranjeevi: ఆనాటి ఫ్యామిలీ పిక్ షేర్ చేసిన మెగాస్టార్ చిరంజీవి.. తండ్రిని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ నోట్..
మాకు జన్మనిచ్చి.. క్రమశిక్షణతో పెంచి.. జీవితపు ఒడిదొడుకులు పట్ల అవగాహన పంచి మా కృషిలో ఎప్పుడూ తోడుగా ఉండి..
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వాల్తేరు వీరయ్య సినిమాతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ మంచి ఆదరణ పొందాయి. ఈ క్రమంలో తాజాగా తన తండ్రిని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు చిరంజీవి. తన తండ్రి వెంకట్రావు వర్ధంతి సందర్భంగా శనివారం ఆయనను స్మరించుకున్నారు. తల్లి అంజనాదేవి, సోదరుడు నాగబాబు.. సోదరీమణులతో కలిసి ఆయనకు నివాళులు అర్పించారు. ఇందుకు సంబంధించిన ఫోటోతోపాటు.. తండ్రితో కలిసి దిగిన ఆనాటి పిక్ షేర్ చేశారు. ” మాకు జన్మనిచ్చి.. క్రమశిక్షణతో పెంచి.. జీవితపు ఒడిదొడుకులు పట్ల అవగాహన పంచి మా కృషిలో ఎప్పుడూ తోడుగా ఉండి.. మా విజయాలకు బాటను ఏర్పర్చిన మా తండ్రి వెంకట్రావు గారిని స్మరించుకుంటూ” అంటూ భావోద్వేగ పోస్ట్ షేర్ చేశారు.
చిరంజీవి తన తండ్రితో కలిసి ఫ్యామీలి మొత్తం ఉన్న అపురూప చిత్రాన్ని అభిమానులతో పంచుకున్నారు. అందులో చిరు, ఆయన సతీమణి సురేఖ.. తండ్రి వెంకట్రావు, తల్లి అంజనా దేవి, నాగబాబుతోపాటు.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. మెగా ఫ్యామిలీకి చెందిన రేర్ ఫోటో చూసి అభిమానులు ఖుషి అవుతున్నారు.
ఇటీవల గాడ్ ఫాదర్ సినిమాతో సక్సెస్ అందుకున్న చిరు. ఇప్పుడు భోళా శంకర్, వాల్తేరు వీరయ్య సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ సంక్రాంతి కానుకగా డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తున్న వాల్తేరు వీరయ్య జనవరి 12న విడుదల కాబోతుంది. ఇందులో శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తోంది.
మాకు జన్మనిచ్చి, క్రమశిక్షణతో పెంచి, జీవితపు ఒడిదుడుకుల పట్ల అవగాహన పంచి, మా కృషి లో ఎప్పుడూ తోడుగా వుండి, మా విజయాలకు బాటనేర్పరిచిన మా తండ్రి వెంకట్రావు గారిని ఆయన సంవత్సరీకం సందర్బంగా స్మరించుకుంటూ .. pic.twitter.com/epHicHCxbc
— Chiranjeevi Konidela (@KChiruTweets) December 24, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.