AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలని లేదు.. నాకు ఇప్పటికే ఓ బిడ్డ ఉన్నాడు.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన హీరోయిన్

ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు. కానీ వారి సినిమాల గురించి కాకుండా వ్యక్తిగత జీవితం గురించి ఎక్కువగా వార్తలలో నిలుస్తుంటారు. నటీమణుల ప్రేమ, పెళ్లి, విడాకులు, డేటింగ్.. ఇలా ఒక్కటేమిటీ హీరోయిన్స్ పర్సనల్ లైఫ్ పై నిత్యం ఏదోక చర్చ జరుగుతుంది. తాజాగా ఓ హీరోయిన్ పెళ్లి కాకుండానే తనకు ఓ బిడ్డ ఉన్నాడు అని చెప్పి షాక్ ఇచ్చింది

పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలని లేదు.. నాకు ఇప్పటికే ఓ బిడ్డ ఉన్నాడు.. ఊహించని ట్విస్ట్ ఇచ్చిన హీరోయిన్
Actress Photos
Rajeev Rayala
|

Updated on: Jan 16, 2025 | 7:08 PM

Share

సినిమా సెలబ్రెటీల విషయంలో ప్రేమలు, బ్రేకప్స్ , పెళ్లి, విడాకులు, డేటింగ్స్ ఇలాంటివి చాలా కామన్. ఎవరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో.. ఎవరు ఎప్పుడు విడిపోతారో చెప్పడం కష్టమే.. ఇప్పటికే కొంతమంది పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని మొదలుపెడుతుంటే మరికొంతమంది మాత్రం ఊహించని విధంగా విడిపోతున్నట్టు అనౌన్స్ చేసి షాక్ ఇస్తున్నారు. అయితే కొంతమంది భామలు మాత్రం పెళ్లి చేసుకోవడానికి ఆసక్తి చూపించడం లేదు. తాజాగా ఓ బ్యూటీ కూడా తనకు, ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని చెప్పుకొచ్చింది. కానీ తనను ఓ బిడ్డ ఉన్నాడు అని ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.?

ఇది కూడా చదవండి :పాపం ఈ హీరోయిన్..! అప్పుడు డ్రగ్స్ కేసులో జైల్లో వేశారు.. నాలుగేళ్ళ తర్వాత నిర్దోషి అని తేల్చారు..

కొంతమంది హీరోయిన్స్ నాలుగు పదుల వయసు వస్తున్నా పెళ్ళికి మాత్రం నో అంటున్నారు. కొంతమంది యంగ్ బ్యూటీస్ అసలు పెళ్లి చేసుకోము అని తెగేసి చెప్తున్నారు. తాజాగా నటి ఓవియా కూడా తనకు పెళ్లి చేసుకోవాలని లేదని. అలాగే పెళ్లి చేసుకోని పిల్లలను కనాలని లేదు అని చెప్పుకొచ్చింది. నటి ఓవియా ఏప్రిల్ 29, 1991న కేరళలోని త్రిసూర్‌లో జన్మించారు. నటి ఓవియా 2010లో సర్గుణం దర్శకత్వం వహించిన కలవాణి చిత్రంతో తమిళ చిత్రసీమలోకి అడుగుపెట్టింది. స్కూల్ అమ్మాయిగా ఆమె నటనకు తమిళ అభిమానుల నుంచి మంచి ఆదరణ లభించింది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి :కోయ్.. కోయ్..కాకరేపిందిరోయ్..! అప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్.. ఇప్పుడు చూడచక్కని భామ

ఆతర్వాత శివకార్తికేయన్ సినిమాలో అవకాశం అందుకుంది. ఈ అమ్మడు తమిళ్, మళయాళంలోనే ఎక్కువ సినిమాలు చేసింది. అలాగే తెలుగులో ఇది నా లవ్ స్టోరీ అనే సినిమాలో కనిపించింది. కాంచన 3లో కూడా నటించింది ఈ అమ్మడు. అలాగే బిగ్ బాస్ తమిళ సీజన్ 1లో నటి ఓవియా పాల్గొని అభిమానులను ఆకట్టుకుంది. రీసెంట్ గా ఓవియాకు ఓ బిడ్డ ఉందంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీని పై క్లారిటీ ఇస్తూ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేసింది. నాకు దుబాయ్‌లో ఓ కొడుకు ఉన్నాడు. ఇది నా పెంపుడు కుక్క..  దానిని చూసుకోవడం నాకు చాలా ఇష్టం. ఇంకా పెళ్లి చేసుకుని బిడ్డను కనాలనే కోరిక తనకు లేదని నటి ఓవియా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ కామెంట్స్ ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతున్నాయి.

View this post on Instagram

A post shared by Oviya (@happyovi)

మరిన్ని సినిమా వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి