- Telugu News Photo Gallery Cinema photos Director Shankar Not Happy With Ram Charan's Game Changer Movie OutPut
Game Changer: మెగా అభిమానులకు షాక్ ఇచ్చిన శంకర్..
మెగా అభిమానులకు షాక్ ఇచ్చే స్టేట్మెంట్ ఇచ్చారు గ్రేట్ డైరెక్టర్ శంకర్. సాధారణంగా ఏ దర్శకుడైనా తాను వందకు వంద శాతం సాటిస్‌ఫై అయితే ఆ సినిమాను ఆడియన్స్ ముందుకు తీసుకువస్తారు. అదే పాన్ ఇండియా సినిమా అయితే అవుట్‌పుట్ విషయంలో మరింత జాగ్రత్తగా ప్లాన్ చేస్తారు. కానీ శంకర్ మాత్రం గేమ్ చేంజర్ అవుట్‌పుట్ విషయంలో ఐయామ్ నాట్ హ్యాపీ అని ఓపెన్‌గా చెప్పేశారు.
Updated on: Jan 16, 2025 | 7:55 PM

సంక్రాంతి కానుకగా జనవరి 10న ఆడియన్స్ ముందుకు వచ్చింది గేమ్ చేంజర్. ట్రిపులార్ తరువాత రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన మూవీ కావటంతో ఈ సినిమా మీద ఆడియన్స్‌లో భారీ అంచనాలు ఉన్నాయి.

అందుకు తగ్గట్టుగా బిగ్ స్కేల్‌లో రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఆఫ్టర్ రిలీజ్ గేమ్ చేంజర్ సినిమా గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు దర్శకుడు శంకర్. ఈ సినిమా అవుట్‌పుట్ విషయంలో తాను పూర్తిగా సాటిస్‌ఫై కాలేదన్నారు.

దీంతో 'దర్శకుడే పూర్తిగా సాటిస్‌ఫై కాకపోతే ఇక ఆడియన్స్ పరిస్థితి ఏంటి? నాలుగేళ్ల పాటు ఈ సినిమా మీదే వర్క్ చేసిన శంకర్, పూర్తిగా ఓకే అనిపించని, అవుట్‌పుట్‌ను ఆడియన్స్ ముందుకు ఎందుకు తీసుకువచ్చారు?' అన్న క్వశ్చన్స్ రెయిజ్ అవుతున్నాయి.

గేమ్ చేంజర్ సినిమా ఫైనల్ కట్ 5 గంటలు వచ్చిందన్న శంకర్, ఆ సినిమాను ట్రిమ్ చేయటం మీద కూడా స్పందించారు. తెలుగు ఆడియన్స్ లెంగ్తీ మూవీస్ చూడరన్న ఉద్దేశంతోనే సినిమా నిడివిని తగ్గించామని తెలిపారు.

మినిమమ్ మూడు గంటల నిడివితో రిలీజ్ చేసి ఉంటే... ఇంకా మంచి డిటైలింగ్ ఉండేదన్నారు. శంకర్ లాంటి దర్శకుడు స్వయంగా తన అవుట్‌పుట్ మీద తానే కామెంట్ చేయటం ఇప్పుడు ఇండస్ట్రీ సర్కిల్స్‌లో హాట్ టాపిక్ అవుతోంది.




