Actress : ఆ ఎనర్జీ ఏంటండీ బాబూ.. 47 ఏళ్ల వయసులో బైక్ పై స్టంట్స్.. నెట్టింట హీరోయిన్ అరాచకం..
ఆత్మ విశ్వాసం.. జీవితం ఎలా సాగాలో నిర్ణయిస్తుంది. ప్రేమ, పెళ్లి, విడాకులు, కూతురు దూరం కావడం ఆమెను మానసికంగా కుంగదీశాయి. కానీ తనపై నమ్మకంతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. భర్త కోసం సినిమాలకు దూరమైన ఆమె.. డివోర్స్ తర్వాత తిరిగి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. 47 ఏళ్ల వయసులో కుర్ర హీరోయిన్లు పోటీగా అద్భుతమైన ఫిట్నెస్ తో కట్టిపడేస్తుంది.

ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోయిన్లు సత్తా చాటుతున్న సంగతి తెలిసిందే. కుర్ర హీరోయిన్లకు పోటీగా బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరిస్తున్నారు. అలాగే ఫిట్నెస్, లుక్స్ విషయంలోనూ ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా ఓ హీరోయిన్ 47 ఏళ్ల వయసులో బైక్ పై స్టంట్స్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇప్పుడు ఆమెకు సంబంధించిన క్రేజీ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. ఆమె ఎవరో తెలుసా.. ? తనే హీరోయిన్ మంజు వారియర్. తమిళం, మలయాళంలో టాప్ హీరోయిన్. ఇప్పటికీ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరిస్తుంది. సినిమాలతోపాటు ఆమెకు బైక్ డ్రైవ్ చేయడం అంటే చాలా ఇష్టం.
ఇవి కూడా చదవండి : Upendra : ఉపేంద్రతో ప్రేమాయణం.. ఇన్నాళ్లకు ఓపెన్ అయిన హీరోయిన్.. ఏమన్నారంటే..
ప్రస్తుతం మంజు దగ్గర BMW R1250GS బైక్ ఉంది. సినిమా షూటింగ్స్ నుంచి కాస్త విరామం దొరికితే చాలు బైక్ పై నగరాలను చుట్టేస్తుంది. తాజాగా ఈ అమ్మడు తన బైక్ పై స్టంట్స్ చేసింది. బైక్ పై నిల్చుని నడుపుతూ అందరినీ షాక్ కు గురి చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరలవుతుంది. మంజు ఈ అడ్వెంచర్ కేటగిరీకి చెందిన ఈ BMW R1250GS బైక్‌ను దాదాపు రూ. 28 లక్షలకు కొనుగోలు చేసింది. గతంలో సూపర్ స్టార్ అజిత్ కుమార్ తన 2500 కి.మీ లడఖ్ బైక్ ట్రిప్‌లో మంజు వారియర్ కూడా ఉన్నారు. ఈ ట్రిప్ తర్వాత తనకు సొంతంగా బైక్ నడపాలనే కోరిక కలిగిందని మంజు వారియర్ ఇంటర్వ్యూలలో చెప్పారు. ఆ తర్వాతే మంజు బైక్ నడపడానికి లైసెన్స్ పొందింది.
ఇవి కూడా చదవండి : Actress : చిరంజీవి, మహేష్ బాబుతో సినిమాలు.. 51 ఏళ్ల వయసులో తరగని అందం.. క్యాన్సర్‌ను గెలిచి.. ఇప్పుడు ఇలా..
జర్మన్ లగ్జరీ ద్విచక్ర వాహన బ్రాండ్ BMW Motorrad భారత మార్కెట్లో BMW R 1250 GS, R 1250 GS అడ్వెంచర్ బైక్స్ విడుదల చేసింది. భారతదేశంలో ఎక్స్-షోరూమ్ ధరలు వరుసగా రూ. 20.45 లక్షలు, రూ. 22.40 లక్షల నుండి ప్రారంభమవుతాయి. ఇప్పుడు మంజు డ్రైవ్ చేసిన బైక్ సైతం ఈ కేటగిరికి చెందినదే. ఇవి కూడా చదవండి : Raasi: ఆ సినిమా వల్లే కెరీర్ నాశనమైంది.. మొదటి రోజే అలాంటి సీన్ చేయించారు.. హీరోయిన్ రాశి..
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Megastar Chiranjeevi : అందుకే చిరంజీవితో సినిమా చేయలేదు.. అసలు విషయం చెప్పిన హీరోయిన్..




