Tollywood : తెలుగులో బ్లాక్ బస్టర్ హీరోయిన్.. వ్యభిచారం కేసులో జైలుకు.. ఒక్క తప్పుతో కెరీర్ నాశనం..?
తెలుగు సినిమా ప్రపంచంలో మొదటి సినిమాతోనే గుర్తింపు తెచ్చుకున్న తారలు చాలా మంది ఉన్నారు. కానీ ఆ తర్వాత వరుస సినిమాలు చేయకుండా ఊహించని విధంగా ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఓవర్ నైట్ స్టార్ డమ్ సొంతం చేసుకున్న కొందరు హీరోయిన్లు అనుకోని కేసులలో చిక్కుకుని కెరీర్ ముగింపు పలికారు. అందులో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ ఒకరు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవర్ గ్రీన్ హిట్ మూవీల్లో ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు ఒకటి. విక్టరీ వెంకటేశ్ హీరోగా నటించిన ఈ సినిమా అప్పట్లో భారీ విజయాన్ని అందుకుంది. ఇందులో హీరోయిన్ సౌందర్యతోపాటు.. వినీత సైతం ప్రధాన పాత్ర పోషించింది. ఈ మూవీతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది హీరోయిన్ వినీత. ఆమె అసలు పేరు లక్ష్మి, కానీ సినిమాల్లోకి వచ్చాకా వినీతగా మార్చుకుంది. 1993లో శరత్ కుమార్ హీరోగా వచ్చిన కట్ట బొమ్మన్ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టింది. మొదటి సినిమా అంతగా ఆకట్టుకోలేదు. ఆ తర్వాత ఊజియన్ సినిమాతో గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళం భాషలలో కలిపి దాదాపు 70కి పైగా సినిమాల్లో నటించింది. తెలుగులో అల్లుడు పోరు అమ్మాయి జోరు సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.
ఇవి కూడా చదవండి : Megastar Chiranjeevi : అందుకే చిరంజీవితో సినిమా చేయలేదు.. అసలు విషయం చెప్పిన హీరోయిన్..
కానీ ఆమెకు పేరు తెచ్చిపెట్టిన సినిమా మాత్రం ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు. డైరెక్టర్ ఈవీవీ సత్యనారాయణ తెరకెక్కించిన ఈ మూవీ అప్పట్లో భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నేపాల్ అమ్మాయి మనీషా పాత్రలో నటించి ఆకట్టుకుంది. అప్పట్లో ఆమె లుక్స్, యాక్టింగ్ జనాలను కట్టిపడేశాయి. ఈ సినిమాతో ఆమెకు మంచి పేరు వచ్చింది. అలాగే అవకాశాలు కూడా వచ్చాయి. కానీ ఆ తర్వాత ఆమె పలు వివాదాల్లో చిక్కుకోవడంతో కెరీర్ పడిపోయింది.
ఇవి కూడా చదవండి : Raasi: ఆ సినిమా వల్లే కెరీర్ నాశనమైంది.. మొదటి రోజే అలాంటి సీన్ చేయించారు.. హీరోయిన్ రాశి..
2003లో ఆమె వ్యభిచారం కేసులో అరెస్ట్ అయ్యి జైలు పాలు అయ్యింది. ఆ తర్వాత బెయిల్ పై విడుదలైంది. కొన్నాళ్లకు ఆ కేసుతో ఆమెకు సంబంధం లేదని.. ఎలాంటి తప్పు చేయలేదని తేలింది. కానీ అప్పటికే ఆమె కెరీర్ ముగిసింది. సినిమా అవకాశాలు రాలేదు. ఆఫర్స్ కోసం ట్రై చేసినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదు. మిస్ ఇండియా కంటెస్టెంట్ అయిన చేయని తప్పుకు జైలుకు వెళ్లడం.. తర్వాత ఇండస్ట్రీలో ఆఫర్స్ తగ్గిపోవడంతో సినిమాలకు పూర్తిగా దూరమయ్యింది. ఇప్పుడు ఇండస్ట్రీతోపాటు సోషల్ మీడియాకు సైతం దూరంగా ఉంటుంది వినీత.
ఇవి కూడా చదవండి : Actress : చిరంజీవి, మహేష్ బాబుతో సినిమాలు.. 51 ఏళ్ల వయసులో తరగని అందం.. క్యాన్సర్‌ను గెలిచి.. ఇప్పుడు ఇలా..

Vineetha News
ఇవి కూడా చదవండి : Upendra : ఉపేంద్రతో ప్రేమాయణం.. ఇన్నాళ్లకు ఓపెన్ అయిన హీరోయిన్.. ఏమన్నారంటే..
