Lokah Movie : లోక సినిమాకు ఫస్ట్ ఛాయిస్ మీరేనా.. ? అసలు విషయం చెప్పిన హీరోయిన్..
ఇటీవల ఓ చిన్న సినిమా బాక్సాఫీస్ వద్ద తుఫాను సృష్టించిన సంగతి తెలిసిందే. లేడీ ఓరియెంటెడ్ కథ అయినప్పటికీ మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈ సినిమాతో చాలా కాలంగా హిట్టు కోసం వెయిట్ చేస్తున్న హీరోయిన్ కెరీర్ మలుపు తిప్పింది. మనం మాట్లాడుకుంటున్న ఆ సినిమా పేరు లోక చాప్టర్ 1. ఈ సినిమాలో కళ్యాణి ప్రియదర్శన్ కథానాయికగా నటించింది.

ఇటీవల మలయాళీ ఇండస్ట్రీని షేక్ చేసిన సినిమా లోక చాప్టర్ 1. ఇందులో కళ్యాణి ప్రియదర్శన్ కథానాయికగా నటించింది. చాలా కాలంగా హీరోయిన్ గా వరుస సినిమాలు చేస్తున్న కళ్యాణి కెరీర్ మలుపు తిప్పింది ఈసినిమా. దీంతో సౌత్ ఇండస్ట్రీలో ఆమె పేరు మారుమోగింది. విభిన్న కాన్సెప్ట్… లేడీ ఓరియెంటెడ్ డ్రామగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రానికి మలయాళీ డైరెక్టర్ డామినిక్ అరుణ్ దర్శకత్వం వహించారు. మలయాళంతోపాటు ఈ చిత్రాన్ని తెలుగులోనూ రిలీజ్ చేశారు. లోక చాప్టర్ 1 పేరుతో తెలుగులోకి వచ్చిన ఈ సినిమాకు దుల్కర్ సల్మాన్ నిర్మాతగా వ్యవహరించారు.
ఇవి కూడా చదవండి : Megastar Chiranjeevi : అందుకే చిరంజీవితో సినిమా చేయలేదు.. అసలు విషయం చెప్పిన హీరోయిన్..
గతేడాది ఆగస్టులో విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అలాగే అటు ఓటీటీలోనూ ఈ చిత్రానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాలో కళ్యాణి కంటే ముందు పార్వతి తిరువోతును కథానాయికగా అనుకున్నారట. ఇదే విషయంపై ఆమెను చిత్రయూనిట్ సంప్రదించిందని.. కానీ కొన్ని కారణాలతో ఆమె ఈ చిత్రాన్ని మిస్సైందంటూ సోషల్ మీడియాలో ప్రచారం నడిచింది. అయితే తాజాగా ఈ రూమర్స్ పై స్పందించింది పార్వతి.
ఇవి కూడా చదవండి : Raasi: ఆ సినిమా వల్లే కెరీర్ నాశనమైంది.. మొదటి రోజే అలాంటి సీన్ చేయించారు.. హీరోయిన్ రాశి..
మలయాళం, తమిళం భాషలలో విభిన్న కంటెంట్ చిత్రాలతో వరుసగా సక్సెస్ అందుకుంటుంది పార్వతి తిరువోతు. ఇప్పుడు ఆమెన ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ మూవీ ప్రతమదృష్ట్య కుట్టకర్. ఈ మూవీ టైటిల్ లాంచ్ వేడుకకు పార్వతి సైతం హాజరైంది. ఈ సందర్భంగా ఆమెకు లోక సినిమా ఆఫర్ వచ్చిందా ? అని అడగ్గా.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఇలాంటి ప్రశ్నలు అడగడం అనవసరం అని.. ఇలాంటి రూమర్స్ ఇంకా చాలా వింటుంటారని.. మీకు నచ్చింది మీరు వినుకోండి అంటూ చెప్పుకొచ్చింది. దీంతో ఇప్పుడు ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
ఇవి కూడా చదవండి : Actress : చిరంజీవి, మహేష్ బాబుతో సినిమాలు.. 51 ఏళ్ల వయసులో తరగని అందం.. క్యాన్సర్‌ను గెలిచి.. ఇప్పుడు ఇలా..
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Upendra : ఉపేంద్రతో ప్రేమాయణం.. ఇన్నాళ్లకు ఓపెన్ అయిన హీరోయిన్.. ఏమన్నారంటే..
