AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manjima Mohan: బాడీ షేమింగ్ కామెంట్స్ పై స్పందించిన కొత్త పెళ్లి కూతురు.. ఒక్కమాటతో భలే గడ్డిపెట్టింది..

నెట్టింట మంజిమాను ట్రోల్స్ చేశారు. అయితే ఈ హీరోయిన్ ను ఇలా ట్రోల్ చేయడం మొదటి సారి కాదు. గతంలోనూ అనేకసార్లు మంజిమాను బాడీ షేమింగ్ చేస్తూ దారుణంగా ట్రోల్ చేశారు. తాజాగా ఇండియా టూడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంజిమా మాట్లాడుతూ.. ట్రోలింగ్స్ తన వ్యక్తిగత జీవితంపై ఇక ప్రభావం చూపించవని అన్నారు.

Manjima Mohan: బాడీ షేమింగ్ కామెంట్స్ పై స్పందించిన కొత్త పెళ్లి కూతురు.. ఒక్కమాటతో భలే గడ్డిపెట్టింది..
Manjima Mohan
Rajitha Chanti
|

Updated on: Nov 30, 2022 | 5:18 PM

Share

కోలీవుడ్ ప్రేమ పక్షులు మంజిమా మోహన్, హీరో గౌతమ్ కార్తిక్ దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసింది. ఎంతోకాలం నుంచి ప్రేమలో ఉన్న వీరిద్దరూ ఇరు కుటుంబసభ్యుల అంగీకారంతో సోమవారం పెళ్లి పీటలెక్కారు. కుటుంబసభ్యులు, అతికొద్ది మంది సన్నిహితులు, స్నేహితల సమక్షంలో చెన్నైలోని ఓ హోటల్‌లో గౌతమ్, మంజిమాల పెళ్లి వేడుకగా జరిగింది. వీరి వివాహానికి సంబంధించిన ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఈ నూతన వధూవరులకు సినీప్రముఖులు.. అభిమానులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెప్పారు. మరోవైపు మంజిమా శారీరాకృతి గురించి కొందరు అసభ్యంగా కామెంట్స్ చేశారు. నెట్టింట మంజిమాను ట్రోల్స్ చేశారు. అయితే ఈ హీరోయిన్ ను ఇలా ట్రోల్ చేయడం మొదటి సారి కాదు. గతంలోనూ అనేకసార్లు మంజిమాను బాడీ షేమింగ్ చేస్తూ దారుణంగా ట్రోల్ చేశారు. తాజాగా ఇండియా టూడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంజిమా మాట్లాడుతూ.. ట్రోలింగ్స్ తన వ్యక్తిగత జీవితంపై ఇక ప్రభావం చూపించవని అన్నారు.

మంజిమా మాట్లాడుతూ.. “సోషల్ మీడియాలో నన్ను బాడీ షేమింగ్ చేసే ట్రోలింగ్స్.. ఇకపై నాపై ఎలాంటి ప్రభావం చూపించవు. అవసరమైతో నేను లావు తగ్గుతాను. నిజానికి మా పెళ్లిలో కూడా కొంతమంది శరీరాకృతి గురించి మాట్లాడారు. గతంలో కూడా ఇలా ట్రోలింగ్స్ జరిగాయి. కానీ ఇప్పుడు నేను నా శరీరంతో సౌకర్యవంతంగా ఉన్నాను. నేను కోరుకున్నప్పుడు బరువు తగ్గుతానని నాకు తెలుసు. నేను ఫిట్‌నెస్‌లో ఉన్నాను. నేను నాతో సంతోషంగా ఉన్నాను. నాకు బరువు తగ్గడానికి వృత్తిపరమైన నిబద్ధత ఉన్నప్పుడు నేను ఖచ్చితంగా తగ్గేస్తాను. కానీ నేను లావుగా ఉండడం ఇతరులను ఎందుకు ప్రభావితం చేస్తుందో నాకు తెలియదు.” అంటూ చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

హీరోయిన్ మంజిమా మోహన్ … హీరో గౌతమ్ కార్తీక్ గత మూడేళ్లుగా ప్రేమలో ఉన్నారు. మంజిమా, గౌతమ్ కార్తిక్ ఇద్దరూ కలిసి దేవరట్టం అనే చిత్రంలో నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరి ప్రేమకు పునాది పడింది. మొదట మంచి స్నేహితులుగా మారారు. ఆతర్వాత ఫ్రెండ్‌షిప్‌ కాస్తా ప్రేమగా చిగురించింది. పెళ్లి తర్వాత కూడా తాను సినిమాలు చేస్తానని.. మంచి స్క్రిప్ట్ వస్తే త్వరలోనే ప్రేక్షకుల ముందుకు వస్తానని తెలిపింది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.