Malaika Arora: 50 ఏళ్ల వయసులో అప్సరసలా.. మలైకా ఫిట్నెస్ సీక్రెట్ ఇదేనట..
యాభై ఏళ్లు దాటినా ఇప్పటికీ కుర్రహీరోయిన్లకు ధీటుగా ఫిట్నెస్ మెయింటెన్ చేస్తుంది హీరోయిన్ మలైకా అరోరా. తాజాగా తన ఫిట్‌నెస్, ఆరోగ్య రహస్యాలను వెల్లడించింది. సాయంత్రం 7 గంటల తర్వాత ఆమె ఏమీ తినదని.. యోగా, సమతుల్య ఆహారం తీసుకుంటానని చెప్పుకొచ్చింది. ఇక మలైకా ఫిట్నెస్ రహస్యాలు ఏంటో తెలుసుకుందామా.

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు వెలుగు వెలిగిన హీరోయిన్ మలైకా అరోరా. ముఖ్యంగా అప్పట్లో ఆమె స్పెషల్ పాటలకు కేరాఫ్ అడ్రస్. అందం, అభినయంతో కుర్రకారును ఊర్రూతలూగించింది. ప్రస్తుతం ఆమె వయసు 50 సంవత్సరాలు. ఇప్పటికీ తరగని అందంతో మెస్మరైజ్ చేస్తుంటుంది. ఐదు పదుల వయసులోనూ మలైకా అరోరా చాలా ఫిట్‌గా, ఎనర్జిటిక్‌గా కనిపిస్తోంది . మలైకా ఫిట్‌నెస్ అందం చాలా మంది యువ నటీమణులతో పోటీ పడుతోంది. మలైకా యోగా, జిమ్, డైట్‌లను ఖచ్చితంగా పాటిస్తూ తనను తాను ఫిట్‌గా మెయింటెన్ చేస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా తన డైట్ సీక్రెట్ వెల్లడించింది మలైకా.
ఆమె సాయంత్రం 7 గంటల తర్వాత ఏమీ తినదని ఒక యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. అలాగే తన ఫిట్‌నెస్ రహస్యాన్ని వెల్లడించింది. మలైకా మాట్లాడుతూ.. “నేను సూర్యాస్తమయం తర్వాత ఏమీ తినను. నా చివరి భోజనం సాయంత్రం 7 గంటలకు. ఆ తర్వాత, మరుసటి రోజు నేను వెంటనే తింటాను. మరుసటి రోజు కూడా నేను మేల్కొన్న వెంటనే ఏమీ తినను” అని మలైకా చెప్పుకొచ్చింది. “నిద్ర లేవగానే ఒక చెంచా నెయ్యి మాత్రమే తింటాను. తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు కడుపు నిండేలా భోజనం చేస్తాను. అందులో అన్నం, చపాతీ, కూరగాయలు మొదలైనవి ఉంటాయి. ఒక నిర్దిష్ట వయస్సు తర్వాత, మీకు అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఆహారాన్ని నియంత్రించుకోవడం అవసరం” అని అన్నారు.
అలాగే తానెప్పుడు కేలరీలను లెక్కించనని.. లెక్కపరంగా తినడానికి ఇష్టపడతానని అన్నారు. తాను ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తానని.. అలాగే చాలా బాగా నిద్రపోతానని.. ప్రతి రెండు రోజులకు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేస్తానని.. ఉపవాసం, డైటింగ్ మధ్య చాలా తేడా ఉందని.. తాను ఒక స్థిర షెడ్యూల్ పాటిస్తానని.. అప్పుడు తాను ఎప్పుడూ ఏమీ తిననని చెప్పుకొచ్చింది.
View this post on Instagram
ఇవి కూడా చదవండి :
Pakeezah Vasuki: అయ్యో పాపం.. దీనస్థితిలో ఒకప్పటి కమెడియన్ పాకీజా.. సాయం చేయాలంటూ కన్నీళ్లు..
Telugu Cinema: అయ్య బాబోయ్.. ఈ హీరోయిన్ ఏంటీ ఇట్టా మారిపోయింది.. ? భయపెడుతున్న అందాల రాశి న్యూలుక్..
Tollywood: 42 ఏళ్ల వయసులో గ్లామర్ బ్యూటీ అరాచకం.. తల్లైన తగ్గని సోయగం.. నెట్టింట ఫోటోస్ వైరల్..








