Lavanya Tripathi: పెళ్లి తరువాత ఫస్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన మెగా కోడలు.. హీరో ఎవరంటే
వైవిధ్యమైన పాత్రలతో కథానాయికగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న హీరోయిన్ లావణ్య త్రిపాఠి. ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న సినిమా ‘సతీ లీలావతి’. దుర్గాదేవి పిక్చర్స్, ట్రియో స్టూడియోస్ పతాకాల సంయుక్త నిర్మాణ సారథ్యంలో ప్రొడక్షన్ నెం.1గా ఈ సినిమా రూపొందనుంది.

మెగా హీరో వరుణ్ తేజ్ అందాల భామ లావణ్య త్రిపాఠిని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. హీరోయిన్ లావణ్య అందాల రాక్షసి సినిమాతో హీరోయిన్ గా అడుగుపెట్టింది. హనురాఘవపుడి దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాలో లావణ్య తన అందం, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఇక ఈ సినిమా తర్వాత వరుసగా అవకాశాలు అందుకుంది ఈ చిన్నది. కానీ అనుకున్నంత గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. ఇక ఈ అమ్మడు మెగా హీరో వరుణ్ తేజ్ ను ప్రేమించి పెళ్లాడింది. ఈ ఇద్దరూ కలిసి మిస్టర్, అంతరిక్షం సినిమాలు చేశారు. మిస్టర్ సినిమా సమయంలో ఈ ఇద్దరూ ప్రేమలో పడ్డారు.
చాలా కాలం ఈ ఇద్దరూ తమ ప్రేమను సీక్రెట్ గా ఉంచారు. ఎంగేజ్ మెంట్ కూడా సైలెంట్ గానే చేసుకున్నారు. అలాగే పెళ్లి కూడా విదేశంలో చేసుకున్నారు. ఆ తర్వాత సుమారు ఏడాదిపాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చింది లావణ్య. అయితే ఈ చిన్నది సినిమాలకు గుడ్ బై చెప్పేసిందని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు పెళ్లి తర్వాత తొలి సినిమాను అనౌన్స్ చేసింది. లావణ్య ప్రధాన పాత్రలో తెరకెక్కనున్న సినిమా ‘సతీ లీలావతి’. దుర్గాదేవి పిక్చర్స్, ట్రియో స్టూడియోస్ పతాకాల సంయుక్త నిర్మాణ సారథ్యంలో ప్రొడక్షన్ నెం.1గా ఈ సినిమా రూపొందనుంది.
తాజగా ఈ సినిమా పూజాకార్యక్రమాలతో మొదలైంది. ఈ సినిమాకు తాతినేని సత్య దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ఆయన భీమిలీ కబడ్డీ జట్టు, ఎస్.ఎం.ఎస్(శివ మనసులో శృతి) వంటి సినిమాలను తెరకెక్కించాడు. ఈ సినిమాలో లావణ్యకు జోడిగా దేవ్ మోహన్ నటిస్తున్నాడు. ఈ సినిమా రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతుంది. మరి ఈ సినిమా లావణ్యకు ఎలాంటి హిట్ ఇస్తుందో చూడాలి. ఈ సినిమా లావణ్యపెళ్లి తరువాత ఫస్ట్ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన మెగా కోడలు తర్వాత వరుసగా మరిన్ని సినిమాలు లైనప్ చేయనుందని తెలుస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి