AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajinikanth: నేను రజనీకాంత్ సార్ ను కొట్టాలా?.. సినిమానే చేయనంటూ వెళ్లిపోయిన స్టార్ హీరోయిన్.. ఎవరంటే?

కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇప్పుడు జైలర్ 2 సినిమా షూటింగ్ లో బిజీగా ఉంటున్నారు. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే లేటెస్ట్ గా రజనీకాంత్ గురించి ఒక ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.

Rajinikanth: నేను రజనీకాంత్ సార్ ను కొట్టాలా?.. సినిమానే చేయనంటూ వెళ్లిపోయిన స్టార్ హీరోయిన్.. ఎవరంటే?
Rajinikanth
Basha Shek
|

Updated on: Apr 03, 2026 | 10:38 AM

Share

కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆయనకు ఇండియాలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ఫ్యాన్స్ కోసమే 75 ఏళ్లు దాటినా మరీ సినిమాలు చేస్తున్నారు రజనీ. తనదైన స్టైల్ , యాక్షన్ తో అభిమానులను అలరిస్తున్నారు. ఇదిలా ఉంటే రజనీకాంత్ అభిమానులకు భయపడి ఆయనతో నటించే అవకాశాన్ని కోల్పోయిందీ స్టార్ హీరోయిన్. సినిమాలో రజనీకాంత్ ను కొట్టే సీన్ ఉండడంతో ‘అయ్యయ్యో ఆ సీన్‌లో నేను అస్సలు నటించలేను’ అని సినిమానే వదిలేసి వెళ్లిపోయిందట. ఆమె మరెవరో కాదు అలనాటి అందాల తార ఖుష్బూ సుందర్. వివరాల్లోకి వెళితే.. పి. వాసు దర్శకత్వంలో ప్రభు-ఖుష్బూ జంటగా నటించిన ‘చిన్నతంబి’ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. దీంతో రజనీకాంత్- ఖుష్బూల కాంబినేషన్ లో మరో సినిమా చేయడానికి వాసు కమిట్ అయ్యారు. అయితే కథ విన్న ఖుష్బూ షాక్ అయ్యిందట. కథ బాగా నచ్చినా అందులో నటించడానికి మాత్రం ఒప్పుకోలేదట.

ఈ సినిమాలో రజనీకాంత్‌ ఒక కార్మికుడిగా కనిపిస్తారని, ఆయనను చెంపదెబ్బ కొట్టాలని పి. వాసు చెప్పగానే ఖుష్బూ వెంటనే రిజెక్ట్ చేసిందట.. ‘అయ్యయ్యో ఆ సీన్‌లో నేను అస్సలు నటించలేను’ అని ఖుష్బూ ముఖం మీదే చెప్పేసిదంట. ‘మీరు రజనీకాంత్‌కు సమానమైన పవర్‌ ఫుల్ నటిని పెడితేనే ప్రేక్షకులు అంగీకరిస్తారు. నేను రజనీ కాంత్ సార్‌ను కొడితే ప్రేక్షకులు అస్సలు ఒప్పుకోరు. ముఖ్యంగా ఆయన అభిమానులు థియేటర్లలో స్క్రీన్లు చించేస్తారు. ఎందుకంటే రజనీకాంత్ అభిమానులు ఆయనపై అంత ప్రేమ చూపిస్తారు’ అని చెప్పిందట. ఖుష్బూ మాటలు విన్న సుందర్ కూడా రియలైజ్ అయ్యారట. వెంటనే ఖుష్బూ స్థానంలో అప్పట్లో తెలుగులో టాప్ హీరోయిన్‌గా ఉన్న విజయశాంతిని ఆ పాత్రకు తీసుకున్నారు. అయితే, కథ బాగా నచ్చడంతో హీరోయిన్‌గా కాకపోయినా ఏదైనా చిన్న పాత్ర ఇవ్వమని ఖుష్బూ దర్శకుడిని అడిగిందట. అలా మన్నన్ సినిమాలో విజయశాంతికి పీఏగా, రజినీకాంత్ ప్రేయసిగా కొన్ని సీన్లలో మాత్రమే ఖుష్బూ కనిపిస్తుంది.

ఇవి కూడా చదవండి

ఈ విషయాన్ని దర్శకుడు పి. వాసు ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు, ‘ఖుష్బూకి అస్సలు ఈగో ఉండదు. అందుకే నా సినిమాల్లో ఎక్కువగా నటిస్తుంది. సినిమా బాగా రావాలని ఆమె చాలా కష్టపడుతుంది’ అని ప్రశంసల వర్షం కురిపించారు.

ఖుష్బూ సుందర్ ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఒక్క సినిమాలోనే 30 లిప్ లాక్స్ సీన్స్.. ఇప్పుడు కనిపించకుండా..
ఒక్క సినిమాలోనే 30 లిప్ లాక్స్ సీన్స్.. ఇప్పుడు కనిపించకుండా..
మండే వేసవిలో కూల్ ట్రిప్.. హైదరాబాద్ నుంచి కశ్మీర్‌కు IRCTC సూపర్
మండే వేసవిలో కూల్ ట్రిప్.. హైదరాబాద్ నుంచి కశ్మీర్‌కు IRCTC సూపర్
శరీరాన్ని చిటికెలో చల్ల బరిచే ఈ ఐరన్ గారెలు ప్రతి ఒక్కరు తినాలి..
శరీరాన్ని చిటికెలో చల్ల బరిచే ఈ ఐరన్ గారెలు ప్రతి ఒక్కరు తినాలి..
హెడ్‎ను క్లీన్ బౌల్డ్ చేసిన రసిఖ్.. కోహ్లీ అగ్రెసివ్ సెలబ్రేషన్స్
హెడ్‎ను క్లీన్ బౌల్డ్ చేసిన రసిఖ్.. కోహ్లీ అగ్రెసివ్ సెలబ్రేషన్స్
ఎమర్జెన్సీ ఫండ్‌ ఎలా క్రియేట్‌ చేసుకోవాలి?
ఎమర్జెన్సీ ఫండ్‌ ఎలా క్రియేట్‌ చేసుకోవాలి?
సీఎం విజయ్ రియల్ క్యారెక్టర్‌ను బయటపెట్టిన హెయిర్ స్టైలిస్ట్!
సీఎం విజయ్ రియల్ క్యారెక్టర్‌ను బయటపెట్టిన హెయిర్ స్టైలిస్ట్!
అతిపెద్ద డిజాస్టర్.. అయినా ఓటీటీలో తెగ చూస్తున్న జనాలు..
అతిపెద్ద డిజాస్టర్.. అయినా ఓటీటీలో తెగ చూస్తున్న జనాలు..
రోజూ తాగే స్వీట్ డ్రింక్స్ ప్రాణాంతకం..? ఏటా 3.4 లక్షల మరణాలు!
రోజూ తాగే స్వీట్ డ్రింక్స్ ప్రాణాంతకం..? ఏటా 3.4 లక్షల మరణాలు!
ఎస్‌బీఐ శాఖలు మూతపడనున్నాయా..? బ్యాంకు ఏం చెప్పిందంటే..
ఎస్‌బీఐ శాఖలు మూతపడనున్నాయా..? బ్యాంకు ఏం చెప్పిందంటే..
వార్నీ.. పురుగులను బిర్యానీలా తినే వింత మొక్క..
వార్నీ.. పురుగులను బిర్యానీలా తినే వింత మొక్క..