AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

khushsundar: కోకిక్స్ ఎముక సమస్యతో బాధపడుతున్న ఖుష్బూ.. సర్జరీ సక్సెస్.. కోలుకుంటున్న సీనియర్ నటి..

చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరిన ఖుష్బూ తాజాగా ఓ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఖుష్బూ ఆసుపత్రి బెడ్‌పై పడుకున్న ఉన్న ఫోటోని అభిమానులతో పంచుకుంది. అంతేకాదు తాను అనారోగ్యంతో ఆస్పత్రి చికిత్స తీసుకుని ఇప్పుడు తాను కోలుకుంటున్నానని తెలిపింది. ఖుష్బూ ఆసుపత్రి బెడ్‌పై ఉన్న ఫోటోని చూసిన అభిమానులు త్వరగా కోలుకోవాలని కోరుతూ కామెంట్ చేస్తున్నారు. 

khushsundar: కోకిక్స్ ఎముక సమస్యతో బాధపడుతున్న ఖుష్బూ.. సర్జరీ సక్సెస్.. కోలుకుంటున్న సీనియర్ నటి..
Khushsundar
Surya Kala
|

Updated on: Jun 24, 2023 | 8:02 AM

Share

బాలనటి నుంచి స్టార్ హీరోయిన్ గా దక్షిణాది చలన చిత్ర పరిశ్రమను ఏలిన అందాల సుందరి సీనియర్ నటి  ఖుష్బూ రాజకీయాల్లో అడుగు పెట్టాడు. అక్కడ కూడా తనదైన శైలిలో స్పందిస్తూ  తమిళనాడు రాజకీయాల్లో వార్తల్లో  నిలిచిన నటి ఖుష్బూ అస్వస్థతకు గురయ్యారు. చికిత్స నిమిత్తం ఆసుపత్రిలో చేరిన ఖుష్బూ తాజాగా ఓ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఖుష్బూ ఆసుపత్రి బెడ్‌పై పడుకున్న ఉన్న ఫోటోని అభిమానులతో పంచుకుంది. అంతేకాదు తాను అనారోగ్యంతో ఆస్పత్రి చికిత్స తీసుకుని ఇప్పుడు తాను కోలుకుంటున్నానని తెలిపింది. ఖుష్బూ ఆసుపత్రి బెడ్‌పై ఉన్న ఫోటోని చూసిన అభిమానులు త్వరగా కోలుకోవాలని కోరుతూ కామెంట్ చేస్తున్నారు.

కోకిక్స్ ఎముక సమస్యతో బాధపడుతున్న నటి ఖుష్బుకు శస్త్రచికిత్స జరిగింది. కోకిక్స్ ఎముక నొప్పి లేదా తోక ఎముక నొప్పి తీవ్రమైన కదలిక సమస్యలకు దారి తీస్తుంది. అంతేకాదు ఈ వ్యాధితో ఇబ్బందిపడేవారు కూర్చోవడానికి కూడా కష్టపడాలి. అంతేకాదు మలం వెళ్ళేటప్పుడు విపరీతమైన నొప్పితో ఇబ్బంది పడతారు. ఈ సమస్యను శస్త్రచికిత్స ద్వారా పరిష్కరించవచ్చు. ఇప్పుడు ఖుష్బు కూడా అదే సర్జరీ చేయించుకుంది. ఈ సర్జరీ తర్వాత కోలుకోవడానికి మరికొంత సమయం పడుతుందని చెబుతున్నారు. వీపు కింది భాగంలో కోతతో  సర్జరీ చేస్తారు. ఈ ఆపరేషన్ చేయించుకున్న రోగి నిద్రపోయే విధానంలో మార్పులు, ఇతర సమస్యలు తలెత్తుతాయి. ఇప్పుడు ఖుష్బు కూడా అదే సర్జరీ చేయించుకుని కోలుకుంటుంది.

ఇవి కూడా చదవండి

సీనియర్ నటి,  పొలిటిషియన్స్ ఖుష్బు తమిళనాడు బీజేపీకి చెందిన ఫేమస్ లీడర్. ఇటీవల తమిళనాడు అధికార డీఎంకే సీనియర్ ఎమ్మెల్యే శివాజీ కృష్ణమూర్తి ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ ఖుష్బుపై తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. అసలు ఖుష్బూ వంటి నటి ఉండకూడదు. అసలు ఆమె నటి కానేకాదన్నారు. ఖుష్బు ముసలి బాతులా ఉంది. మరి మీరు అంతా ఖుష్బు కావాలి, ఖుష్బు కావాలి అంటున్నారు. అయ్యో, ఆమె వృద్ధురాలు, మీరు ఆమెను ఎందుకు అడుగుతున్నారు.. అందరూ మౌనంగా ఉండండి అంటూ సంచలన కామెంట్స్ చేశారు.

శివాజీ కృష్ణమూర్తి తనపై చేసిన కామెంట్స్ ఫై ఖుష్బూ శివాజీపై ఫిర్యాదు చేశారు. దీంతో డీఎంకే పార్టీ అధినేత స్పందిస్తూ..శివాజీ కృష్ణమూర్తిని పార్టీ నుంచి బహిష్కరించింది. మరోవైపు పోలీసులు శివాజీపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

హిందీలో బాలనటిగా వెండి తెరపై అడుగు పెట్టిన ఖుష్బూ కలియుగ పాండవులు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది.  డీఎంకే పార్టీతో రాజకీయాల్లో అడుగు పెట్టిన ఖుష్బు ప్రస్తుతం బీజేపీ పార్టీలో ఉన్నారు. ఓ వైపు రాజకీయాల్లోనూ యాక్టివ్‌గా ఉంటూనే మరోవైపు సినిమాల్లో కూడా నటిస్తోంది.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

తగ్గేదే లే.. 91 ఏళ్ల వయసులోనూ సర్పంచ్‌ బరిలో.. పోటీకి కారణం ఇదే..
తగ్గేదే లే.. 91 ఏళ్ల వయసులోనూ సర్పంచ్‌ బరిలో.. పోటీకి కారణం ఇదే..
35 ఏళ్ల తర్వాత రీఎంట్రీ..ఒకప్పటి ఈ టాలీవుడ్ హీరోను గుర్తుపట్టారా?
35 ఏళ్ల తర్వాత రీఎంట్రీ..ఒకప్పటి ఈ టాలీవుడ్ హీరోను గుర్తుపట్టారా?
16 ఏళ్ల తర్వాత కోహ్లీ-రోహిత్ రీఎంట్రీ.. ఎప్పుడు ఆడతారంటే..?
16 ఏళ్ల తర్వాత కోహ్లీ-రోహిత్ రీఎంట్రీ.. ఎప్పుడు ఆడతారంటే..?
జామపండు మీ హెల్త్ గేమ్ ఛేంజర్.. రోజు ఒకటి తినడం వల్ల ఎన్ని లాభాలో
జామపండు మీ హెల్త్ గేమ్ ఛేంజర్.. రోజు ఒకటి తినడం వల్ల ఎన్ని లాభాలో
రామ్ చరణ్ పెద్ది సినిమాలో ఛాన్స్ వస్తే నో చెప్పా
రామ్ చరణ్ పెద్ది సినిమాలో ఛాన్స్ వస్తే నో చెప్పా
మనదేశంలో ఇప్పటివరకు రైలు కూత వినని రాష్ట్రం..! అది ఏ రాష్ట్రమంటే
మనదేశంలో ఇప్పటివరకు రైలు కూత వినని రాష్ట్రం..! అది ఏ రాష్ట్రమంటే
భారత రాష్ట్రపతి vs రష్యా అధ్యక్షుడు.. ఎవరి ఆదాయం ఎంత?
భారత రాష్ట్రపతి vs రష్యా అధ్యక్షుడు.. ఎవరి ఆదాయం ఎంత?
సెంచరీ హాట్రిక్ మిస్సయిందన్న అర్ష్‌దీప్‌ను ఆడుకున్న విరాట్
సెంచరీ హాట్రిక్ మిస్సయిందన్న అర్ష్‌దీప్‌ను ఆడుకున్న విరాట్
నిమ్మకాయ తొక్కలను తీసిపారేయకండి.. అవి చేసే అద్భుతాలు తెలిస్తే..
నిమ్మకాయ తొక్కలను తీసిపారేయకండి.. అవి చేసే అద్భుతాలు తెలిస్తే..
ఈ వారంలో నాలుగు రోజులు బ్యాంకులు బంద్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఈ వారంలో నాలుగు రోజులు బ్యాంకులు బంద్‌.. ఏయే రోజుల్లో అంటే..