Pooja Hegde: పవన్ సినిమా నుంచి కూడా పూజా అవుట్.. ఉస్తాద్ కొత్త హీరోయిన్ ఈమెనట..

క్రిష్ దర్శకత్వంలో పవన్ చేస్తున్న సినిమా హరిహర వీరమల్లు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం ఈ మూవీ చివరి దశకు వచ్చేందని తెలుస్తోంది. అలాగే హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఉస్తాద్ భగత్ సింగ్, సుజిత్ దర్శకత్వంలో ఓజీ , అలాగే సముద్ర ఖని డైరెక్షన్ లో బ్రో సినిమాలు చేస్తున్నాడు.

Pooja Hegde: పవన్ సినిమా నుంచి కూడా పూజా అవుట్.. ఉస్తాద్ కొత్త హీరోయిన్ ఈమెనట..
Pawan Kalyan
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 24, 2023 | 8:20 AM

పవన్ కళ్యాణ్ రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. కానీ ఆయన సినిమాలకు మాత్రం బ్రేక్ ఇవ్వడం లేదు. గ్యాప్ దొరికినప్పుడు సినిమా షూటింగ్స్ ను పూర్తి చేస్తున్నారు . ఇప్పటికే పవన్ లైనప్ చేసిన సినిమాలు చూస్తే దిమ్మతిరుగుతుంది. క్రిష్ దర్శకత్వంలో పవన్ చేస్తున్న సినిమా హరిహర వీరమల్లు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం ఈ మూవీ చివరి దశకు వచ్చేందని తెలుస్తోంది. అలాగే హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఉస్తాద్ భగత్ సింగ్, సుజిత్ దర్శకత్వంలో ఓజీ , అలాగే సముద్ర ఖని డైరెక్షన్ లో బ్రో సినిమాలు చేస్తున్నాడు. ఇదిలా ఉంటే హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

గబ్బర్ సింగ్ సినిమా తర్వాత పవన్, హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో భారీ బజ్ క్రియేట్  అయ్యింది. ఇక ఇక ఈ సినిమాలో పవన్  మరోసారి పోలీస్ గెటప్ లో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకుట్టుకున్నాయి.

ఇదిలా ఉంటే ఈ సినిమా హీరోయిన్స్ గ పూజ హెగ్డే, శ్రీలీల నటిస్తున్నారని తెలుస్తోంది. కాగా ఈ సినిమానుంచి పూజ హెగ్డే తప్పుకుందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే మహేష్, త్రివిక్రమ్ సినిమానుంచి పూజ తప్పుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఉస్తాద్ నుంచి కూడా పూజా తప్పుకుందట. ఆమె ప్లేస్ లోకి సాక్షి వైద్య ను హీరోయిన్ గా ఎంపిక చేశారని టాక్ వినిపిస్తోంది. ఏజెంట్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది సాక్షి. ఇప్పుడు వరుణ్ తేజ్ తో కలిసి గాండీవధారి అర్జున సినిమాలో నటిస్తుంది.