AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Keerthy Suresh: పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కీర్తి సురేష్.. అభిమాని ప్రశ్నకు హీరోయిన్ ఆన్సర్ ఏంటంటే..

కెరీర్ మొదట్లో గ్లామర్ విషయంలో ఆలోచించిన ఈ అమ్మడు.. ఇప్పుడు గ్లామర్ రోల్స్ చేసేందుకు కూడా సిద్ధమయ్యింది. ప్రస్తుతం ఆమె మెగాస్టార్ చిరంజీవి.. మెహర్ రమేష్ కాంబోలో తెరకెక్కుతున్న భోళా శంకర్ చిత్రంలో నటిస్తుంది. ఇందులో చిరు చెల్లిగా కీర్తి కనిపించనుంది. ఓవైపు సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది కీర్తి.

Keerthy Suresh: పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కీర్తి సురేష్.. అభిమాని ప్రశ్నకు హీరోయిన్ ఆన్సర్ ఏంటంటే..
Keerthy Suresh
Rajitha Chanti
|

Updated on: Apr 21, 2023 | 9:26 AM

Share

ఇటీవలే దసరా సినిమాతో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంది హీరోయిన్ కీర్తి సురేష్. ఈ మూవీలో వెన్నెల పాత్రలో నటించి మరోసారి మహానటి అనిపించుకుంది. ఇందులో తన నటనతో అదరగొట్టేసింది. గ్రామీణ అమ్మాయిగా ఊర మాస్ లుక్ లో కనిపించి మెప్పించింది. ఓవైపు వెన్నెల పాత్రలో రఫ్పాడిస్తూనే.. మరోవైపు తన నటనతో ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టించింది. ఈ సినిమాతో చాలా కాలాంగా సరైన హిట్టు కోసం ఎదురుచూస్తున్న ఈ ముద్దుగుమ్మ కోరిక నెరవేరిందనే చెప్పుకొవాలి. కెరీర్ మొదట్లో గ్లామర్ విషయంలో ఆలోచించిన ఈ అమ్మడు.. ఇప్పుడు గ్లామర్ రోల్స్ చేసేందుకు కూడా సిద్ధమయ్యింది. ప్రస్తుతం ఆమె మెగాస్టార్ చిరంజీవి.. మెహర్ రమేష్ కాంబోలో తెరకెక్కుతున్న భోళా శంకర్ చిత్రంలో నటిస్తుంది. ఇందులో చిరు చెల్లిగా కీర్తి కనిపించనుంది. ఓవైపు సినిమాలతో ఎంత బిజీగా ఉన్నా.. సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది కీర్తి.

ఎప్పటికప్పుడు సినిమా అప్డేట్స్, లేటేస్ట్ ఫోటోస్ షేర్ చేస్తూ అభిమానులకు టచ్ లో ఉంటుంది. అంతేకాదు.. అప్పుడప్పుడు తన ఫాలోవర్లతో చిట్ చాట్ నిర్వహిస్తుంది. తాజాగా మరోసారి తన అభిమానులతో ముచ్చటించింది కీర్తి. ఈ క్రమంలోనే ఓ నెటిజన్.. కీర్తిని పెళ్లి గురించి ప్రశ్నించాడు. ఇంతకీ పెళ్లేప్పుడు అంటూ క్వశ్చన్ చేయగా.. కీర్తి వెరైటీగా ఆన్సర్ ఇచ్చింది. మీ పెళ్లెప్పుడు అని అడిగితే.. వడివేలు కార్టూన్ అది కూడా రెండు జేబుల్లో ఏముంది ?.. ఏమి లేదు అన్న స్టిక్కర్ పెట్టింది. అంటే పెళ్లి గురించి ఇప్పుడు ఎలాంటి ఆలోచనలు లేవు అని చెప్పకనే చెప్పేసింది కీర్తి.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే.. కీర్తి ప్రేమ, పెళ్లి గురించి ఇప్పటికే అనేకసార్లు సోషల్ మీడియాలో వార్తలు వైరలయ్యాయి. గతంలో మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ తో ప్రేమలో ఉందంటూ వార్తలు రాగా.. కీర్తి కుటుంబసభ్యులు ఆ రూమర్స్ ను కొట్టిపారేశారు. ఇక ఇటీవల తన చిన్ననాటి స్నేహితుడిని కీర్తి పెళ్లి చేసుకోబోతుందని వార్తలు వినిపించాయి. అయితే అలాంటిదేమి లేదని.. తన కూతురి పెళ్లి గురించి ఇప్పుడు ఆలోచనలు లేవంటూ క్లారిటీ ఇచ్చారు కీర్తి తల్లి మేనక. మొత్తానికి కీర్తి సినిమాల గురించి కాకుండా.. ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలు నిత్యం నెట్టింట హల్చల్ చేస్తున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
ప్రపంచంలోనే అరుదైన పువ్వు..పేరు శవం.. 9 నెలలు మొగ్గగా ఉండి చివరకు
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
విశాఖలో హ్యాట్రిక్ రికార్డులు బ్రేక్ చేయనున్న కింగ్ కోహ్లీ
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
వెస్ట్రన్ టాయిలెట్ ఇంట్లో ఉందా?.. ఈ పొరపాట్లు చేయకండి..
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
శుక్ర, బుధుల యుతి..ఆ రాశుల వారికి కష్టనష్టాలు.. జాగ్రత్త..!
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
తన ఇంటిని తాకట్టు పెట్టిమరీ.. మేనమామ కష్టం తీర్చాడు.. చివరకు
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
ఆ సినిమా కోసం రజనీ తో మోహన్‌లాల్‌ ములాఖత్‌.. అబ్బో ఇక సీన్ సితారే
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
లెక్క తప్పితే డేంజరే.. మీ ఏజ్ ప్రకారం ఎంత సేపు నిద్రపోవాలో..
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడ ఇలా చేయడం వల్ల అక్కడ హీరోలకు అక్కడ మర్యాద తగ్గుతోందా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ఇక్కడైతే భారత బౌలర్లను చిత్తు చేయడం చాలా ఈజీ : సౌతాఫ్రికా
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!
ప్రపంచంలో ధూమపానాన్ని నిషేధించిన మొట్టమొదటి దేశం ఇదేనట!