AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kamakshi Bhaskarla: ఇండస్ట్రీకి వచ్చినపుడే అవన్నీ బ్రేక్ చేయాలనుకున్నాను.. హీరోయిన్ కామాక్షి భాస్కర్ల..

అల్లరి నరేశ్ హీరోగా నటిస్తున్న సినిమా 12ఏ రైల్వే కాలనీ. ఇందులో కామాక్షి భాస్కర్ల హీరోయిన్ గా నటించింది. ఇందులో వైవా గెటప్ శ్రీను కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని నవంబర్ 21న విడుదల కానుంది. ఈ క్రమంలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించింది చిత్రయూనిట్.

Kamakshi Bhaskarla: ఇండస్ట్రీకి వచ్చినపుడే అవన్నీ బ్రేక్ చేయాలనుకున్నాను.. హీరోయిన్ కామాక్షి భాస్కర్ల..
Kamakshi Bhaskarla
Rajitha Chanti
|

Updated on: Nov 18, 2025 | 12:23 PM

Share

చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా 12ఏ రైల్వే కాలనీ. ఒకప్పుడు కామెడీ సినిమాలతో అలరించిన నరేష్.. ఇప్పుడు విభిన్న కంటెంట్ చిత్రాలను ఎంచుకుంటున్నారు. డైరెక్టర్ కాసరగడ్డ నాని తెరకెక్కిస్తున్న ఈసినిమాలో హీరోయిన్ కామాక్షి భాస్కర్ల, వైవా హర్ష, గెటప్ శ్రీను కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్నిఈనెల 21న రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించారు. అల్లరి నరేశ్‌ మాట్లాడుతూ సినిమాపై నమ్మకం ఉంటే భయం ఉండదని అన్నారు.

ఇవి కూడా చదవండి : ఒకప్పుడు తినడానికి తిండి లేదు.. ఇప్పుడు 5 నిమిషాలకు 5 కోట్లు..

డైరెక్టర్ నాని కాసరగడ్డ మాట్లాడుతూ.. మా నాన్నకు థ్యాంక్స్ చెప్పాలి.. మా నాన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్.. ఆయనకు స్టేజ్ ఎక్కాలని మాట్లాడాలనుకునేవాళ్లు.. కానీ 2014లో ఆయన చనిపోయారు. నాన్న ఇప్పుడు నేను స్టేజ్ ఎక్కాను.. ఇప్పుడు మాట్లాడుతున్నాను.. 15 ఏళ్లు పట్టింది నాకు ఇలా మాట్లాడటానికి. అనిల్ అన్న, శ్రీను గారు నుంచి ఈ ఆఫర్ వచ్చింది. మంచి సినిమా చూసామన్న ఫీల్‌తోనే బయటికి వెళ్తారు. టెక్నికల్ టీంకు థ్యాంక్యూ. విజువల్స్ చాలా బాగుంటాయి.. రీ రికార్డింగ్ కూడా అదిరిపోయింది. పైరసీలో చూసే ఛాన్స్ కూడా లేదు కాబట్టి థియేటర్‌కు వచ్చేయండి అని అన్నారు.

Bigg Boss : అరె ఎవర్రా మీరంతా.. బిగ్ బాస్ తెర వెనుక ఇంత మ్యాటర్ ఉందా..? ట్రోఫీ కోసం భారీ ప్లాన్..

హీరోయిన్ కామాక్షి భాస్కర్ల మాట్లాడుతూ.. అనిల్ విశ్వనాథ్ గారితో నా జర్నీ 2020లో మొదలైంది. పొలిమేర సినిమాను 80 లక్షలతో పూర్తి చేసాం. ఈ రోజు ఈ స్టేజీపై ఉండటానికి కారణం అనిల్. ఏమీ లేని పొజిషన్ నుంచి ఇక్కడికి వచ్చాం. గాడ్ ఫాదర్ లేకుండా వచ్చాను. అలాంటి నాకు ప్లాట్ ఫామ్ ఇచ్చింది అనిల్ విశ్వనాథ్. నా వరకు ఆయనే రాజమౌళి, ఆయనే సుకుమార్, ఎవరైనా ఉండొచ్చు. హీరోయిన్ ఇలా ఉండాలి.. ఇలాంటి బట్టలు వేసుకోవాలి.. ఇలా మాట్లాడాలని ఏళ్ల తరబడి పడిపోయింది. నేను ఇండస్ట్రీకి వచ్చినపుడే అవన్నీ బ్రేక్ చేయాలనుకున్నాను. అది కష్టమని తెలుసు.. కానీ నేను అంతకంటే టఫ్. మా నిర్మాతలు చాలా సపోర్ట్ చేసారు. అల్లరి నరేష్ గారి గురించి చెప్పడానికి మాటల్లేవు.. చాలా టాలెంటెడ్ యాక్టర్. ఆయన పాత్రలకు నేను పెద్ద ఫ్యాన్. కామెడీ ముద్ర ఉన్నా డిఫెరెంట్ క్యారెక్టర్స్ చేసారు. ఈ సినిమాలో ఆయన పాత్ర ఇంకా బాగా ఉంటుంది.అని అన్నారు.

Bigg Boss : అరె ఎవర్రా మీరంతా.. బిగ్ బాస్ తెర వెనుక ఇంత మ్యాటర్ ఉందా..? ట్రోఫీ కోసం భారీ ప్లాన్..