AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress : ఒకప్పుడు కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. పెళ్లి కాకుండానే తల్లైంది.. 49 ఏళ్ల వయసులో ఒంటరిగా..

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు టాప్ హీరోయిన్. చిన్న వయసులోనే గ్లామర్ ప్రపంచంలోకి అడుగుపెట్టింది. తక్కువ సమయంలోనే తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. హిందీ, తెలుగు భాషలలో పలు చిత్రాల్లో నటించింది. ఈరోజు ఆమెకు 49 సంవత్సరాలు. ఇంతకీ ఆమె ఎవరంటే. తెలుగులో నాగార్జున సరసన ఓ క్రేజీ మూవీ చేసింది.

Actress : ఒకప్పుడు కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. పెళ్లి కాకుండానే తల్లైంది.. 49 ఏళ్ల వయసులో ఒంటరిగా..
Sushmitha Sen
Rajitha Chanti
|

Updated on: Nov 18, 2025 | 12:02 PM

Share

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు చక్రం తిప్పిన హీరోయిన్లలో ఆమె ఒకరు. చిన్న వయసులోనే సినీరంగంలోకి అడుగుపెట్టి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. హిందీలోని స్టార్ హీరోలతో అనేక బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఈరోజు ఆమె పుట్టినరోజు. ఈ సందర్భంగా సినీప్రియులు, అభిమానులు ఆమెకు బర్త్ డే విషెస్ తెలుపుతున్నారు. ఆమె మరెవరో కాదు.. సుష్మితా సేన్. బాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. తెలుగులో నాగార్జున సరసన రక్షకుడు చిత్రంలో నటించింది. ఆ తర్వాత మరో ప్రాజెక్ట్ చేయలేదు. ఇప్పుడు చాలా కాలంగా సుష్మితా సినిమాలకు దూరంగా ఉంటుంది.

నివేదికల ప్రకారం సుష్మితా సేన్ ఆస్తులు రూ.100 కోట్లకు పైగా ఉన్నట్లు సమాచారం. ఆమె బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లు , స్మార్ట్ పెట్టుబడుల ద్వారా సంపాదిస్తుంది. సుష్మితకు ముంబైలో ఒక విలాసవంతమైన ఇల్లు కూడా ఉంది. బ్రాండ్ ప్రమోషన్ల కోసం సుష్మితా సేన్ ₹60 లక్షల వరకు వసూలు చేస్తుంది. సుష్మితా సేన్ దుబాయ్‌లో ఒక నగల దుకాణాన్ని కూడా నడుపుతున్నారు. ఆమె తంత్ర ఎంటర్‌టైన్‌మెంట్ అనే నిర్మాణ సంస్థను కూడా నడుపుతున్నారు. ఆమెకు సెసాజియోని అనే కంపెనీ కూడా ఉంది.

సుష్మితా సేన్ కెరీర్ మంచి ఫాంలో ఉండగానేDo ఆమె గురించి ఎన్నో రూమర్స్ వినిపించాయి. కానీ రెనీ, అలీసా అనే ఇద్దరు అమ్మాయిలను దత్తత తీసుకుంది. సుష్మితా సేన్ పెళ్లి చేసుకోలేదు. ఇప్పటికీ ఒంటరిగానే లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. ఆమె 2023 చిత్రం తాలీలో కనిపించింది, దీనిలో ఆమె గౌరీ సావంత్ పాత్ర పోషించింది. ఆ తర్వాత మరో సినిమా చేయలేదు.

ఇవి కూడా చదవండి : ఒకప్పుడు తినడానికి తిండి లేదు.. ఇప్పుడు 5 నిమిషాలకు 5 కోట్లు..

Follow Us