AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jyoti Labala: కేపీ చౌదరితో పరిచయంపై స్పందించిన నటి జ్యోతి.. ఫుల్ క్లారిటీ

కే.పి.చౌదరి బ్యాంక్ లావాదేవీల్లోనూ అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బీహార్‌కు చెందిన కిన్‌షుక్ అగర్వాల్ నుంచి 16వేలు క్రెడిట్ అయినట్లు తెలిసింది. విజయవాడకు చెందిన సుజాతకు కె.పి. నుంచి లక్ష ట్రాన్స్‌ఫర్ అయ్యానట్లు నిర్ధారించారు. ఇలాంటి అనుమానాస్పద లావాదేవీలు లక్షల్లో జరిగినట్లు తెలుస్తోంది. ఇప్పుడు ఈ అనుమానస్పద లావాదేవీల గుట్టు వీడాల్సి ఉంది.

Jyoti Labala: కేపీ చౌదరితో పరిచయంపై స్పందించిన నటి జ్యోతి.. ఫుల్ క్లారిటీ
Actress Jyothi
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 25, 2023 | 12:42 PM

కబాలీ తెలుగు ప్రొడ్యూసర్‌ కేపీ చౌదరి డ్రగ్స్‌ కేసులో నోరు విప్పారు నటి జ్యోతి. డ్రగ్స్‌ కేసుతో తనకెలాంటి సంబంధం లేదంటూ వీడియో రిలీజ్‌ చేశారు. కేపీతో తనది కేవలం ఫ్రెండ్‌షిప్‌ మాత్రమేననీ, డ్రగ్స్ ఇష్యూ తనకి సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు. ఎలాంటి విచారణకు అయినా నేను సిద్ధమేనని.. పోలీసులు అడిగితే తన ఫోన్ కూడా ఇస్తానని వెల్లడించారు. డేటా రిట్రీవ్‌ చేసుకున్నా.. అభ్యంతరం లేదని.. – ఏ తప్పూ చేయలేదు.. కాబట్టి తాను బయపడను అన్నారు. అవసరమైతే నార్కోటిక్ టెస్ట్‌కి సిద్దమన్నారు. పార్టీలకు వెళ్లే అలవాటు తనకు లేదన్నారు జ్యోతి. కేపీ హైదరాబాద్ వచ్చినప్పుడు వారి అబ్బాయి తన ఇంట్లో డ్రాప్ చేసి వెళ్లేవాడు.. తన కుమారుడు, కేపీ కుమారుడు కలిసి ఆడుకునే వారని జ్యోతి తెలిపారు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో మరోసారి డ్రగ్స్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. విచారణలో సంచలన నిజాలు బయటపడుతున్నాయి. ఈ కేసులో కొంతమంది ప్రముఖుల పేర్లు వినిపిస్తున్నాయి.  దీంతో సెలబ్రిటీలను కూడా విచారించే చాన్స్ ఉంది. గతంలో తెలుగునాట చాలాసార్లు మత్తు ఛాయలు కనిపించాయి గానీ.. ప్రొడ్యూసర్స్, బడా హీరోలు, డైరెక్టర్ల పేర్లు వెలుగులోకి వచ్చాయి. కానీ ఈసారి  సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్టులు, ఓ మోస్తరు సెలబ్రిటీలు పేర్లు వినిపిస్తున్నాయి.

అసలు కేపీ నెట్‌వర్క్ ఏంటి అని ఆరా తీస్తే డ్రగ్స్ కోణం బైటపడింది. గోవాలోనే ఉంటూ, అక్కడి నుంచి డ్రగ్స్‌ తెచ్చి హైదరాబాద్‌లో విక్రయించడం ఇతడి సైడ్‌ బిజినెస్‌. పోలీసులు కస్టడీలోకి తీసుకునే టైమ్‌కి అతని వద్ద నుంచి 88గ్రాములకుపైగా కొకైన్ ఉంది. నిజానికి అతను తీసుకొచ్చింది వంద గ్రాముల కొకైన్. మిగతా 12 గ్రాముల మాల్ ఎక్కడుంది? ఎవరికి అమ్మాడు? మిగిలిన 88 గ్రాముుల కొకైన్ ఎవరికి అమ్మాలనుకున్నాడు..? కస్టడీ రిపోర్ట్‌లో మొత్తం 18మంది పేర్లు వెలుగులోకొచ్చాయి. అందులో కొంత మంది డ్రగ్స్ తీసుకున్నట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. అయితే మిగతాది ఎవరికోసం అంటే నోరు విప్పడం లేదు కేపీ.

కేపీ చౌదరి కస్టడీ రిపోర్ట్‌లో ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ సిక్కిరెడ్డి పేరు తెరపైకి రావడం కలకలం రేపుతోంది. సిక్కిరెడ్డి ఫ్లాట్‌లోనే కేపీ చౌదరి డ్రగ్స్ పార్టీ నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. పాత పరిచయాలతోనే కేపీ చౌదరికి సిక్కిరెడ్డి తన ఫ్లాట్‌ను ఇచ్చినట్లు పోలీసులకు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అయితే సిక్కిరెడ్డికి డ్రగ్స్‌ కేసుతో ఎలాంటి సంబంధం లేని ఫ్యామిలీ మెంబర్స్ చెబుతున్నారు. కేపీ చౌదరి తమకు 11 ఏళ్ల నుంచి తెలుసు కానీ తాము ఎప్పుడు గోవా వెళ్లలేదని సిక్కిరెడ్డి తల్లి తెలిపారు. ఈ డ్రగ్స్‌ ఇష్యూతో తమకు ఎలాంటి సంబంధం లేదంటున్నారు సిక్కిరెడ్డి భర్త సుమీత్‌.

ఇక కేపీ చౌదరి ఫోన్‌ కాంటాక్ట్స్ లిస్ట్‌లో 9వేల మంది ఉన్నారు. అతను దాచుకున్న గూగుల్‌ డ్రైవ్ డేచాలో 9వేల మంది ఫోటోలున్నాయి. వీళ్లందరికీ డ్రగ్స్‌లో లింక్ ఉందని కాదు.. కానీ వీళ్లలో ఎంతమందికి లింకు ఉందన్నదే తేలాల్సిన ప్రశ్న. కాల్‌లిస్ట్ డీకోడింగ్ చేస్తే ఒకరిద్దరి పేర్లు బైటపడ్డాయి. అతడి బ్యాంకు లావాదేవీల్ని కూడా లోతుగా లోడేస్తున్నారు పోలీసులు.

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.