AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Archana: రాజమౌళి మగధీరలో ఆఫర్‌ ఇచ్చారు.. కానీ నేనే వదులుకున్నానంటూ కన్నీళ్లు పెట్టుకున్న నటి అర్చన..

Archana: 2004లో అల్లరి నరేశ్‌ హీరోగా వచ్చిన నేను సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించింది అర్చన. ఆతర్వాత సిద్ధార్థ్‌-త్రిషల నువ్వోస్తానంటే నేనొద్దంటానా సినిమాలో లల్లీగా మెప్పించింది

Archana: రాజమౌళి మగధీరలో ఆఫర్‌ ఇచ్చారు.. కానీ నేనే వదులుకున్నానంటూ కన్నీళ్లు పెట్టుకున్న నటి అర్చన..
Archana
Basha Shek
| Edited By: |

Updated on: Jun 30, 2022 | 7:19 AM

Share

Archana: 2004లో అల్లరి నరేశ్‌ హీరోగా వచ్చిన నేను సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించింది అర్చన. ఆతర్వాత సిద్ధార్థ్‌-త్రిషల నువ్వోస్తానంటే నేనొద్దంటానా సినిమాలో లల్లీగా మెప్పించింది. వీటితో పాటు శ్రీరామదాసు, పౌర్ణమి, సామాన్యుడు, యమదొంగ, పాండురంగడు, బలుపు, కమలతో నా ప్రయాణం తదితర చిత్రాల్లో నటించి మెప్పించింది. కొన్ని తమిళ, కన్నడ సినిమాల్లోనూ కనిపించింది. బిగ్‌బాస్‌ మొదటి సీజన్‌లోనూ ప్రత్యక్షమై బుల్లితెర ప్రేక్షకులను అలరించింది. వేదగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె ఆ తర్వాత అర్చనగా పేరుమార్చుకున్న ఈ తెలుగందం 2019లో జగదీశ్‌తో ఏడడుగులు నడిచింది. ప్రస్తుతం అడపాదడపా మాత్రమే సినిమాల్లో కనిపిస్తోన్న ఈ సొగసరి తాజాగా తన సినిమా కెరీర్‌ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అలాగే తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి కొన్ని ఇంట్రెస్ట్రింగ్‌ కామెంట్స్‌ చేసింది.

ఇందులో భాగంగా ఓ సినిమాలో తాను బాలకృష్ణకు డ్యాన్స్‌ నేర్పించానంది. బాలయ్య బృందావనంలో గోపికలతో కలిసి డ్యాన్స్‌ చేసే ఒక బిట్‌ తానే నేర్పించినట్లు తెలిపింది. కాగా బాలకృష్ణతో కలిసి పాండురంగడు సినిమాలో నటించింది అర్చన. ఇక రామ్‌చరణ్‌తో రాజమౌళి తెరకెక్కించిన మగధీరలో చేయమని ఆఫర్‌ వచ్చిందట. అయితే అప్పుడంత లౌక్యం లేకపోవడంతో చేయలేదని గుర్తుచేసుకుంది. నిజంగా ఆ సినిమా చేసుంటే ఇప్పుడు తన కెరీర్‌ మరోలా ఉండేదేమోనని పేర్కొంది. కొన్ని పెద్ద సినిమాల్లో అవకాశాలు వచ్చినట్లే వచ్చి చేజారాయంటూ భావోద్వేగానికి గురైందీ ముద్దుగుమ్మ. ఇక పెళ్లికి ముందు ఫ్రెండ్‌తో పార్టీకి వెళ్లి.. అక్కడి నుంచి డైరెక్ట్‌గా హాస్పిటల్‌కు వెళ్లానని చెప్పుకొచ్చిందీ అందాల తార.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..