Apsara Rani: క్యాస్టింగ్ కౌచ్‏పై షాకింగ్ కామెంట్స్ చేసిన ఆర్జీవీ హీరోయిన్.. ఛాన్స్ ఇవ్వాలంటే అలా అంటూ..

సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ గురించి ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ ఓపెన్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. అవకాశాల కోసం

Apsara Rani: క్యాస్టింగ్ కౌచ్‏పై షాకింగ్ కామెంట్స్ చేసిన ఆర్జీవీ హీరోయిన్.. ఛాన్స్ ఇవ్వాలంటే అలా అంటూ..
Apsara Rani
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 20, 2022 | 8:59 AM

సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ గురించి ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ ఓపెన్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. అవకాశాల కోసం ప్రయత్నించే అమ్మాయలతో అసభ్యంగా ప్రవర్తిస్తుంటారు . టాలీవుడ్ మాత్రమే కాకుండా.. బాలీవుడ్, కోలీవుడ్ ఇలా అన్ని భాషల్లోని నటీమణులు తమకు ఎదురైన చేదు అనుభవాలను వివరిస్తూ ఓపెన్ అయ్యారు. ఇప్పటికీ ఫిల్మ్ ఇండస్ట్రీలో మహిళల పట్ల వేధింపులు.. అసభ్య ప్రవర్తన ఎక్కడో ఓ చోట జరుగుతూనే ఉంది. తాజాగా ఆర్జీవీ హీరోయిన్ అప్సర రాణి కూడా తాను ఎదుర్కొన్న వేధింపుల గురించి బయటపెట్టింది.

డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన థ్రిల్లర్ మూవీతో వెండితెరకు పరిచయమైంది అప్సర రాణి.. ఈమె అసలు పేరు అంకిత మహరాణ కాగా అప్సర రాణిగా తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఇక ఈ మూవీ తర్వాత క్రాక్ సినిమాలో భూమ్ బద్దల్ ఐటెం సాంగ్ చేసి కుర్రాళ్ల మతి పొగోట్టింది. అయితే తనకు కూడా సినీ ఇండస్ట్రీలో చేదు అనుభవాలు ఉన్నాయంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది అప్సర రాణి. కన్నడలో హీరోయిన్‏గా తనను ఎంపిక చేశారని.. ఆ మూవీ డిస్కషన్స్ కోసం సినిమా డైరెక్టర్ రూంకు ఒంటరిగా రమ్మన్నారని.. తన కోరిక తీరిస్తే అవకాశం ఇస్తానన్నాడని చెబుతూ ఓపెన్ అయ్యింది. అయితే తాను మాత్రం అక్కడి తన తండ్రిని వెంట తీసుకెళ్లాను అని.. పరిస్థితి అర్థమయ్యాక వెంటనే అక్కడి నుంచి పారిపోయి వచ్చినట్లు తెలిపింది. తనకు తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి సంఘటనలు ఎదురుకాలేవని తెలిపింది. టాలెంట్ ఉన్నవాళ్లకు తెలుగులో మంచి అవకాశాలు లభిస్తాయని… సినిమా సూపర్ హిట్ అయితే ప్రేక్షకులు ఆదరిస్తారని తెలిపింది.

Also Read: Kriti Sanon : నేనేం ప్లాస్టిక్ బొమ్మను కాదు కదా.. బాడీషేమింగ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కృతి ..

Shah Rukh Khan: కింగ్ ఈజ్ బ్యాక్.. నాలుగు నెలల తర్వాత సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన షారుఖ్.. మొదటి పోస్ట్ ఏంటంటే..

Dhanush- Aishwarya: ధనుష్, ఐశ్వర్య విడాకులపై ధనుష్ తండ్రి ఆసక్తికర వ్యాఖ్యలు.. వారు మళ్లీ కలుస్తారంటూ..