Actor Srinu: టాలీవుడ్లో మరో విషాదం.. అనారోగ్యంతో సినీ నటుడు శ్రీను మృతి..
సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే అనారోగ్యంతో పలువురు.. కరోనా మహామ్మారి కారణంగా
సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే అనారోగ్యంతో పలువురు.. కరోనా మహామ్మారి కారణంగా మరికొందరు నటీనటులు మృతి చెందారు. ఇప్పుడు మరో నటుడు అనారోగ్యంతో కన్నుమూశారు. సినీ నటుడు కొంచాడ శ్రీనివాస్ (47) అనారోగ్యంతో మృతి చెందారు. పలాస.. కాశీబుగ్గ మున్సిపాలిటీ కాశీబుగ్గ బస్టాండ్ సమీపంలో శ్రీనివాస్ నివాసం ఉంటున్నారు. గత కొద్ది తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీనివాస్.. కాశీబుగ్గలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. ఇప్పటివరకు శ్రీనివాస్.. 40కు పైగా చిత్రాల్లో కనిపించారు. అలాగే 10కి పైగా టీవీ సీరియల్స్ లో నటించారు. ఆది, శంకర్ దాదా ఎంబీబీఎస్, ప్రేమ కావాలి, ఆ ఇంట్లో వంటి చిత్రాలు శ్రీనుకు మంచి పేరు తెచ్చిపెట్టాయి..
షూటింగ్ సమయంలో శ్రీను కింద పడిపోవడంతో అతని ఛాతిపై దెబ్బతగిలింది. ఆ తర్వాత అతనికి గుండెలో సమస్య ఉన్నట్లు తెలిసిందని.. ఆ కారణంగానే శ్రీను మృతి చెందాడని అతని కుటుంబసభ్యులు తెలిపారు. శ్రీనుకు అమ్మ విజయలక్ష్మి ఉన్నారు. అతని తండ్రి ఐదేళ్ల కిందట చనిపోగా.. తమ్ముడు పదేళ్ల కిందట మరణించార. శ్రీనుకు ఇద్దరు అక్కచెల్లెళ్లు ఉన్నారు. ప్రతి సంక్రాంతికి కాశీబుగ్గలోని తన స్వగృహానికి రావడం.. కుటుంబసభ్యులతో కలిసి పండగ జరుపుకోవడం శ్రీనుకు అలవాటు అని సన్నిహితులు తెలిపారు.
Also Read: Kriti Sanon : నేనేం ప్లాస్టిక్ బొమ్మను కాదు కదా.. బాడీషేమింగ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కృతి ..