Anita Hassanandani: ఆ నటుడిని పిచ్చిగా ప్రేమించిన హీరోయిన్.. బ్రేకప్ నుంచి బయటపడేందుకు అక్కడకు.. చివరకు..
తెలుగులో శ్రీరామ్, తొట్టి గ్యాంగ్, నిన్నే ఇష్టపడ్డాను, ఆడంతే అదో టైప్, మనలో ఒకడు సినిమాల్లో నటించింది. తెలుగుతోపాటు తమిళం, హిందీ, భాషల్లోనూ పలు చిత్రాల్లో నటించిన అనిత.. ఆ తర్వాత బాలీవుడ్ షిప్ట్ అయ్యింది. కొన్నాళ్లుగా అక్కడే సీరియల్స్ చేస్తున్న అనిత.. ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన లవ్ స్టోరీ గురించి చెప్పుకొచ్చింది.

అనిత హస్సానందిని.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరంలేని పేరు. ఒకప్పుడు అందం, అభినయంతో అడియన్స్ ను కట్టిపడేసింది. దివంగత హీరో ఉదయ్ కిరణ్ నటించిన నువ్వు నేను సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న ఈ అమ్మడు.. తనదైన నటనకు ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత తెలుగులో వరుస ఆఫర్స్ వచ్చినప్పటికీ తొలి చిత్రానికి వచ్చినంతగా బ్రేక్ మాత్రం రాలేదు. తెలుగులో శ్రీరామ్, తొట్టి గ్యాంగ్, నిన్నే ఇష్టపడ్డాను, ఆడంతే అదో టైప్, మనలో ఒకడు సినిమాల్లో నటించింది. తెలుగుతోపాటు తమిళం, హిందీ, భాషల్లోనూ పలు చిత్రాల్లో నటించిన అనిత.. ఆ తర్వాత బాలీవుడ్ షిప్ట్ అయ్యింది. కొన్నాళ్లుగా అక్కడే సీరియల్స్ చేస్తున్న అనిత.. ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇస్తుంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన లవ్ స్టోరీ గురించి చెప్పుకొచ్చింది.
గతంలో తాను నటుడు ఈజాబ్ తో ప్రేమలో ఉన్నానని.. కానీ తమ ప్రేమ విషయం తెలిసి తన తల్లి సంతోషంగా లేదని చెప్పుకొచ్చింది. ఇద్దరి మతాలు వేరుకోవడం తన జీవితం గురించి ఎక్కువగా కంగారు పడిందని.. అయినా తన భయాలను, అభిప్రాయాలను ఏమాత్రం పట్టించుకోలేదని తెలిపింది. “నిజానికి మేము చాలా బాగానే ఉన్నాము.. కానీ కొన్నాళ్లకు మా బంధం వర్కవుట్ కాలేదు. రిలేషన్ షిప్ లో మనల్ని వారికి నచ్చినట్లుగా మార్చుకోవాలనుకుంటే అది ప్రేమ అనిపించుకోదు.. తను నన్ను మార్చాలని చూసినప్పుడు నాకు అర్థం కాలేదు. ఎందుకంటే నేను అతడిని పిచ్చిగా ప్రేమించాను.. కానీ ఒకరి గురించి నేను మారలేను.. నేను నాలగే ఉండాలనుకున్నాను..అందుకే ఆ బంధం ఎక్కువ రోజులు ఉండలేదు. బ్రేకప్ బాధ నుంచి బయటపడేందుకు ఏడాదికి పైనే పట్టింది. ఇంట్లో ఉండలేక బెస్ట్ ఫ్రెండ్ ఇంటికి వెళ్లిపోయాను. తనే రోజూ నన్ను ప్రేమగా నిద్రలేని. అందుకే ఎవరి కోసమే మనం మారనక్కర్లేదు. మనల్ని మనలాగే స్వీకరించాలి. అలాగే మీ పార్టనర్ ఫోన్ పై కూడా ఓ కన్నేసి ఉంచండి. వారు ఫోన్ ఇవ్వడానికి భయపడితే ఏదో తప్పు జరుగుతున్నట్లే లెక్క.. మిమ్మల్ని కుటుంబానికి, మీ స్నేహితులకు దూరంగా ఉంచుతున్నాడంటే తను మనకు కరెక్ట్ పర్సన్ కాదని తెలుసుకోండి” అంటూ చెప్పుకొచ్చింది.
అనిత.. ఇజాబ్ కలిసి కావ్యాంజలి సీరియల్లో నటించారు. ఈ సమయంలోనే వీరిద్దరి మధ్య ఏర్పడిన పరిచయం కాస్తా ప్రేమగా మారింది. కొన్నాళ్లపాటు ప్రేమలో ఉన్న ఈ జంట 2007లో విడిపోయింది. ఆ తర్వాత 2013లో రోహిత్ రెడ్డిని పెళ్లాడింది. వీరికి 2021లో ఆరవ్ అనే బాబు జన్మించాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




