Amala Paul: అమ్మయిన అమలాపాల్.. పండంటి మగబిడ్డను ప్రసవించిన టాలీవుడ్ హీరోయిన్.. ఏం పేరు పెట్టారంటే?

టాలీవుడ్‌ ప్రముఖ హీరోయిన్‌ అమలాపాల్ అమ్మగా ప్రమోషన్ పొందింది. ఆమె పండంటి మగ బిడ్డను ప్రసవించింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఈ సందర్భంగా ఆస్పత్రి నుంచి బిడ్డను ఇంటికి తీసుకెళుతున్న వీడియోను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసుకుంది.

Amala Paul: అమ్మయిన అమలాపాల్.. పండంటి మగబిడ్డను ప్రసవించిన టాలీవుడ్ హీరోయిన్.. ఏం పేరు పెట్టారంటే?
Actress Amala Paul
Follow us
Basha Shek

|

Updated on: Jun 18, 2024 | 6:42 AM

టాలీవుడ్‌ ప్రముఖ హీరోయిన్‌ అమలాపాల్ అమ్మగా ప్రమోషన్ పొందింది. ఆమె పండంటి మగ బిడ్డను ప్రసవించింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఈ సందర్భంగా ఆస్పత్రి నుంచి బిడ్డను ఇంటికి తీసుకెళుతున్న వీడియోను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు అమలా పాల్ దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా ఈ నెల 11వ తేదీనే అమలా పాల్ బిడ్డకు జన్మనిచ్చింది. అయితే సుమారు వారం రోజుల తర్వాత ఈ శుభవార్తను అభిమానులతో పంచుకుందీ అందాల తార. గతేడాది తన ప్రియుడు గుజరాత్ కు చెందిన జగత్ దేశాయ్‌తో కలిసి పెళ్లిపీటలెక్కింది అమలా పాల్. కొన్నినెలల క్రితం తమ జీవితంలో మరో కొత్త వ్యక్తి రాబోతున్నారంటూ తన ప్రెగ్నెన్సీ విషయాన్ని బయటపెట్టింది. అప్పటి నుంచి తన బేబీ బంప్ ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వస్తోందీ ముద్దుగుమ్మ. ఇటీవల సీమంతం వేడుకలను కూడా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంది. వీటికి సంబంధించిన వీడియోలు కూడా సామాజిక మాధ్యమాల్లో కూడా తెగ వైరలయ్యాయి. ఇప్పుడు అమ్మవడంతో అమలా పాల్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

పేరు

ఇవి కూడా చదవండి

ఇదే సందర్భంగా తమ కుమారుడి పేరును కూడా అమలాపాల్ వెల్లడిండించి. కుమారుడికి ఇలాయ్ (ILAI) అని పేరు పెట్టినట్టు సోషల్ మీడియాలో తెలిపింది. “ఇట్స్ బేబీ బాయ్. మా చిన్ని అద్భుతాన్ని చూసేయండి. 11.06.2024న జన్మించాడు’ అని వీడియో పోస్ట్ లో రాసుకొచ్చింది. ఇక అమ్మయిన ఆనందంలో తన కుమారుడిని చేతుల్లో ఎత్తుకొని ఇంట్లోకి సంతోషంగా అడుగుపెట్టింది అమలా పాల్. అప్పటికే కుటుంబ సభ్యులు ఇంటిని అందంగా ముస్తాబు చేశారు. తన గదికి వెళ్లిన అమల సర్‌ప్రైజ్ అయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో అభిమానులు, నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటోంది. ఇక సినిమాల విషయానికి వస్తే.. అమలా పాల్ చివరిగా పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ఆడు జీవితం సినిమాలో కనిపించింది. మార్చి 28న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం ఆమె లెవెల్ క్రాస్ తో సహా మరో మలయాళం సినిమాలో కూడా నటిస్తోంది.

బేబీతో వస్తోన్న అమలా పాల్.. వీడియో

View this post on Instagram

A post shared by Jagat Desai (@j_desaii)

నిండు గర్భంతో అమలా పాల్ డ్యాన్స్.. వీడియో

View this post on Instagram

A post shared by Amala Paul (@amalapaul)

మెటర్నిటీ ఫొటో షూట్ లో అమలా పాల్..

View this post on Instagram

A post shared by Amala Paul (@amalapaul)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.