AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay Sethupathi: పుష్ప సినిమా ఆఫర్ రిజెక్ట్ చేశారా..? విజయ్ సేతుపతి ఆన్సర్ ఇదే..

ఇక ఇప్పుడు వచ్చిన మహారాజా సినిమా సైతం హిట్ అయిన సంగతి తెలిసిందే. మొన్నటివరకు కేవలం తమిళంలో మాత్రమే రిలీజ్ చేస్తారనుకున్న ఈ సినిమాను.. ఆకస్మాత్తుగా తెలుగులోనూ రిలీజ్ చేశారు. మొదటిరోజే ఈ చిత్రానికి పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. ఎప్పటిలాగే మరోసారి తనదైన నటనతో విజయ్ సేతుపతి అదరగొట్టేశాడంటూ పొగడ్తలు కురిపించారు. అలాగే సామినాథన్ డైరెక్షన్, అజనీష్ లోకనాథ్ బీజీఎమ్ బాగుందంటూ రివ్యూస్ ఇస్తున్నారు.

Vijay Sethupathi: పుష్ప సినిమా ఆఫర్ రిజెక్ట్ చేశారా..? విజయ్ సేతుపతి ఆన్సర్ ఇదే..
Vijay Sethupathi
Rajitha Chanti
|

Updated on: Jun 18, 2024 | 6:41 AM

Share

విభిన్నమైన కథలు.. వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ నటుడిగా ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు విజయ్ సేతుపతి. తమిళంలో అనేక సూపర్ హిట్ చిత్రాలతో స్టార్ డమ్ అందుకున్న ఈ హీరో ఉన్నట్లుండి విలన్ పాత్రతో తెలుగు అడియన్స్ ముందుకు వచ్చాడు. అప్పటివరకు హీరోగా మెప్పించిన విజయ్ సేతుపతి ఉప్పెన సినిమాలో రాయనం పాత్రలో అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు పొందారు. ఈ సినిమా తర్వాత ఆయన నటించిన చిత్రాలన్ని తెలుగులో రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇక ఇప్పుడు వచ్చిన మహారాజా సినిమా సైతం హిట్ అయిన సంగతి తెలిసిందే. మొన్నటివరకు కేవలం తమిళంలో మాత్రమే రిలీజ్ చేస్తారనుకున్న ఈ సినిమాను.. ఆకస్మాత్తుగా తెలుగులోనూ రిలీజ్ చేశారు. మొదటిరోజే ఈ చిత్రానికి పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. ఎప్పటిలాగే మరోసారి తనదైన నటనతో విజయ్ సేతుపతి అదరగొట్టేశాడంటూ పొగడ్తలు కురిపించారు. అలాగే సామినాథన్ డైరెక్షన్, అజనీష్ లోకనాథ్ బీజీఎమ్ బాగుందంటూ రివ్యూస్ ఇస్తున్నారు.

జూన్ 14న రిలీజ్ అయిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ క్రమంలో సోమవారం హైదరాబాద్ లో థాంక్సూ మీట్ ఏర్పాటు చేసింది చిత్రయూనిట్. ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు విజయ్ సేతుపతి. అలాగే పుష్ప 2 ఆఫర్ గురించి కూడా రియాక్ట్ అయ్యారు. డైరెక్టర్ బుచ్చిబాబు, రామ్ చరణ్ కాంబోలో రాబోతున్న ఆర్సీ 16లో ఏదైనా పాత్రలో చేసే ఛాన్స్ ఉందా ? అని అడగ్గా.. లేదని చెప్పారు. ఎటువంటి పాత్రలు పోషించడం ఇష్టమని అడగ్గా.. రొమాంటిక్ రోల్స్ చేయడమని అన్నారు. పుష్ప సినిమా ఆఫర్ మీరు రిజెక్ట్ చేశారా..? అని అడగ్గా ఆసక్తికర ఆన్సర్ ఇచ్చాడు విజయ్ సేతుపతి.

“సైరా తర్వాత ఉప్పెన వరకు గ్యాప్ తీసుకోలేదు. నేను సీరియస్ గా ప్రయత్నించాను సర్. కానీ ఎవరు నాుక అవకాశాలివ్వలేదు. పుష్ప మూవీలో నేను ఛాన్స్ రిజెక్ట్ చేయలేదు. అయితే అన్నిసార్లు నిజాలు మాట్లాడకూడదు. కొన్నిసార్లు అబద్ధాలు చెప్పడం మంచిది ” అని అన్నారు. పుష్ప సినిమాలో నటించాలని ఉన్నా డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం వల్లే ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్లు గతంలోనే క్లారిటీ ఇచ్చారు విజయ్ సేతుపతి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.