AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Abhinaya: అభినయ ఇంట తీవ్ర విషాదం.. రిక్షాలో వెళుతూ కన్నుమూసిన తల్లి.. కన్నీరుమున్నీరవుతోన్న నటి

ప్రముఖ నటి అభినయ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆమె తల్లి అకస్మాత్తుగా కన్నుమూశారు. రిక్షాలో బయటకెళ్లిన ఆమె.. ఊహించని విధంగా చనిపోయినట్లు నటి అభినయ వెల్లడించింది. ఆగస్టు 17న ఈ విషాదం జరిగినట్లు ఆమె తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా తన తల్లిని తలుచుకుని ఎమోషనల్ పోస్ట్ చేసిందీ అందాల తార.

Abhinaya: అభినయ ఇంట తీవ్ర విషాదం.. రిక్షాలో వెళుతూ కన్నుమూసిన తల్లి.. కన్నీరుమున్నీరవుతోన్న నటి
Abhinaya
Basha Shek
|

Updated on: Sep 01, 2024 | 2:31 PM

Share

ప్రముఖ నటి అభినయ ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆమె తల్లి అకస్మాత్తుగా కన్నుమూశారు. రిక్షాలో బయటకెళ్లిన ఆమె.. ఊహించని విధంగా చనిపోయినట్లు నటి అభినయ వెల్లడించింది. ఆగస్టు 17న ఈ విషాదం జరిగినట్లు ఆమె తెలిపింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా తన తల్లిని తలుచుకుని ఎమోషనల్ పోస్ట్ చేసిందీ అందాల తార. ‘అమ్మ ఇక నువ్వు లేవనే విషయాన్ని ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను. ఇలా ఉన్నట్లుండి మమ్మల్ని వదిలేసి వెళ్లిపోతావనుకోలేదు. తాతలానే నువ్వు కూడా ఇలా రిక్షాలోనే చనిపోయావు. తండ్రి-కూతురు ఇలా ఒకేలా మరణించడం ఎంత యాద్ధృచ్చికమో కదా! నువ్వు లేకపోతే నేను ఇంత సాధించేదాన్ని కాదు. ప్రతిచోట నన్ను సపోర్ట్ చేస్తూ అండగా నిలబడ్డావు. ఇప్పుడు నీ బాధ్యతని సాయిసునందన్ తీసుకుంటాడు. జన్మంటూ ఉంటే మ మళ్లీ మళ్లీ నీ కూతురిగానే పుట్టాలని కోరుకుంటున్నా. నువ్వు ఎప్పటికీ మాతో ఉంటావమ్మ’ అని తన ఆవేదనకు అక్షర రూపమిచ్చింది అభినయ. ప్రస్తుతం ఈ పోస్ట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు విచారం వ్యక్తం చేస్తున్నారు. అభినయ తల్లి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నారు. అలాగే ఈ బాధ, దుఃఖాన్ని తట్టుకునే శక్తి ఆమెకు ఇవ్వాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నారు.

తమిళనాడుకు చెందిన అభినయ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. ఆమె పుట్టుకతోనే బధిర. అంటే మాట్లాడలేదు, వినపడదు. అయినా సరే సినిమాల్లో సత్తా చాటుతోంది. రవితేజ నటించిన శంభో శివ శంభో సినిమాతో తెలుగు ప్రేక్షకులను మొదటిసారిగా పలకరించిందీ అందాల తార. ఆ తర్వాత ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో వెంకటేశ్‌- మహేశ్‌లకు చెల్లిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఇవి కూడా చదవండి

నటి  అభినయ ఎమోషనల్ పోస్ట్..

అలాగే తెలుగులో నేనింతే, కింగ్, దమ్ము, ఢమరుకం, ధృవ, రాజుగారి గది 2, సీతారామం, గామి, ద ఫ్యామిలీ స్టార్ తదితర చిత్రాల్లోనూ యాక్ట్ చేసింది. ఇక కోలీవుడ్ లోనూ పలు సినిమాల్లో నటించింది. కొన్ని రోజుల క్రితం స్టార్ హీరో విశాల్ సరసన ‘మార్క్ యాంటోనీ’ యాక్ట్ చేసింది అభినయ.

హీరో విశాల్ తో అభినయ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అరుదైన ప్రపంచ రికార్డులో టీమిండియా నయా సెన్సేషన్
అరుదైన ప్రపంచ రికార్డులో టీమిండియా నయా సెన్సేషన్
మిత్రమా మరికొన్ని గంటలే ఛాన్స్‌.. లేకుంటే రూ.1000 ఫైన్‌!
మిత్రమా మరికొన్ని గంటలే ఛాన్స్‌.. లేకుంటే రూ.1000 ఫైన్‌!
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు పూర్తి.. నేటి నుంచే పాలన!
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు పూర్తి.. నేటి నుంచే పాలన!
గ్యాస్‌ సిలిండర్‌ ధర పెరగనుందా? తాజా రిపోర్ట్స్‌ ప్రకారం..
గ్యాస్‌ సిలిండర్‌ ధర పెరగనుందా? తాజా రిపోర్ట్స్‌ ప్రకారం..
ఫిట్‌నెస్ కోసం ఈ పవర్ డ్రింక్ ట్రై చేయండి: స్టార్ బ్యూటీ
ఫిట్‌నెస్ కోసం ఈ పవర్ డ్రింక్ ట్రై చేయండి: స్టార్ బ్యూటీ
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్ష తేదీలు వచ్చేశాయ్‌.. పూర్తి షెడ్యూల్
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్ష తేదీలు వచ్చేశాయ్‌.. పూర్తి షెడ్యూల్
తలదన్నే వేగం.. వందే భారత్ స్లీపర్ రైలు అరుదైన రికార్డ్
తలదన్నే వేగం.. వందే భారత్ స్లీపర్ రైలు అరుదైన రికార్డ్
తగ్గుముఖం పడుతున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో ఎంతంటే..
తగ్గుముఖం పడుతున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో ఎంతంటే..
నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన భారత్‌!
నాలుగో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిన భారత్‌!
పదో తరగతి అర్హతతో 714 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.50 వేల జీతం
పదో తరగతి అర్హతతో 714 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.50 వేల జీతం