Vishwak Sen: పాగల్ ప్రీరిలీజ్ ఈవెంట్లో విశ్వక్ సేన్ సంచలన వ్యాఖ్యలు.. లెక్క తప్పైతే పేరు మార్చుకుంటా అంటూ…
మాస్ కా దాస్ విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్ జంటగా నటించిన చిత్రం పాగల్. దిల్‌రాజు సమర్పణలో బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మించగా.. ఇందులో సిమ్రాన్
మాస్ కా దాస్ విశ్వక్ సేన్, నివేదా పేతురాజ్ జంటగా నటించిన చిత్రం పాగల్. దిల్‌రాజు సమర్పణలో బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్రాన్ని నిర్మించగా.. ఇందులో సిమ్రాన్ చౌదరీ, మేఘాలేఖ, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రలలో నటించారు. నరేష్ కొప్పిలి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్ట్ 19న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను బుధవారం (ఆగస్ట్ 11న) హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ వేడకలో హీరో విశ్వక్ సేన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.
ఈ సందర్బంగా విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. ఈ సక్సెస్ మీట్‌లో నేను ఎక్కువగా మాట్లాడతాను.. నేను మధ్యాహ్నం ఈ సినిమా చూశాను. అందుకే సక్సెస్ మీట్ అంటున్నా.. నేను చాలా మందిని లవ్ చేసా అంటున్నారు. కానీ దానికి క్యాలిక్యులేషన్ ఏంటో తెలుసా ? ముందు అందగా ఉందో లేదో చూస్తారు. డబ్బును చూస్తారు. ఆ తర్వాత మన కులమా కాదా అని చూస్తారు. ఇలా చాలా లెక్కలు వేసుకుని ప్రేమిస్తారు. కానీ ఇవేమి లేకుండా ప్రేమించిన వాడి గాధే పాగల్. రెండు నెలల్లో చనిపోయే ముందు తన తల్లి కండిషనల్‌గా ప్రేమించు అందరూ నిన్ను తిరిగి ప్రేమిస్తారు అని చెబుతుంది. ఆతర్వాత కొద్ది రోజులకు తల్లి చనిపోతుంది. దీంతో అతను ఒంటరివాడు అయిపోతాడు. ఆ సమయంలో తనకు తల్లి చెప్పింది గుర్తుకు వస్తుంది. అందర్ని ప్రేమించు.. ఎక్కడో ఒక చోట నేను దొరుకుతా అని చెప్పిన మాటను గుర్తుంచుకుని తన తల్లి ప్రేమను వెతుక్కుంటూ స్టార్ట్ చేసిన జర్నీనే ఈ పాగల్ ఆ తర్వాత జరిగిన పరిణామాలే సినిమా అంటూ చెప్పుకొచ్చాడు విశ్వక్ సేన్.
ఈ సినిమాను దిల్ రాజు మేము.. రూ 5లో తీద్దాం అనుకుందాం. కానీ రాజు గారు పది మెట్లు ఎక్కించారు. ఈ సినిమా కథ చెప్పినప్పుడు నాకు మైండ్ బ్లాక్ అయ్యింది. ఈ మూవీతో పెద్ద హిట్టు కొట్టబోతున్నాము. అందరూ శుక్రవారం చిత్రాలను విడుదల చేస్తున్నారు. కానీ మేము పాగల్ కదా.. అందుకే శనివారం రిలీజ్ చేస్తున్నాం. ఆ రోజున పార్టీలు, పబ్‌లలోనే కాదు… థియేటర్లలో కూడా ఉంటాయి. చాలా మంది ఈ సమయంలో సినిమా విడుదల చేయడం కరెక్టా అని అడుగుతున్నారు. నేను వాళ్లకు చెప్పేది ఒక్కటే. సర్కస్‌లో ఉన్న సింహంతో ఎవరైనా ఆడుకుంటారు. కానీ నేను అడవికి వచ్చే ఆడుకునే టైపు. మూసిన థియేటర్లను తెలిపిస్తా. అమ్మతోడు. నా పేరు విశ్వక్ సేన్. సినిమా విషయంలో నా లెక్క తప్పైతే పేరు మార్చుకుంటా. థియేటర్లో సీట్లు చింపేయకండి. స్వాతంత్ర దినోత్సవం. 15 కానీ.. థియేటర్ల ఇండిపెండెన్స్ డే 14 అంటూ సినిమా పై ధీమా వ్యక్తం చేశాడు.
Also Read: Vijay Devarakonda: వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న విజయ్ దేవరకొండ.. యూవర్ బాయ్ ఈజ్ బ్యాక్ అంటున్న హీరో..
Salaar Movie: ‘సలార్’ నుంచి వీడియో లీక్.. ఆకట్టుకుంటున్న ప్రభాస్ లుక్..