Vijay Devarakonda: వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న విజయ్ దేవరకొండ.. యూవర్ బాయ్ ఈజ్ బ్యాక్ అంటున్న హీరో..

కరోనా సెకండ్ వేవ్ చిత్రపరిశ్రమలో తిరిగి సందడి మొదలైంది. పరిస్థితులు మెరుగ్గా ఉన్నప్పుడే షూటింగ్స్ శరవేగంగా జరుపుకుంటూ ప్రేక్షకుల ముందుకు తమ

Vijay Devarakonda: వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న విజయ్ దేవరకొండ.. యూవర్ బాయ్ ఈజ్ బ్యాక్ అంటున్న హీరో..
Vijay Devarakonda
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 12, 2021 | 7:58 AM

కరోనా సెకండ్ వేవ్ చిత్రపరిశ్రమలో తిరిగి సందడి మొదలైంది. పరిస్థితులు మెరుగ్గా ఉన్నప్పుడే షూటింగ్స్ శరవేగంగా జరుపుకుంటూ ప్రేక్షకుల ముందుకు తమ చిత్రాలను విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. భారీ బడ్జెట్ సినిమాల నుంచి చిన్న చిత్రాల వరకు అన్ని జోరుగా నిర్మాణ పనులు జరుపుకుంటున్నాయి. ఈ క్రమంలోనే యంగ్ హీరో విజయ్ దేవరకొండ కూడా లైగర్ సినిమా పనులను మొదలేట్టారు. ఈ చిత్రానికి మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తుండగా… బాలీవుడ్ బ్యూటీ అనన్య హీరోయిన్‏గా నటిస్తుంది. మిక్డ్స్ మార్షల్ ఆర్ట్స్ కథాంశంతో తెరకెక్కిస్తున్న ఈ సినిమాను పూరీ కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్లపై ఛార్మీ, పూరీ జగన్నాథ్, కరణ్ జోహర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుత చివరి దశలో ఉంది. అయితే తాజాగా ఈ సినిమా కోసం విజయ్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నట్లుగా తెలిపాడు. యూవర్ బాయ్ ఈజ్ బ్యాక్.. వర్క్ ఫ్రమ్ హోమ్. విషయాలను కదిలిద్దాం అంటూ విజయ్ దేవరకొండ తన ట్విట్టర్ ఖాతాలో ఓ ఫోటోను షేర్ చేశారు. అందులో విజయ్ ముందు మైక్ ఉండగా.. చేతిలో ఓ కాఫీ కప్ పట్టుకుని.. మరో చేతిలో డైలాగ్ పేపర్ పట్టుకుని చదువుతున్నారు. దీనిని బట్టి యంగ్ హీరో ఇంటి వద్ద నుంచే డబ్బింగ్ చెప్పడం స్టార్ట్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఇది ఖచ్చితంగా లైగర్ టీజర్ కోసమే అయి ఉంటుందని విజయ్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. దీంతో విజయ్ మళ్లీ లైగర్ పనులు స్టార్ట్ చేయడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. త్వరలోనే లైగర్ టీజర్ రాబోతుందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇందులో విజయ్ కిక్ బాక్సర్‍గా కనిపించనున్నాడు. ఇందుకోసం రౌడీ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ తీసుకున్నాడు. భారీ వర్కవుట్స్ చేసి సిక్స్ ప్యాక్ బాడీతో కంప్లీట్ మేకోవర్ అయ్యాడు. ఈ సినిమాలో రమ్యక్రిష్ణ కీలక పాత్రల నటిస్తుండగా.. రోనీత్ రాయ్, ఆలీ తదితరులు నటిస్తున్నారు.

ట్వీట్..

Also Read: Salaar Movie: ‘సలార్’ నుంచి వీడియో లీక్.. ఆకట్టుకుంటున్న ప్రభాస్ లుక్..

Raja Raja Chora Movie: శ్రీవిష్ణు సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్.. ‘రాజ రాజ చోర’ వచ్చేది అప్పుడే..

Salaam Namaste: విడుదలకు సిద్ధమైన ‘సలామ్ నమస్తే’.. థియేటర్‏లో రిలీజ్ ఎప్పుడంటే..