Vishnu Vishal: మట్టికుస్తీ తర్వాత ఫాంటసీ లవ్ డ్రామాతో రానున్న యంగ్ హీరో విష్ణు విశాల్..

ఇటీవలే ‘మట్టికుస్తీ’తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న విష్ణు విశాల్ హీరోగా ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ మూవీ రానుంది.

Vishnu Vishal: మట్టికుస్తీ తర్వాత  ఫాంటసీ లవ్ డ్రామాతో రానున్న యంగ్ హీరో విష్ణు విశాల్..
Vishnu Vishal
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 23, 2023 | 9:26 AM

డైనమిక్ హీరో విష్ణు విశాల్‌ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. కెరీర్ బిగినింగ్ నుంచి  వైవిధ్యభరితమైన కథలు ఎంచుకుంటూ వరుస విజయాలతో అలరిస్తున్నాడు ఈ యంగ్ హీరో. ఇటీవలే ‘మట్టికుస్తీ’తో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న విష్ణు విశాల్ హీరోగా ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ మూవీ రానుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ సత్య జ్యోతి ఫిల్మ్స్‌ పతాకంపై సక్సెస్ఫుల్ డైరెక్టర్ రామ్‌ కుమార్‌ దర్శకత్వంలో తాజాగా కొత్త ప్రాజెక్ట్ ని అనౌన్స్ చేశారు. విష్ణు విశాల్‌, రామ్‌ కుమార్‌ లది పాత్ బ్రేకింగ్ కాంబినేషన్. ‘ముండసుపట్టి’, ‘రాత్ససన్‌’ వంటి విజయాల తర్వాత ఈ కలయికలో రూపొందనున్న మూడో చిత్రమిది. రాత్ససన్‌ పలు భాషల్లో రీమేక్ అయ్యి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

విష్ణు విశాల్ ఎఫ్‌ఐఆర్, మట్టికుస్తీతో సహా బ్యాక్-టు-బ్యాక్ కమర్షియల్ హిట్‌లతో, తన వైవిధ్యమైన కథల ఎంపిక ద్వారా.. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు , ట్రేడ్ సర్కిల్‌ల లో ప్రస్తుతం మోస్ట్ బ్యాంకబుల్ స్టార్‌గా నిలిచారు. ఇక దర్శకుడు రామ్ కుమార్ ‘మాస్టర్ అఫ్ ఆల్ జానరర్స్’గా ప్రశంసలు పొందారు. తన తొలి చిత్రం ‘ముండాసుపట్టి’ కామెడీ కేపర్ అయితే, తన రెండవ చిత్రం ‘రాత్ససన్‌’తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. వెన్నులో వణుకుపుట్టించిన సైకలాజికల్ థ్రిల్లర్ ఇది. సత్యజ్యోతి ఫిలింస్ తమ గత సినిమాలకు పూర్తి భిన్నంగా ఉండే సినిమా కోసం ఈ పాత్ బ్రేకింగ్ కాంబినేషన్‌ తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

ఇంకా టైటిల్ ఖారారు కాని ఈ చిత్రం బిగ్ కాన్వాస్‌పై కామెడీ అంశాలతో కూడిన ఫాంటసీ లవ్ డ్రామా ఆధారంగా అందమైన, ఇంటెన్స్ కథగా ఉంటుంది. ఈ సక్సెస్ ఫుల్ కాంబోలో వచ్చిన రెండు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ అవ్వడంతో ఈ సినిమా హ్యాట్రిక్ స్పెల్ పూర్తి చేయడం ఖాయం. ఈ సినిమా షూటింగ్ ప్లాన్స్, నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియజేస్తారు.