Chiranjeevi: అభిమానుల అంచనాలు అందుకోవడం కోసం చిరంజీవి అంతలా కష్టపడ్డారు.. దర్శకుడు బాబీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

మెగా ఫ్యాన్స్ చిరంజీవి నుంచి ఏం కోరుకుంటున్నారో అన్ని ఈ సినిమాలో ఉండేలా ప్లాన్ చేశారు దర్శకుడు బాబీ. అనుకున్నట్టుగానే వాల్తేరు వీరయ్య సినిమా రిలీజ్ అయ్యి సంచలన విజయం సాధించింది.

Chiranjeevi: అభిమానుల అంచనాలు అందుకోవడం కోసం చిరంజీవి అంతలా కష్టపడ్డారు.. దర్శకుడు బాబీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Waltair Veerayya
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 23, 2023 | 9:20 AM

మెగా స్టార్  చిరంజీవి నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ వాల్తేరు వీరయ్య. చిరంజీవి చాలా కాలం తర్వాత వింటేజ్ లుక్ లో కనిపించి అదరగొట్టారు ఈ మూవీలో.. మెగా ఫ్యాన్స్ చిరంజీవి నుంచి ఏం కోరుకుంటున్నారో అన్ని ఈ సినిమాలో ఉండేలా ప్లాన్ చేశారు దర్శకుడు బాబీ. అనుకున్నట్టుగానే వాల్తేరు వీరయ్య సినిమా రిలీజ్ అయ్యి సంచలన విజయం సాధించింది. మొదటి షో నుంచి సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది. వాల్తేరు వీరయ్య థియేటర్లు మాత్రం ప్రేక్షకులతో కళకళలాడుతున్నాయి. దీనికి తగ్గట్టే వసూళ్లలో రికార్డులు సృష్టిస్తోంది మెగాస్టార్‌ మూవీ. సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా రిలీజైన వాల్తేరు వీరయ్య భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఇప్పటికే వందకోట్ల క్లబ్ దాటేసింది ఈ మూవీ. ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం చిరంజీవి ఎంత రిస్క్ చేశారో తెలిపారు దర్శకుడు బాబీ.

వాల్తేరు వీరయ్య సినిమాలో వన్ ఆఫ్ ది హైలైట్ గా నిలిచిన సీన్ మెగాస్టార్ ఇంట్రో.. సముద్రంలో పడవ పై చిరంజీవి ఎంట్రీ సీన్ ఉంటుంది. అయితే ఈ సీన్ కోసం చిరంజీకి చాలా కష్టపడ్డారట. ఆ విషయాలను దర్శకుడు బాబీ తెలిపారు.

వాల్తేరు వీరయ్య సినిమా ఇంట్రడక్షన్ సీన్ ను సముద్రం నేపథ్యంలో తెరకెక్కించాం.. షాట్ అనుకున్న విధంగా రావడం కోసం చిరంజీవి గారు ఏకంగా 10 రోజుల పాటు నీళ్లలో తడిశారు. నీటిలో తడుస్తూ ఆయన రోజూ షూటింగ్ చేశారు. ఆ సీన్ అభిమానుల అంచనాలకు తగినట్టుగా ఉండటం కోసం ఆయన అంతగా కష్టపడ్డారు అని తెలిపారు దర్శకుడు బాబీ.