Pathaan: షారుక్ ఖాన్ సినిమా కోసం హైదరాబాద్‌లో అంత చార్జ్ చేస్తున్నారా.. టికెట్ ధర దిమ్మతిరగాల్సిందే

షారుక్ సినిమా వచ్చి చాలా కాలం అయ్యింది. షారూ క్ ఖాన్ న‌టిస్తోన్న ప‌వ‌ర్ ప్యాక్‌డ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ గా రాబోతుంది ‘పఠాన్’. జీరో సినిమా తర్వాత షారుక్ ఖాన్ నటిస్తున్న సినిమా ఇది. ఈ మూవీ కోసం షారుక్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు

Pathaan: షారుక్ ఖాన్ సినిమా కోసం హైదరాబాద్‌లో అంత చార్జ్ చేస్తున్నారా.. టికెట్ ధర దిమ్మతిరగాల్సిందే
Pathaan
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 23, 2023 | 8:53 AM

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ సినిమా కోసం ఆయన అభిమానులంతా వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. షారూ క్ ఖాన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ పఠాన్. షారుక్ సినిమా వచ్చి చాలా కాలం అయ్యింది. షారూ క్ ఖాన్ న‌టిస్తోన్న ప‌వ‌ర్ ప్యాక్‌డ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ గా రాబోతుంది ‘పఠాన్’. జీరో సినిమా తర్వాత షారుక్ ఖాన్ నటిస్తున్న సినిమా ఇది. ఈ మూవీ కోసం షారుక్ ఫ్యాన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ ఆదిత్య చోప్రా, డైరెక్ట‌ర్ సిద్ధార్థ్ ఆనంద్ క‌లిసి ‘పఠాన్’ చిత్రాన్ని ఇండియా బిగ్గెస్ట్ యాక్ష‌న్ చిత్రంగా, విజువ‌ల్ వండ‌ర్‌గా మార్చ‌టానికి అడుగులు వేస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ య‌ష్ రాజ్ ఫిలింస్ ఈ చిత్రాన్ని అద్భుత‌మైన విజువ‌ల్స్‌తో, ఆశ్చ‌ర్య‌ప‌రిచే యాక్ష‌న్‌తో రూపొందిస్తోంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా  దీపికా ప‌దుకొనె నటిస్తుండగా.. జాన్ అబ్ర‌హం కీలకపాత్రలో కనిపించనున్నాడు.  జ‌న‌వ‌రి 25, 2023లో హిందీ, తెలుగు, త‌మిళ భాష‌ల్లో ‘పఠాన్’ సినిమా రిలీజ్ అవుతుంది.

అయితే ఈ సినిమా రిలీజ్ దగ్గర పడుతుండటం బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఇక హైదరాబాద్ లోనూ భారీ గా రిలీజ్ అవుతోంది ఈ సినిమా.. అయితే పఠాన్ సినిమా కోసం మన దగ్గర ఉన్న ఫ్యాన్స్ కు ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే హైదరాబాద్ లోని ఒక థియేటర్ లో పఠాన్ సినిమా కోసం టికెట్ ధర భారీగా వసూల్ చేస్తున్నారు.

హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ప్లాటినమ్ మూవీ టైంలో షారుక్ ఖాన్ పఠాన్ సినిమా కోసం ఏకంగా 450 రూపాయిలు ఛార్జ్ చేస్తున్నారు. టికెట్ ధర 450 రూపాయిలు ఉన్నప్పటికీ ఫ్యాన్స్ భారీగా టికెట్స్ బుక్ చేసుకుంటున్నారు.