Veera Simha Reddy: బ్లాక్ బస్టర్ వీరసింహారెడ్డి సినిమాకు ఎవరెవరు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారంటే..
సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ మూవీ లో బాలయ్య మరోసారి తన విశ్వ రూపం చూపించారు. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో చిత్రయూనిట్ అంతా ఆనందంలో తేలిపోతున్నారు.
నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ వీరసింహారెడ్డి . గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ మూవీ లో బాలయ్య మరోసారి తన విశ్వ రూపం చూపించారు. కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో చిత్రయూనిట్ అంతా ఆనందంలో తేలిపోతున్నారు. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ సరసన శ్రుతిహాసన్, హనీ రోజ్ హీరోయిన్స్ గా నటించారు. అలాగే వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక ;పాత్రలో నటించి మెప్పించారు. ఇటీవల కాలంలో వరలక్ష్మీకి టాలీవుడ్ లో అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి.
ఇదే గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన క్రాక్ సినిమాతో వరలక్ష్మీకి మంచి గుర్తింపు వచ్చింది. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో వరలక్ష్మీ అదరగొడుతోంది. ఇక బాలయ్య సినిమాలో కూడా ఇదే తరహా పాత్రతో మెప్పించింది ఈ అమ్మడు.
అయితే ఈ సినిమా కోసం వరలక్ష్మీ శరత్ కుమార్ భారీగా రెమ్యునరేషన్ తీసుకుందని టాక్ . వరలక్ష్మీ ఈ సినిమాకు 45 లక్షలు రెమ్యునరేషన్ తీసుకుందని తెలుస్తోంది . అలాగే ఈ సినిమాలో మరో కీలక పాత్ర చేసిన కన్నడ నటుడు దునియా విజయ్ వీరసింహారెడ్డి సినిమా కోసం కోటి రూపాయిలు తీసుకున్నారట. ఇక హీరోయిన్ శ్రుతిహాసన్ కోటి 2.5 కోటిరూపాయలు, హనీ రోజ్ 1 కోటి రూపాయిలు రెమ్యునరేషన్స్ తీసుకోగా బాలయ్య 20 కోట్లు తీసుకున్నారని తెలుస్తోంది.