ఆ బిజినెస్ మెన్ లైంగికంగా వేధిస్తున్నాడు.. టాలీవుడ్ నటి సంచలన పోస్ట్
05 January 2025
Basha Shek
సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉదంతాలు ఎంతటి సంచలనం రేపాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఇప్పుడిప్పుడే నటీమణులు సినిమా ఇండస్ట్రీలో తమకు ఎదురైన చేదు అనుభవాలపై ధైర్యంగా నోరు విప్పుతున్నారు
ఈ నేపథ్యంలో మలయాళ ముద్దుగుమ్మ హనీరోజ్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ ఇప్పుడు ఇండస్ట్రీలో సంచలనం రేపుతోంది.
తనను ఓ వ్యక్తి లైంగికంగా వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తూ హనీ రోజ్ ఈ సెన్సేషనల్ పోస్ట్ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
గతంలో ఓ బిజినెస్ మెన్ నిర్వహించిన ఈవెంట్ కు తాను హాజరయ్యానని.. అప్పటి నుంచి అతను తన వెంట పడుతున్నాడని హనీ తెలిపింది.
తాను ఎక్కడికి వెళితే అక్కడ ఆ వ్యక్తి ప్రత్యక్షం అవుతున్నాడని, సామాజిక మాధ్యమాల్లో అభ్యంతకరకర పోస్టులు పెడుతున్నాడని వాపోయిందీ అందాల తార.
తనను అన్ని రకాలుగా వేధిస్తోన్న వ్యాపార వేత్త ఆగాడాలకు అడ్డుకట్ట పడేలా చట్టపరంగా పోరాడతానని హనీ రోజ్ చెప్పుకొచ్చింది.
హనీ రోజ్ పెట్టిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవడమే కాకుండా, సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తోంది.
ఇక్కడ క్లిక్ చేయండి..