టీమిండియా ఛీ కొట్టింది.. కట్‌చేస్తే.. 7 ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీలు.. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు రచ్చో రచ్చ

Mayank Agarwal, Vijay Hazare Trophy: భారత క్రికెట్ జట్టుకు దూరమైన ఓ స్టార్ ఆటగాడు వన్డే క్రికెట్‌లో పరుగుల వర్షం కురిపిస్తున్నాడు. ఇంగ్లండ్‌తో జరగనున్న వన్డే సిరీస్, ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు, అతను టీమిండియాలో చేరడానికి బలమైన ప్రయత్నం చేశాడు. కానీ, లక్ కలసి రాలేదు. ఈ క్రమంలో దేశవాళీ టోర్నీలో సెంచరీలతో చెడుగుడు ఆడేస్తున్నాడు.

టీమిండియా ఛీ కొట్టింది.. కట్‌చేస్తే.. 7 ఇన్నింగ్స్‌ల్లో 4 సెంచరీలు.. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు రచ్చో రచ్చ
Mayank Agarwal
Follow us
Venkata Chari

|

Updated on: Jan 06, 2025 | 8:37 AM

Mayank Agarwal, Vijay Hazare Trophy: భారత క్రికెట్ జట్టుకు దూరమైన ఓ స్టార్ ఆటగాడు వన్డే క్రికెట్‌లో పరుగుల వర్షం కురిపించాడు. ఇంగ్లండ్‌తో జరగనున్న వన్డే సిరీస్, ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు టీమిండియాలో చేరడానికి బలమైన ప్రయత్నం చేశాడు. కర్ణాటక ఆటగాడు మయాంక్ అగర్వాల్ ప్రస్తుతం విజయ్ హజారే ట్రోఫీ 2024-25లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. కేవలం ఏడు ఇన్నింగ్స్‌ల్లోనే 613 పరుగులు చేశాడు. అతను గత ఐదు ఇన్నింగ్స్‌లలో నాలుగింటిలో సెంచరీలు సాధించాడు. వాటిలో హ్యాట్రిక్ సెంచరీలు కూడా ఉన్నాయి. ఓ సెంచరీలో సెంచరీ కూడా మిస్సయింది. అందులో హాఫ్ సెంచరీ సాధించాడు. మయాంక్ కర్ణాటకకు కెప్టెన్‌గా కూడా వ్యవహరిస్తున్నాడు.

మయాంక్ 2020 నుంచి భారత్ తరపున వన్డే ఆడలేదు. కానీ, ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అతను విజయ్ హజారే ట్రోఫీలో 139 నాటౌట్, 100 నాటౌట్, 124, 116 నాటౌట్ ఇన్నింగ్స్‌లు ఆడాడు. అతని అత్యల్ప స్కోరు 18 పరుగులుగా నిలిచింది. మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో 47, 69 పరుగులు చేశాడు. అతను వరుసగా నాలుగు లిస్ట్ A సెంచరీలు సాధించే అవకాశం ఉంది. కానీ, అతను సౌరాష్ట్రపై 69 పరుగుల వద్ద ఔట్ అయ్యాడు. అతను 153.25 సగటు, 111.65 స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేశాడు. ఏడు మ్యాచ్‌ల్లో 66 ఫోర్లు, 18 సిక్సర్లు కొట్టాడు. ప్రస్తుతం, విజయ్ హజారే ట్రోఫీలో మయాంక్ తర్వాత, అతని మాజీ సహచరుడు కరుణ్ నాయర్ విదర్భ తరపున ఆడుతూ 6 మ్యాచ్‌లలో 542 పరుగులు చేశాడు.

ఇవి కూడా చదవండి

మయాంక్ అంతర్జాతీయ కెరీర్ ఎలా ఉందంటే?

33 ఏళ్ల మయాంక్ భారత్ తరపున ఐదు వన్డే మ్యాచ్‌లు ఆడాడు. అందులో అతను 86 పరుగులు చేశాడు. అతని చివరి వన్డే మ్యాచ్ 2020లో సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరిగింది. ఇందులో అతను 28 పరుగులు చేశాడు. లిస్ట్ A క్రికెట్‌లో, అతను 120 మ్యాచ్‌లలో 50.25 సగటుతో 5578 పరుగులు చేశాడు. అతని పేరిట 18 సెంచరీలు, 24 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 176 అతని అత్యధిక స్కోరు. మయాంక్ భారత్ తరపున 21 టెస్టులు ఆడాడు. అందులో అతను 41.33 సగటుతో 1488 పరుగులు చేశాడు. నాలుగు సెంచరీలు, ఆరు అర్ధ సెంచరీలు చేశాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..