Tollywood: త్వరలో తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్.. గ్రాండ్‌గా సీమంతం.. వీడియో ఇదిగో

గతంలో పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించి మెప్పించిన ఈ అందాల తార త్వరలోనే తల్లిగా ప్రమోషన్ పొందనుంది. ప్రస్తుతం ఆమె తొమ్మిది నెలల నిండు గర్భంతో ఉంది. దీంతో తాజాగా కుటుంబ సభ్యులు ఈ ముద్దుగుమ్మకు ఘనంగా సీమంతం నిర్వహించారు.

Tollywood: త్వరలో తల్లి కాబోతున్న టాలీవుడ్ హీరోయిన్.. గ్రాండ్‌గా సీమంతం.. వీడియో ఇదిగో
Tollywood Actress
Follow us
Basha Shek

|

Updated on: Jan 14, 2025 | 10:06 AM

గతంలో పలు తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా నటించి మెప్పించిన హరిప్రియ శుభవార్త చెప్పింది. ఆమె త్వరలో తల్లిగా ప్రమోషన్ పొందనుంది. ప్రస్తుతం ఈ నటి తొమ్మిది నెలల నిండు గర్భంతో ఉంది. ఈ క్రమంలోనే తన భర్త, ప్రముఖ నటుడు వశిష్ట సింహా హరిప్రియకు అంగరంగం వైభవంగా సీమంతం వేడుకను ఏర్పాటు చేశాడు. ఇరు కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు, సన్నిహితులు ఈ ఫంక్షన్ లో పాల్గొన్నారు. ఇక తన సీమంతం ఫంక్షన్‌కు సంబంధించిన వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకున్నారు వశిష్ట, హరిప్రియ. దీంతో ఈ వీడియో క్షణాల్లోనే వైరల్ గా మారింది. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు హరిప్రియ దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా హరిప్రియ, వశిష్ట సింహలది ప్రేమ వివాహం. ఇరు పెద్దల సమక్షంలో 2023లో పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు తమ అన్యోన్య దాంపత్య బంధానికి ప్రతీకగా ఒక పండంటి బిడ్డను తమ జీవితంలోకి ఆహ్వానించనున్నారు. దీంతో ఈ దంపతుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

హరిప్రియ, వశిష్ట పేరుకు కన్నడ నటులే అయినప్పటికీ టాలీవుడ్‌ తోనూ వీరికి ప్రత్యేక అనుబంధం ఉంది. ముఖ్యంగా హరిప్రియ పలు తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. తకిత తకిట సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిందీ అందాల తార. ఆ తర్వాత నానితో కలిసి పిల్ల జమీందార్ సినిమాలో నటించింది. ఇందులో పక్కింటమ్మాయిగా హరిప్రియ అందం, అభినయం అందరినీ ఆకట్టుకుంది. వీటి తర్వాత వరుణ్ సందేశ్‌తో కలిసి అబ్బాయి క్లాస్- అమ్మాయి మాస్, ఈ వర్షం సాక్షిగా సినిమాల్లో హీరోయిన్ గా నటించిందీ అందాల తార. అలాగే బాలకృష్ణతో కలిసి జై సింహా సినిమాలోనూ యాక్ట్ చేసింది. ఆ తర్వాత టాలీవుడ్ తెరపై పెద్దగా కనిపించలేదు. అయితే కన్నడ నాట మాత్రం స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోంది.

ఇవి కూడా చదవండి

హరిప్రియ సీమంతం .. వీడియో ఇదిగో..

View this post on Instagram

A post shared by Vasishta N Simha (@imsimhaa)

ఇక వశిష్ట విషయానికి వస్తే ఇతను కూడా కన్నడ నటుడే. కేజీఎఫ్ సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. నారప్ప, ఓదెల రైల్వే స్టేషన్‌, డెవిల్‌: ద బ్రిటీష్‌ సీక్రెట్‌ ఏజెంట్‌, యేవమ్‌, సింబా తదితర తెలుగు సినిమాల్లోనూ నటించాడు. విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తెలుగు ఆడియెన్స్ ను మెప్పిస్తున్నాడు.

భర్త వశిష్టతో హరి ప్రియ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.