Actor Suhas: ‘ఎంత పనిచేశావురా’.. కన్నీరుమున్నీరవుతోన్న హీరో సుహాస్.. అసలు ఏమైందంటే?
ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న ది మోస్ట్ ట్యాలెంటెడ్ హీరోల్లో సుహాస్ ఒకడు. ఇతర హీరోలకు భిన్నంగా వైవిధ్యమైన కథలతో సినిమాలు చేస్తూ వరుసగా హిట్లు అందుకుంటున్నాడీ యంగ్ హీరో. అలాంటి సుహాస్ ఇప్పుడు కన్నీరుమున్నీరవుతున్నాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో అతను పెట్టిన పోస్ట్ అందరినీ కదిలిస్తోంది.

యూట్యూబర్‌గా కెరీర్ ప్రారంభించాడు సుహాస్. ఆ తర్వాత పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, సపోర్టింగ్ రోల్స్ లో మెరిశాడు. ఇప్పుడు హీరోగానూ వరుసగా హిట్స్ కొడుతున్నాడు. ఓవైపు ప్రేమకథలు, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సినిమాలు చేస్తూనే మరోవైపు సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలతో తెలుగు ఆడియెన్స్ ను అలరిస్తున్నాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో చేతిలో రెండు, మూడు సినిమాలు ఉన్నాయి. ఇదిలా ఉంటే సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉంటాడు సుహాస్. తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ విషయాలను అందులో షేర్ చేసుకుంటుంటాడు. అలా తాజాగా ఈ ట్యాలెంటెడ్ హీరో ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడు. ప్రస్తుతం ఆ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ పోస్ట్ లో ఏముందంటే.. సుహాస్ చిన్న నాటి ఫ్రెండ్ మనోజ్ ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్ కు కారణాలేంటో తెలియదు కానీ క్లోజ్ ఫ్రెండ్ ఇలా అర్ధాంతరంగా కన్నుమూయడంతో సుహాస్ కన్నీరుమున్నీరవుతున్నాడు.
‘మనోజ్ చాలా మంచి వ్యక్తి. అందరితో ఇట్టే కలిసిపోతాడు. ఏదైనా అనుకుంటే వెంటనే చేసే క్యాపాసిటీ తనకు ఉంది. అలాంటి మంచి వ్యక్తి సూసైడ్ చేసుకోవడం నేను తట్టుకోలేకపోతున్నాను. ఎప్పుడు స్ట్రాంగ్ గా ఉండేవాడు. కానీ ఇప్పుడు ఇలా ఎందుకు చేశాడో అసలు అర్థం కాలేదు. నాకు మాటలు రావడం లేదు. బాధగా ఉంది. నాకు ఈ విషయం గురించి చెప్పాలంటే కన్నీళ్లు ఆగడం లేదు.. అసలు ఏమైంది? ఎంత పని చేశావు రా నా కొడకా’ అంటూ కన్నీరుమున్నీరవుతున్నాడు సుహాస్.
హీరో సుహాస్ షేర్ చేసిన ఎమోషనల్ పోస్ట్..
View this post on Instagram
ఇక ఈ పోస్టుకు హార్ట్ బ్రేక్ అయిన సింబల్ ను పెట్టి తన ఫ్రెండ్ తో ఉన్నఫొటోలను కూడా షేర్ చేశాడు సుహాస్. ప్రస్తుతం ఈ పోస్ట్ తెగ వైరలవుతోంది. ఇది చూసిన అభిమానులు, నెటిజన్లు సుహాస్ కు ధైర్యం చెబుతూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఓ భామ అయ్యో రామ అనే సినిమాలో నటిస్తున్నాడు సుహాస్. మలయాళ భామ మాళవిక మనోజ్ ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాలో ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు.
కుమారుడితో హీరో సుహాస్..
View this post on Instagram
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








