ఛావా తెలుగు వెర్షన్ జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్నారా?
చావా సినిమా ఇప్పుడు థ్రూఅవుట్ ఇండియా సంచలనం సృష్టిస్తోంది. అందరినీ ఆకట్టుకుంటూనే బాక్స్ ఆఫీస్ దగ్గర కోట్లకు కోట్లు కలెక్షన్స్ రాబడుతోంది. దీంతో తెలుగు ఫ్యాన్స్ కూడా ఈ సినిమా చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కానీ తెలుగు వెర్షన్ అందుబాటులో లేకపోవడంతో కాస్త డిస్ అప్పాయింట్ అవుతున్నారు. దీంతో ఈ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ ను టాలీవుడ్ బిగ్ ప్రొడక్షన్ కంపెనీ తొందరలో తీసుకొస్తుందని ఓ ప్రచారం జరుగుతోంది. అందులో హీరో క్యారెక్టర్ కి కానీ సినిమా నేరేట్ చేసేందుకు కానీ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో డబ్బింగ్ చెప్పించేందుకు రెడీ అవుతుందనే టాక్ బయటికి వచ్చింది. దీంతో తారక్ ఫ్యాన్స్ ఇప్పుడు నెట్టింట ఈ విషయం పై సెర్చ్ చేస్తున్నారు. ఇస్ ఎన్టీఆర్ డూయింగ్ చావా అంటూ సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. దీనిపై క్లారిటీ కావాలంటూ పోస్టులు పెడుతున్నారు.
చావా సినిమా ఎఫెక్ట్ తో ఇప్పుడు ఛత్రపతి శివాజీ బయోపిక్ ని కూడా తెరకెక్కించాలనే డిమాండ్ నెట్టింట ఎక్కువైంది. దాంతో పాటే ఈ సినిమాలో గ్లోబల్ స్టార్ రాంచరణ్ హీరోగా నటించితే చూడాలనే కోరిక థ్రూఅవుట్ ఇండియా చాలా గట్టిగా వినిపిస్తోంది. ఇప్పటికే జక్కన్న ట్రిపుల్ ఆర్ సినిమాలో కాశాయ బట్టల్లో గుబురు గడ్డం, కోరమీసం తో చరణ్ ను చూసిన నార్త్ ఫ్యాన్స్ ఛత్రపతిగా రాంచరణ్ నే పర్ఫెక్ట్ అంటూ నెట్టింట పోస్టులు పెడుతున్నారు. రాంచరణ్ ను ఛత్రపతి శివాజీగా ఫోటోషాప్ చేసిన ఫోటోలు షేర్ చేస్తున్నారు. అంతేకాదు ఈ సినిమా జక్కన్న డైరెక్ట్ చేస్తే సినిమా నెక్స్ట్ లెవెల్ కు వెళ్ళడం ఖాయం అంటూ చెబుతున్నారు. జక్కన్నను ట్యాగ్ చేసి చరణ్ తో ఛత్రపతి శివాజీ సినిమా చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే చావా సినిమా పై అంతటా ప్రశంసలు వర్షం కురుస్తుంది. విక్కీ నటనతో మరోసారి దేశ ప్రజలు ఛత్రపతి శివాజీని ఆయన కుమారుడు సంభాజీ మహారాజును తలచుకుంటున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ ఈ సినిమా పై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా ఇప్పుడు ఈ సినిమా గురించి మాట్లాడారు. ఇటీవల జరిగిన 98వ అఖిల భారత మరాఠీ సాహిత్య సమ్మేళనం ప్రారంభోత్సవంలో ప్రధాని మోడీ చావా సినిమా పై ప్రశంసలు కురిపించారు.

ఆచి.. తూచి.. అడుగు వెయ్యాలంటారు ఇందుకే..

కొంప ముంచిన కాఫీ.. ఏకంగా రూ.415 కోట్లు పరిహారం..

వేసవిలో బైక్ లు వాడుతున్నారా.. వీటితో జాగ్రత్త!

తాచుపాము కరిచినా..10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థి వీడియో

తెలుగు రాష్ట్రాల్లో బుసలు కొడుతున్న పాములు వీడియో

ఈ కోతికి ఫోన్ కనిపిస్తే చాలు.. వీడియో

ఎక్కడపడితే అక్కడ రీల్స్ చేస్తే ఇలాగే పగుల్తది..
