షాకింగ్ : అప్పుడే OTTలోకి అజిత్ లేటెస్ట్ మూవీ..!
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన లేటెస్ట్ సినిమా విదాముయర్చి. తెలుగులో పట్టుదల పేరుతో రిలీజైంది. మేయిళ్ తిరుమేని తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో బ్యూటీ క్వీన్ త్రిష హీరోయిన్ గా నటించింది. అర్జున్ సర్జా, రెజీనా కసాండ్రా తదితరులు కీలకపాత్రలు పోషించారు. ఫిబ్రవరి 6వ తేదీన తమిళ్ తో పాటు తెలుగులోనూ ఈ సినిమా థియేటర్లలో రిలీజైంది. పోస్టర్స్, సాంగ్స్ , ట్రైలర్ కు మంచి స్పందన రావడంతో ఓపెనింగ్స్ కూడా బాగా వచ్చాయి. అయితే ఆ తర్వాత క్రమంగా వసూళ్లు పడిపోయాయి. అయినా అజిత్ మేనియాతో సినిమాకు రూ. 130 కోట్ల వరకు కలెక్షన్లు వచ్చాయి. ఇక అజిత్ నటన, యాక్షన్ సీక్వెన్స్‌లు హైలెట్ గా నిలిచాయి.
అలాంటి ఈ సినిమా ఇప్పుడు స్ట్రీమింగ్‌కు రెడీ అయింది.ఎస్ ! థియేటర్లలో యావరేజ్ గా నిలిచిన అజిత్ పట్టుదల మూవీ అప్పుడే ఓటీటీలోకి రానుందని తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. థియేటర్లలో రిలీజైన 50 రోజులకు అంటే.. మార్చి ఆఖరి వారం లో ఈ సినిమా ఓటీటీలోకి వస్తుందని ప్రచారం జరిగింది. అయితే థియేట్రికల్ రన్ అనుకున్న విధంగా లేకపోవడంతో ముందుగానే ఈ సినిమా స్ట్రీమింగ్‍కు రానుందని తెలుస్తోంది. మార్చిమొదటి వారంలోనే అజిత్ సినిమాను స్ట్రీమింగ్‍కు తీసుకొచ్చేందుకు నెట్‍ఫ్లిక్స్ ప్రయత్నాలు చేస్తోందని సమాచారం. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి ఈ సినిమాను ఓటీటీలోకి తీసుకురా వొచ్చని ప్రచారం జరుగుతోంది.
ఆపరేషన్ "ఆమ్లెట్'' పోలీసుల అండర్‌కవర్..
పెళ్లి ఊరేగింపు డీజే హోరు.. సౌండ్‌కి 140 ప్రాణాలు బలి
వైద్యుల అద్భుతం..18 నెలల చిన్నారికి లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్
చరిత్ర సృష్టించిన రితిక.. దేశంలోనే తొలి ట్రాన్స్ఉమన్ అంపైర్
నాడు "మీసాల పిల్ల'' అంటూ ఎగతాళి.. నేడు స్టేట్ టాపర్ గా సక్సెస్
డోర్ తీసే ఉంది.. డెలివరీ బాయ్ ఏం చేసాడంటే
రైళ్లో టీసీని చూడగానే ప్రయాణికుడు పరుగో పరుగు.. కారణం ఇదే

