Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: మేకప్ కోసం 4 గంటలు.. గుర్తుపట్టలేనంతగా మారిపోయిన యంగ్ హీరో.. ఎవరో తెలుసా..?

ప్రస్తుతం వరుస హిట్స్ అందుకుంటూ హీరోగా దూసుకుపోతున్న అతడు.. ఇప్పుడు మరో సాహసం చేసేందుకు రెడీ అయ్యాడు. తన కొత్త సినిమాలో పాత్ర కోసం దాదాపు 4 గంటలు మేకప్ కోసం కేటాయించాడు. చివరగా గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. పాత్ర కోసం ఆ హీరో డెడికేషన్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్. అతడి ఓపిక.. కథపై తనకున్న నమ్మకాన్న చూసి పొగడ్తలు కురిపిస్తున్నారు. పైన ఫోటోను చూశారా..?

Tollywood: మేకప్ కోసం 4 గంటలు.. గుర్తుపట్టలేనంతగా మారిపోయిన యంగ్ హీరో.. ఎవరో తెలుసా..?
Actor 2
Follow us
Rajitha Chanti

|

Updated on: Jun 22, 2024 | 1:20 PM

విభిన్నమైన కథలు.. వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ సినీరంగంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. సహజమైన నటనతో విమర్శకుల ప్రశంసలు పొందిన ఆ హీరో తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం వరుస హిట్స్ అందుకుంటూ హీరోగా దూసుకుపోతున్న అతడు.. ఇప్పుడు మరో సాహసం చేసేందుకు రెడీ అయ్యాడు. తన కొత్త సినిమాలో పాత్ర కోసం దాదాపు 4 గంటలు మేకప్ కోసం కేటాయించాడు. చివరగా గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. పాత్ర కోసం ఆ హీరో డెడికేషన్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్. అతడి ఓపిక.. కథపై తనకున్న నమ్మకాన్న చూసి పొగడ్తలు కురిపిస్తున్నారు. పైన ఫోటోను చూశారా..? ముసలివాడిగా కనిపించేందుకు మేకప్ వేసుకుంటున్న ఆ హీరో ఎవరో తెలుసా.. అతడే యంగ్ హీరో శ్రీవిష్ణు. గతేడాది సామజవరగమన సినిమాతో అలరించిన ఈ హీరో.. ఇప్పుడు ఓం భీమ్ బుష్ సినిమాతో సందడి చేశారు. రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శితో కలిసి కడుపుబ్బా నవ్వించారు.

ఇక ఇప్పుడు స్వాగ్ చిత్రంలో నటిస్తున్నారు రాజ రాజ చోర డైరెక్టర్ హసిత్ గోలి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. శ్రీవిష్ణు, హసిత్ కాంబోలో వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకులలో మంచి క్యూరియాసిటి నెలకొంది. ఇప్పటికే విడుదలైన టీజర్, గ్లింప్స్ ఆకట్టుకున్నాయి. ఇందులో శ్రీవిష్ణును చూసి అంతా షాకయ్యారు. ముసలివాడిగా కనిపిస్తూ దివాకర్ పేట ఎస్ ఐ భవభూతి రోల్ లో అదరగొట్టారు. ఇందులో ముసలివాడిగా కనిపించిన శ్రీవిష్ణు లుక్ పై నెట్టింట పెద్ద చర్చే జరిగింది. తాజాగా ఈ గెటప్ కు సంబంధించిన వీడియోను షేర్ చేసింది చిత్రయూనిట్.

ముసలివాడిగా కనిపించేందుకు శ్రీవిష్ణు దాదాపు నాలుగు గంటలపాటు మేకప్ చేయాల్సి వచ్చిందట. వయసు మళ్లిన పాత్రలో కనిపించేందుకు శ్రీ విష్ణును ప్రముఖ మేకప్ ఆర్టిస్ట్ రషీద్ సూపర్ గా తీర్చిదిద్దారు. అందుకు సంధించిన వీడియో మేకర్స్ షేర్ చేయగా నెట్టింట వైరలవుతుంది. మేకప్ కోసం చాలా టైమ్ పట్టినా.. అందుకు అవుట్ పుట్ మాత్రం శ్రీవిష్ణు ఇచ్చారని అంటున్నారు ఫ్యాన్స్. ఎప్పటిలాగే శ్రీవిష్ణు యాక్టింగ్ పై ప్రశంసలు వస్తున్నాయి. ఈ సినిమాలో రీతూ వర్మ కథానాయికగా నటిస్తుండగా.. సీనియర్ బ్యూటీ మీరా జాస్మిన్ కీలకపాత్ర పోషిస్తుంది.

View this post on Instagram

A post shared by Sree Vishnu (@sreevishnu29)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.