Tollywood: అందుకే నీకు అభిమానులు అయ్యేది.. రియల్ లైఫ్ హీరో.. ఆ లేడీ క్రికెటర్‎కు అండగా శివకార్తికేయన్..

ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో అతడు స్టార్ హీరో. ఎలాంటి బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండా సినీరంగంలోకి అడుగుపెట్టి ఇప్పుడు తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. అతి తక్కువ సమయంలోన బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ ఖాతాలో వేసుకుని ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు.

Tollywood: అందుకే నీకు అభిమానులు అయ్యేది.. రియల్ లైఫ్ హీరో.. ఆ లేడీ క్రికెటర్‎కు అండగా శివకార్తికేయన్..
Sajana Sanjeevan,sivakarthi

Updated on: Feb 16, 2025 | 7:25 AM

కోలీవుడ్ స్టార్ హీరో శివకార్తికేయన్ గురించి చెప్పక్కర్లేదు. యాంకర్ గా బుల్లితెరపై సినీప్రయాణం స్టార్ట్ చేసి ఇప్పుడు హీరోగా తనకంటూ ఓ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్నాడు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి స్టార్ స్టేటస్ సొంతం చేసుకున్నాడు. గతేడాది అమరన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఆ సినిమా విజయాన్ని సాధించి, అనేక కోట్లు వసూలు చేసి, రికార్డు సృష్టించింది. ఇక ఫిబ్రవరి 14న చెన్నైలో 100వ రోజు విజయోత్సవ వేడుక జరిగింది. ఇందులో సాయి పల్లవి కథానాయికగా నటించగా.. డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వం వహించారు. ఇదిలా ఉంటే.. తాజాగా నటుడు శివకార్తికేయన్ కు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరలవుతుంది. వెండితెరపై హీరోగానే కాకుండా అతడు రియల్ లైఫ్ లోనూ హీరోగానూ మారాడు.

2018లో కేరళలోని వయనాడ్‌లో భారీ వరదలు సంభవించాయి. ఆ సమయంలో ఎంతో మంది ఆస్తులు, ఇళ్లు, సంబంధాలు కోల్పోయారు. ఆ సమయంలో తనతో పాటు ఆ చిత్రంలో నటించిన క్రికెటర్ సజనా సంజీవన్ కు నటుడు శివకార్తికేయన్ సహయం చేశాడు. ఈ విషయాన్ని క్రికెటర్, నటి సజనా సంజీవన్ ‘కనా’ సినిమాలో వెల్లడించారు. సజనా మాట్లాడుతూ… ‘2018లో వయనాడ్ ప్రాంతం మొత్తం తీవ్రమైన వరదలకు గురైనప్పుడు, నటుడు శివకార్తికేయన్ సర్ నాకు ఫోన్ చేసి ఏదైనా సహాయం కావాలా అని అడిగారు. నా క్రికెట్ సామాగ్రి అంతా పోయిందని చెప్పాను. కానీ నాకు కేవలం స్పీక్స్ షూస్ కావాలని అడిగాను. వారం రోజుల్లోనే షూస్ నాకు పంపించారు ‘ అంటూ చెప్పుకొచ్చింది సజన.

దీంతో ఇప్పుడు శివకార్తికేయన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్స్. ఎంత ఉన్నత స్థాయికి వెళ్లినా, నటుడు శివకార్తికేయన్ ఇప్పటికీ సామాన్యుల గురించే ఆలోచిస్తారని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం శివకార్తికేయన్ పరాశక్తి, SK 23 వంటి చిత్రాల్లో నటిస్తున్నారు. పరాశక్తి సినిమా ఆగస్టు లేదా అక్టోబర్ లో విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి : Chala Bagundi Movie: తస్సాదియ్యా.. ఈ హీరోయిన్ ఏంట్రా ఇలా మారిపోయింది.. చాలా బాగుంది బ్యూటీ ఎలా ఉందంటే..

Tollywood: 15 నిమిషాల పాత్రకు రూ.4 కోట్లు తీసుకున్న హీరో.. 55 ఏళ్ల వయసులో తిరిగిన దశ..

Tollywood: అప్పట్లో లిరిల్ సోప్ యాడ్ గర్ల్.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్.. ఫాలోయింగ్ చూస్తే మైండ్ బ్లాంకే..

Tollywood: 19 ఏళ్ల వయసులోనే డైరెక్టర్ అలాంటి ప్రవర్తన.. డిప్రెషన్‏లోకి వెళ్లిపోయిన