- Telugu News Photo Gallery Cinema photos Singer Mangli Releases A Letter Clarifying About Political Issues
Singer Mangli: ‘నాకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదు’.. సింగర్ మంగ్లీ సంచలన ప్రకటన
ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీ ఇప్పుడు బిజి బిజీగా ఉంటోంది. ఓవైపు తెలుగు సినిమాల్లో పాటలు పాడుతూనే మరోవైపు టీవీ షోస్, ప్రోగ్రామ్స్ లోనూ సందడి చేస్తోంది. అలాగే ప్రైవేట్ ఆల్బమ్స్, బయటి ఈవెంట్లలోనూ పాల్గొంటోంది. అయితే ఇటీవల మంగ్లీ పై నెట్టింట కొన్ని ఆరోపణలు వచ్చాయి.
Updated on: Feb 15, 2025 | 10:40 PM

సింగర్ మంగ్లీ ఇటీవల కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడితో కలిసి అరసవల్లి సూర్యనారాయణుడి దేవాలయానికి వెళ్లింది. దీనిపై టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. సామాజిక మాధ్యమాల వేదికగా మంగ్లీపై విమర్శలు చేశారు.

ఈమేరకు సోషల్ మీడియాలో తనపై వస్తోన్న వార్తలపై సింగర్ మంగ్లీ స్పందించింది. ఈ మేరకు తన వివరణ చెబుతూఒక బహిరంగ లేఖను విడుదల చేసింది.

' అరస వెళ్లి సూర్యభగవానుని ఆలయాన్ని దర్శించాలనుకున్న సందర్భంలో కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడుగారి కుటుంబం ఒక కళాకారిణిగా, ఒక ఆడబిడ్డగా నన్ను వాళ్లతోపాటు ఆహ్వానించారు

'దేవుని కార్యక్రమానికి ఒక రాజకీయ పార్టీ ముద్రవేసి ఆరోపణలు చేయటం అన్యాయం. నేను వైసీపీకి ఒక్కటే కాదు, అన్ని పార్టీల లీడర్లకు నేను పాటలు పాడాను*

' ఇక మా ఇంటి ఇలవేల్పు శ్రీవారికి సన్నిధిలో ఎలాంటి అవకాశం వచ్చినా తిరస్కరించరాదనే ఉద్దేశంతో ఎస్వీబీసీ ఛానల్ సలహాదారు పదవిని స్వీకరించానే తప్ప దీని గురించి ఎక్కడా బహిరంగంగా ప్రకటించుకోలేదు'

'నేను పాటను నమ్ముకునే వచ్చాను కాని పార్టీలను, పదవులను నమ్ముకొని రాలేదు. నా పాటకు రాజకీయ రంగు పులమొద్దు. ఏ రాజకీయ పార్టీలతో నాకు సంబంధం లేదు' అని మంగ్లీ తన లేఖలో పేర్కొన్నారు.





























