Tollywood: యూట్యూబర్ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన శివ బాలాజీ.. కారణం ఇదే..

నటీనటుల గురించి అసభ్యకరంగా కామెంట్స్ చేస్తున్న పలు యూట్యూబ్ ఛానల్స్ పై ఫిర్యాదు చేయడంతో.. కొన్ని ఛానల్స్ బ్యాన్ అయ్యాయి. త్వరలోనే మరికొన్ని ఛానల్స్ గురించి కంప్లైంట్ చేస్తామంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. తాజాగా ఓ యూట్యూబర్ పై నటుడు శివబాలాజీ ఫిర్యాదు చేయడంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

Tollywood: యూట్యూబర్ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన శివ బాలాజీ.. కారణం ఇదే..
Siva Balaji
Follow us

|

Updated on: Sep 08, 2024 | 6:07 PM

ప్రస్తుతం సోషల్ మీడియాలో సెలబ్రెటీస్, వారి కుటుంబ సభ్యులకపై ట్రోలింగ్స్, అసభ్యకర కామెంట్స్ చేస్తున్నారు పలువురు యూట్యూబర్స్. త్వరగా ఫేమస్ అయ్యేందుకు ఇష్టానుసారంగా థంభైనల్స్ పెడుతూ నెట్టింట దారుణంగా ట్రోల్ చేస్తు్న్నారు. ఇక నెట్టింట హీరోయిన్స్ పరిస్థితి గురించి చెప్పక్కర్లేదు. టాలీవుడ్ స్టార్ హీరోహీరోయిన్స్ గురించి ట్రోల్స్ చేస్తున్న పలు యూట్యూబ్ ఛానల్లకు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్షుడు మంచు విష్ణు ఫైర్ అయిన సంగతి తెలిసిందే. నటీనటుల గురించి అసభ్యకరంగా కామెంట్స్ చేస్తున్న పలు యూట్యూబ్ ఛానల్స్ పై ఫిర్యాదు చేయడంతో.. కొన్ని ఛానల్స్ బ్యాన్ అయ్యాయి. త్వరలోనే మరికొన్ని ఛానల్స్ గురించి కంప్లైంట్ చేస్తామంటూ వార్నింగ్ కూడా ఇచ్చారు. తాజాగా ఓ యూట్యూబర్ పై నటుడు శివబాలాజీ ఫిర్యాదు చేయడంతో అతడిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.

హీరో మంచి విష్ణుతోపాటు మరికొందరు నటీనటులపై విజయ్ చంద్రహాసన్ అనే యూట్యూబర్ నెగిటివ్ ట్రోల్స్ చేస్తున్నాడని ‘మా’ కోశాధికారి నటుడు శివ బాలాజీ హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. మంచు విష్ణుతోపాటు ఆయన నిర్మాణ సంస్థ గురించి తన యూట్యూబ్ ఛానల్ ద్వారా విపరీతంగా ట్రోల్స్ చేస్తున్నాడని.. ‘మా’ గౌరవాన్ని దెబ్బతీసేలా అతడు తరచూ వీడియోస్ చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో యూట్యూబర్ విజయ్ చంద్రహాసన్ పై కేసు నమోదు చేసిన పోలీసులు ఈరోజు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో మంచు విష్ణుపై ద్వేషపూరిత, అసభ్యకరమైన ట్రోల్స్ చేస్తున్నాడని.. ఉద్దేశపూర్వకంగానే మంచు విష్ణు పేరును.. మా ప్రతిష్టను కించపరిచేలా కల్పితాలను సృష్టిస్తున్నాడని పోలీసులకు తెలిపారు శివబాలాజీ. తన ఛానల్ కు వ్యూస్ పెంచుకోవాలనే ఇలాంటి ట్రోల్స్ చేస్తున్నాడని.. ఇండస్ట్రీలోని నటీనటులతోపాటు వారి ఫ్యామిలీ మెంబర్స్ గురించి నెగిటివ్ ట్రోల్స్ చేస్తున్నారని తెలిపారు. ఇదిలా ఉంటే.. కొద్ది రోజుల క్రితం నటీనటుల గురించి అసత్య ప్రచారం చేస్తూ.. ట్రోలింగ్ చేస్తున్న 18కి పైగా యూట్యూబ్ ఛానళ్లను రద్దు చేస్తున్నట్లు మంచు విష్ణు ప్రకటించిన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
రాజయ్య అంగిల జొర్రి ఆగం పట్టిచ్చిన తొండ | బతుకమ్మ స్టెప్పులతో..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
తల మసాజ్‌ వల్ల పక్షవాతం.! యువకుడి ప్రాణంతో బార్బర్ చెలగాటం..
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
అమ్మా క్షమించు.! మారాలని ఉన్నా మారలేక శాశ్వతంగా వెళ్లిపోతున్నా.!
మగమహారాజులకు డేంజర్ బెల్స్.. ఆ క్యాన్సర్ ముప్పు వారికే ఎక్కువ.!
మగమహారాజులకు డేంజర్ బెల్స్.. ఆ క్యాన్సర్ ముప్పు వారికే ఎక్కువ.!
దారుణం.! పోలీసును వెంటాడి, కారుతో ఈడ్చుకెళ్లి.. వీడియో వైరల్..
దారుణం.! పోలీసును వెంటాడి, కారుతో ఈడ్చుకెళ్లి.. వీడియో వైరల్..
సూసైడ్‌ చేసుకున్న టిక్‌టాక్ స్టార్, షాక్‌లో ఫ్యాన్స్‌.!
సూసైడ్‌ చేసుకున్న టిక్‌టాక్ స్టార్, షాక్‌లో ఫ్యాన్స్‌.!
వామ్మో.. తీయని కేక్‌ తింటే ఇన్ని ఆరోగ్య సమస్యలా? 12 రకాల కేకులు..
వామ్మో.. తీయని కేక్‌ తింటే ఇన్ని ఆరోగ్య సమస్యలా? 12 రకాల కేకులు..
మెట్రోలో పీతల సందడి.. మెట్రోలో ప్రయాణికురాలి సంచి నుంచి బయటపడ్డయి
మెట్రోలో పీతల సందడి.. మెట్రోలో ప్రయాణికురాలి సంచి నుంచి బయటపడ్డయి
ఇకపై రైల్వే ట్రాక్‌పై వస్తువులు పెట్టేవారి అంతు చూస్తాం.!
ఇకపై రైల్వే ట్రాక్‌పై వస్తువులు పెట్టేవారి అంతు చూస్తాం.!
హౌతీ తీవ్రవాదులపై ఇజ్రాయెల్ పంజా.! యెమెన్‌లో భీకర దాడులు..
హౌతీ తీవ్రవాదులపై ఇజ్రాయెల్ పంజా.! యెమెన్‌లో భీకర దాడులు..