Sambarala Yeti Gattu: సాయి ధరమ్ తేజ్ సినిమాలో మరో ట్యాలెంటెడ్ యాక్టర్.. వైల్డ్ లుక్ వైరల్.. గుర్తు పట్టారా?
యాక్సిడెంట్ తర్వాత మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటించిన రెండు సినిమాలు హిట్ అయ్యాయి. విరూపాక్ష వంద కోట్లు కొల్లగొట్టగా, పవన్ కల్యాణ్ తో కలిసి నటించిన బ్రో కూడా మంచి వసూళ్లే సాధించింది. వీటి తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు సాయి ధరమ్ తేజ్.

మెగా మేనల్లుడు హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం ‘సంబరాల ఏటిగట్టు’ అనే ఓ డిఫరెంట్ మూవీలో నటిస్తున్నాడు. రోహిత్ కేపీ తెరకెక్కిస్తోన్న ఈ మూవీలో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటిస్తోంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో ఈ మూవీ తెరకెక్కుతోంది. ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై చైతన్య రెడ్డి, నిరంజన్ రెడ్డి భారీ బడ్జెట్ తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి వచ్చిన టైటిల్ గ్లింప్స్ అభిమానులను సర్ ప్రైజ్ చేసింది. ముఖ్యంగా ఇందులో సాయి ధరమ్ తేజ్ న్యూ లుక్ చేసి మెగా ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరపుకొంటోంది. తాజాగా ‘సంబరాల ఏటిగట్టు’ టీమ్ నుంచి ఓ క్రేజీ అప్ డేట్ వచ్చింది. ఈ సినిమాలో మరో ప్రముఖ నటుడు భాగం కానున్నట్లు వెల్లడించింది. అంతేకాదు ఆ ట్యాలెంటెడ్ నటుడి ఫస్ట్ లుక్ ను కూడా సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేసింది. సాధారణంగా ఎంతో హ్యాండ్సమ్ గా కనిపించే ఈ నటుడు ఇప్పుడు వైల్డ్ లుక్ లో కనిపించి సర్ ప్రైజ్ ఇచ్చాడు. పై ఫొటో అదే. మరి ఇందులో ఉన్నదెవరో గుర్తు పట్టారా? అతను మరెవరో కాదు ప్రముఖ బుల్లితెర నటుడు రవి కృష్ణ.
సాయి ధరమ్ తేజ్ నటించిన విరూపాక్షసినిమాలో ఓ డిఫరెంట్ రోల్ పోషించి విమర్శలకు ప్రశంసలు అందుకున్నాడు రవికృష్ణ. ఇప్పుడు మరోసారి మెగా మేనల్లుడి సినిమాలో కనిపించనున్నాడు. సోమవారం (జూన్ 09) రవి కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా సంబరాల ఏటి గట్టు నుంచి అతని ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ‘ ‘సంబరాల ఏటిగట్టు నుండి ప్రతిభావంతులైన నటుడు రవికృష్ణ అకా SUBBIకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు’అని మూవీ టీమ్ విషెస్ తెలిపింది. ఈ సినిమాలో రవి కృష్ణ సుబ్బి క్యారెక్టర్‌లో కనిపించనున్నాడు. ఇక పోస్టర్‌లో వైల్డ్ లుక్‌లో అదిరిపోయాడీ సీరియల్ యాక్టర్.
సంబరాల ఏటి గట్టు సినిమా నుంచి రవి కృష్ణ ఫస్ట్ లుక్ పోస్టర్..
Team @JMedia_Factory Wishing the talented actor #RaviKrishna aka Subbi from #SambaralaYetiGattu a very Happy Birthday! 🎉 From winning hearts on the small screen to making waves on the big screen — your hard work truly reflects in your massive success! 💥
Here’s to many more… pic.twitter.com/PXkQMzZIKV
— JMediaFactory (@JMedia_Factory) June 9, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.