Tollywood: 2 ఏళ్లకే 250 కోట్లకు అధిపతి.. బిడ్డ పేరిట రిజిస్టర్ చేయించిన స్టార్ హీరో దంపతులు.. ఎవరో తెలుసా?
రీల్ లైఫ్ లో హీరో, హీరోయిన్లుగా అలరించిన వీరు నిజ జీవితంలో ఆలు మగలుగా మారారు. తమ ప్రేమ బంధానికి ప్రతీకగా ఒక పండంటి ఆడ బిడ్డను కూడా తమ జీవితంలోకి ఆహ్వానించారు. ఇప్పుడు ఆ మహా లక్ష్మి వయసు సుమారు 2 ఏళ్లు.

తల్లి దండ్రులు తమ బిడ్డల బంగారు భవిష్యత్ కోసం డబ్బులు కూడ బెడుతుంటారు. పిల్లల చదువులు, కెరీర్, పెళ్లి తదితర అవసరాలకు ఆ డబ్బు ఉపయోగపడుతుందని పైసా పైసా పోగు చేస్తారు. ఇందుకు సెలబ్రిటీలేమీ అతీతులు కాదు. తాము సంపాదించిన ఆస్తులన్నీ తమ పిల్లలకే అప్పజెప్పుతారు. అలా ఇటీవల సినిమా ఇండస్ట్రీకి చెందిన ఓ ప్రముఖ జంట తమ కూతురికి కోట్ట రూపాయల ఆస్తిని గిఫ్ట్ గా ఇచ్చారు. కూతురు అలా పుట్టిందో లేదో అప్పుడే ఆ పాప పేరుపైన ఏకంగా వందల కోట్ల విలువైన ఆస్తిని రిజిస్ట్రేషన్ చేయించి రిచెస్ట్ స్టార్ కిడ్ గా మార్చేశారు. దీంతో ప్రస్తుతం ఈ విషయం సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఉన్న ది రిచెస్ట్ స్టార్ కిడ్ ఈ రెండేళ్ల పాపనే అని చెప్పవచ్చు. ఇలా తమ ఇంటి మహా లక్ష్మి పేరున కోట్లాది రూపాలయ ఆస్తిని రిజిస్ట్రేషన్ చేయించినది మరెవరో కాదు బాలీవుడ్ లవ్లీ కపుల్ అలియా భట్- రణ్ బీర్ కపూర్. త్వరలోనే వీరు ముంబైలోని బాంద్రా నడిబొడ్డున ఉన్న ఈ కొత్త ఇంట్లోకి షిఫ్ట్ కానున్నారు. అయితే సుమారు రూ. 250 కోట్ల విలువ చేసే ఈ ఆస్తిని తమ కూతురు రాహా కపూర్ పేరుతో రాశారీ క్యూట్ కపుల్. అంతేకాదు ఆ ఆస్తికి సంరక్షకురాలిగా రణబీర్ కపూర్ అమ్మగారు నటి నీతూ కపూర్ పేరుతో రిజిస్టర్ చేయించారు.
కాగా ఈ ఇల్లు రణ్ బీర్ కపూర్ కు వారసత్వంగా వచ్చింది. తన తాత రాజ్ కపూర్ ముందు ఈ ఇంటిని కొనుగోలు చేశారు. ఆ తర్వాత రిషీ కపూర్ అందులోనే ఉన్నారు. ఇప్పుడు రణబీర్ కపూర్ చేతికి ఆ ఆస్తి వచ్చింది. అయితే ఇప్పుడు ఆ ఇంటిని రీమోడలింగ్ చేయించారు. పాత ఇంటి గుర్తులు చెరిగిపోకుండా ఆరు అంతస్తుల విలాసవంతమైన ఇల్లు నిర్మించారు. రణ్ బీర్ ఈ ఇంటిని చాలా సెంటిమెంట్ గా ఫీలవుతున్నాడు. పైగా కూతురు పుట్టిన తర్వాత తనకు ప్రొఫెషనల్ లైఫ్ పరంగా బాగా కలిసొచ్చిందని అంటున్నారు. అందుకే దాదాపు రూ. 250 కోట్లకు పైగా ఉన్న ఆ భవనాన్ని కూతురు రాహా పేరుతో రిజిస్ట్రేషన్ చేపించాడు. త్వరలోనే ఇంట్లోకి అడుగు పెట్టనున్నారు అలియా భట్ ఫ్యామిలీ. ఈ దీపావళిని తమ కూతురుతో అక్కడ సెలబ్రేట్ చేసుకోవాలని రణ్ బీర్ ప్లాన్ చేస్తున్నాడట.
కూతురితో రణ్ బీర్ కపూర్- అలియా భట్
View this post on Instagram
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



