AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘తప్పుగా అర్ధం చేసుకుంటున్నారు.. అది మీ ఖ‌ర్మ! నేనిలాగే మాట్లాడతా..’ వివాదంపై రాజేంద్రప్రసాద్ రియాక్షన్

సగటు ప్రేక్షకుడిని కూడా కడుపుబ్బ నవ్వించే నట కిరిటీ రాజేంద్రప్రసాద్.. ఎలాంటి పాత్ర అయినా అందులో అలవోకగా ఒదిగిపోయి జీవించేస్తారు. అలాంటిది ఆయన గత కొంత కాలంగా కాంట్రవర్సీస్‌కి కేరాఫ్ అడ్రెస్‌గా మారారు. ప్రెస్ మీట్‌లు, సినిమా ఈవెంట్లలో ఆయన చేస్తున్న వ్యాఖ్యలు తెలుగు నాట పెద్ద దుమారమే రేపుతున్నాయి..

'తప్పుగా అర్ధం చేసుకుంటున్నారు.. అది మీ ఖ‌ర్మ! నేనిలాగే మాట్లాడతా..' వివాదంపై రాజేంద్రప్రసాద్ రియాక్షన్
Rajendra Prasad Reation On Viral Comments
Srilakshmi C
|

Updated on: Jun 02, 2025 | 9:20 PM

Share

సీనియర్‌ నటుడు రాజేంద్ర ప్రసాద్ తెలుగు నాట అందరికీ సుపరిచితమే. తనదైన టైమింగ్‌తో కామెడీని పండించే ఆయన నటన.. సగటు ప్రేక్షకుడిని కూడా కడుపుబ్బ నవ్విస్తుంది. ఎలాంటి పాత్ర అయినా అందులో అలవోకగా ఒదిగిపోయి జీవించేస్తారు. అలాంటిది ఆయన గత కొంత కాలంగా కాంట్రవర్సీస్‌కి కేరాఫ్ అడ్రెస్‌గా మారారు. ప్రెస్ మీట్‌లు, సినిమా ఈవెంట్లలో ఆయన చేస్తున్న వ్యాఖ్యలు తెలుగు నాట పెద్ద దుమారమే రేపుతున్నాయి. తాజాగా ఎస్వీకృష్ణారెడ్డి బర్త్‌డే వేడుకలో నటుడు అలీపైనేకాదు మాజీ మంత్రి రోజాపై కూడా నోరు జారారు. ఈ వేడుకకు శ్రీకాంత్, రోజా, ఆమని, ఇంద్రజ, లయ, రవళి, బ్రహ్మానందం, తనికెళ్ల భరణి, రాజేంద్రప్రసాద్, మురళీమోహన్, అలీ, ఉత్తేజ్, శివాజీ రాజా, బండ్ల గణేష్, చంద్రబోస్, అచ్చిరెడ్డి, కాదంబరి కిరణ్ వంటి పలువురు సినీ ప్రముఖులు ఉన్నారు. ఇంత మంది నటీనటుల ముందు కనీస మర్యాద లేకుండా రాజేంద్ర ప్రసాద్ అలా మాట్లాడారేంటీ? అంటూ సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.

నటి రోజాను ‘ఏమే.. నిన్ను కూడా నేనే హీరోయిన్‌ను చేశాను కదా..!’ అని అందరి ముందు అనడం ప్రేక్షకులకు సుతారం నచ్చలేదు. ఇక ఆలీని వేదికపైనే తీవ్ర ప‌ద‌జాలంతో మాట్లాడారు. దీనిపై ఇప్పటికే నెటిజ‌న్లు గుర్రు మంటున్నారు. ఆయనకంత నోటి దురుసు ఎందుకటా? అంటూ మండిప‌డుతున్నారు. ఇక రాజేంద్ర ప్రసాద్ వ్యాఖ్యలపై అలీ తాజాగా స్పందిస్తూ వీడియో విడుదల చేశారు. ఆయన సరదాగా మాట్లాడారని, ఎవరూ తప్పుగా అర్ధం చేసుకోవద్దని అన్నారు. ‘ఆయన పెద్దాయన. ప్లీజ్.. ఎవరూ దీన్ని పెద్దది చేయకండి’ అంటూ స్పెషల్ రిక్వెస్ట్‌ చేశారు. ఈ క్రమంలో రాజేంద్ర ప్రసాద్‌ కూడా వివాదంపై నోరు విప్పారు. తాజాగా ఆయన కొత్త మువీ షష్ఠిపూర్తి మువీ ప్రమోషన్ కార్యక్రమంలో దీనిపై క్లారిటీ ఇచ్చారు. ఇంతకీ ఏమన్నారంటే..

‘నేను అందరితో సరదాగా ఉంటాను. వాళ్ళు కూడా నాతో సరదాగా ఉంటారు. అయితే ఈ మధ్య కొన్ని ఈవెంట్లలో నావాళ్ళు అనే ఉద్దేశంతో వాళ్లను నేను పొరపాటున అనేసిన కొన్ని మాటలను తప్పు అని అంటున్నారు. నేను ఇలాగే ఉంటాను. ఇలాగే మాట్లాడుతాను. నేనేంటో వాళ్లందరికీ తెలుసు. సరదాగా ఫ్లోలో వచ్చిన మాటలను తప్పుగా అర్థం తీసుకోవడం మీ సంస్కారం. ఈ మధ్య కొన్ని ఫంక్షన్లలో నేను మాట్లాడిన వాటిని తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. అది మీ కర్మ.. మీ సంస్కారం.. మీద ఆధారపడి ఉంటుంది. అందుకు నేనేం చేయలేను. తప్పుగా అర్థం చేసుకుంటే అది మీ సంస్కారం. నేనైతే ఇలాగే ఉంటా. ఎప్పుడూ సరదాగా మాట్లాడుతుంటా.. నేను ప‌రిచ‌యం చేసిన హీరోయిన్, యాక్టర్ గురించి మాట్లాడినా త‌ప్పుగానే అనుకున్నారు. నేను ఇలానే ఉంటాను. ఎందుకంటే అన్నయ్యని కాబ‌ట్టి’ అని చెప్పుకొచ్చారు. కానీ నటుడు రాజేంద్ర ప్రసాద్‌ ఇంత చెప్పినా ప్రేక్షకులు మాత్రం ఎందుకో.. ఆయన వయసుకి ఆ విధంగా మాట్లాడటం సరికాదేమోనని సనుగుతున్నారు. ఇంతకీ మీరేమంటారు..?

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్‌ చేయండి.

ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
ధర ఎక్కువైనా ఈ పండును కచ్చితంగా తినండి.. ఎందుకో తెలిస్తే..
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
సిమ్ కార్డులతో భారీ సైబర్ క్రైమ్.. చెక్‌ పెట్టిన ఏపీ సీఐడి!
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
విజయ్ హజారే ట్రోఫీకి విరాట్, రోహిత్ శాలరీ ఎంత?
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
ఇదో పవర్‌ ఫుల్‌ డిటాక్స్‌ డ్రింక్..!షాకింగ్‌ బెనిఫిట్స్‌ తెలిస్తే
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
థియేటర్లలో సంచలనం.. ఇప్పుడు ఓటీటీలోకి చిన్న సినిమా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
ఛీ.. ఛీ.. చేతులెలా వచ్చాయ్‌ రా.. మనవరాలి వయసని కూడా చూడకుండా..
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దీప్తి శర్మ రికార్డుల వేట..రేణుకా సింగ్ వికెట్ల కోత
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
దేశంలో అత్యంత సంపన్నుడైన చెఫ్‌ ఇతనే నట..ఆయన ఆస్తుల విలువ తెలిస్తే
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వందేభారత్ ప్రయాణీకులకు తీపికబురు.. ఇకపై ఆ స్టేషన్‌లోనూ..
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్
వెజ్‌లో నాన్‌వెజ్‌ రుచి కావాలంటే..ఈ కూరగాయతో రెట్టింపు బలం,టేస్ట్