Rajendra Prasad : ఆ సమయంలో ఏదైనా తాగి చనిపోదాం అనుకున్నా.. కన్నీళ్లు పెట్టుకున్న రాజేంద్రప్రసాద్
ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ను తన నటనతో విపరీతంగా ఆకట్టుకున్నారు ఈ సీనియర్ నటుడు. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత సహ నటుడిగా, హీరోగా అద్భుతంగా నటించి మెప్పించారు. ముఖ్యంగా కామెడీ పాత్రల్లో నటించి నవ్వుల పువ్వులు పూయించారు రాజేంద్రప్రసాద్.
ఎన్నో సినిమాల్లో హీరోగా నటించి ప్రేక్షకులకు దగ్గరయ్యారు నట కిరిటీ రాజేంద్ర ప్రసాద్. ఆయన సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో తెలియని ఆసక్తి, ఆనందం కలుగుతుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ను తన నటనతో విపరీతంగా ఆకట్టుకున్నారు ఈ సీనియర్ నటుడు. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత సహ నటుడిగా, హీరోగా అద్భుతంగా నటించి మెప్పించారు. ముఖ్యంగా కామెడీ పాత్రల్లో నటించి నవ్వుల పువ్వులు పూయించారు రాజేంద్రప్రసాద్. ఒకవైపు నవ్విస్తూనే.. మరోవైపు అద్భుతమైన ఎమోషన్స్‌ను పండించారు రాజేంద్రప్రసాద్. ప్రస్తుతం రాజేంద్ర ప్రసాద్ చాలా బిజీగా మారిపోయారు. వరుసగా సినిమాలు చేస్తూ ఆయా షూటింగ్స్ లో బిజీగా నటిస్తున్నారు.
అప్పట్లో అందానికి ఆధార్ కార్డులా ఉండేది.. స్టార్ క్రికెటర్‌తో ఎఫైర్.. కట్ చేస్తే సన్యాసి..
రీసెంట్ గా కల్కి సినిమాలోనూ కీలక పాత్రలో నటించారు. అలాగే ఇప్పుడు చిన్న, పెద్ద హీరోల సినిమాల్లో నటిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రాజేంద్రప్రసాద్.. తనకెరీర్ బిగినింగ్ డేస్ ను గుర్తు చేసుకున్నారు. ఆ ఇంటర్వ్యూలో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. రామారావు గారి స్పూర్తితో ఇండస్ట్రీలోకి వచ్చాను అన్నారు. అలాగే సినిమాల్లోకి రావడం తన తండ్రికి ఇష్టం లేదని.. సినిమాల్లో ఫెయిల్ అయితే తిరిగి ఇంటికి రావొద్దు అని అన్నారని తెలిపారు. ఎలాగైనా సినిమాల్లో సక్సెస్ అవ్వాలని అనుకున్నా..
ఒక్క సినిమా కూడా చేయలేదు.. కానీ ఇండస్ట్రీని షేక్ చేస్తుంది ఈ చిన్నది
కానీ నాకు అవకాశాలు రాలేదు. అప్పటికే స్నేహం అనే సినిమాలో చిన్న పాత్ర చేశాను. ఆ తర్వాత అవకాశాలు రాలేదు. తినడానికి తిండి లేదు. ఇంటికి నాన్న రానివ్వరు. చేతిలో డబ్బులు లేవు. అవకాశాలు రావడం లేదు. అప్పటికే భోజనం చేసి మూడు నెలలు అవుతుంది. చేతిలో ఉన్న చిల్లరతో రోజుకు ఒక్క అరటి పండు, ఒక గ్లాస్ మజ్జిగ మాత్రమే తాగుతూ జీవించా.. చివరకు అవి కూడా అయిపోయాయి. ఇక మరణమే శరణం అనుకున్నా.. ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నా.. చివరిగా నా గురు సమానులు అయిన అందరిని ఒక్కసారి కలుద్దాం అని వెళ్ళాను. ముందుగా రామారావుగారి ఇంటికి వెళ్ళాను. ఆయన ఎదో బిజీలో ఉన్నారు. అలా తిరిగి తిరిగి చివరకు పుండరీకాక్ష్యయ్య గారి దగ్గరకు వెళ్ళాను. అప్పటికే అక్కడ ఎదో పెద్ద గొడవ అవుతుంది. నన్ను చూసిన ఆయన ఎప్పుడు వచ్చావ్ అంటూ నన్ను పలకరించారు. ఆతర్వాత నన్ను తీసుకొని వెళ్లి మేలుకొలుపు అనే సినిమాకు డబ్బింగ్ చెప్పించారు. ఆ సినిమాలో నటించిన వ్యక్తి తమిళనాడుకు చెందిన వాడు కావడంతో నాతో డబ్బింగ్ చెప్పించారు. నేను నాలుగు డైలాగ్స్ చెప్పాను. ఆతర్వాత నేను భోజనం చేసి మూడు నెలలు అయ్యింది. ఆకలి వేస్తుంది. ఏదైనా తిని చెప్పాను అన్నాను.. అంటూ ఎమోషనల్ అయ్యారు రాజేంద్ర ప్రసాద్.
16 ఏళ్లకే ఫేక్ వీడియోలు.. కట్ చేస్తే 18 ఏళ్లకే తోపు హీరోయిన్.. ఎవరంటే..
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..