Pawan Kalyan: పెప్సీ యాడ్ కోసం అప్పట్లో పవన్ కళ్యాణ్ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా ?..
ఓవైపు రాజకీయాలు.. మరోవైపు సినిమాలతో బిజీగా ఉన్నారు పవన్. ఈ క్రమంలోనే తాజాగా ఆయన కెరీర్ మొదట్లో చేసిన పెప్సీ యాడ్ వీడియో వైరలవుతుంది. 2001లోనే ఇండియాలో మోస్ట్ పాపులర్ బ్రాండ్ పెప్సీ కూల్ డ్రింక్ సంస్థకు ఆయన బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేశారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కేవలం సినిమాలపరంగానే కాదు.. వ్యక్తిత్వంలోనే ఆయనకు ఎక్కువగా ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం ఆయన చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు. తొలి సినిమాతో నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న పవన్.. ఈ స్టార్ డమ్ అందుకోవడానికి ఎంతో కష్టపడ్డారు. మెగాస్టార్ తమ్ముడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టినప్పటికీ అన్నయ్య స్థాయిని చేరుకోవడానికి అచి తుచి అడుగులు వేశారు. ఇక పవన్ అంటే యూత్‌లో ఫాలోయింగ్ ఏ స్థాయిలో చెప్పక్కర్లేదు. ఆయన సినిమా వచ్చిందంటే… థియేటర్లలో ఫ్యాన్స్ చేసే హడావిడి మాములుగా ఉండదు. దాదాపు రెండు దశాబ్దాల కెరీర్లో ఎన్నో సూపర్ హిట్స్ అందుకున్నాడు.
అయితే ఓవైపు రాజకీయాలు.. మరోవైపు సినిమాలతో బిజీగా ఉన్నారు పవన్. ఈ క్రమంలోనే తాజాగా ఆయన కెరీర్ మొదట్లో చేసిన పెప్సీ యాడ్ వీడియో వైరలవుతుంది. 2001లోనే ఇండియాలో మోస్ట్ పాపులర్ బ్రాండ్ పెప్సీ కూల్ డ్రింక్ సంస్థకు ఆయన బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేశారు. సౌత్ ఇండియాలో ఓ స్టార్ హీరో ప్రొడక్ట్స్ యాడ్ ఇవ్వడం అదే తొలిసారి. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి థమ్స్ అప్ యాడ్ చేశారు. అయితే ఈ యాడ్ చేసినందుకు అప్పట్లో పవన్ కళ్యాణ్ బాగానే పారితోషికాన్ని అందుకున్నారట.




ఈ యాడ్ చేసినందకు అప్పట్లో తనకు రూ. 100 నుంచి 150 కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చినట్లుగా గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అప్పట్లోనే ఆ రేంజ్ లో పారితోషికం అందుకున్న ఏకైక హీరో పవన్ కావడం విశేషం. దాదాపు 20 ఏళ్ల కిందటే 100 కోట్ల పారితోషికాన్ని అందుకున్నారంటే పవన్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.




