AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aishwarya Rai: లైఫ్ అంటే ఇలా ఉండాలి.. ఐశ్వర్య రాయ్ ఆస్తి ఎన్ని కోట్లు ఉంటుందో తెలుసా ?..

కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తనయుడు అభిషేక్ బచ్చన్ ను వివాహం చేసుకున్నారు ఐశ్వర్య. వీరికి ఆరాధ్య బచ్చన్ కూతురు ఉంది. ఇదిలా ఉంటే.. ఒకప్పుడు భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఒకరు ఐశ్వర్య. మూడు దశాబ్దాల కెరీర్ లో ఎన్నో కోట్లు సంపాదించింది.

Aishwarya Rai: లైఫ్ అంటే ఇలా ఉండాలి.. ఐశ్వర్య రాయ్ ఆస్తి ఎన్ని కోట్లు ఉంటుందో తెలుసా ?..
Aishwarya Rai
Rajitha Chanti
| Edited By: |

Updated on: May 18, 2023 | 7:19 PM

Share

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఐశ్వర్య రాయ్ స్థానం గురించి తెలిసిందే. నార్త్ టూ సౌత్ అత్యధిక ఫాలోయింగ్ హీరోయిన్ ఆమె. హిందీలోనే కాకుండా తమిళంలోనూ ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన ఐశ్వర్య .. ఇప్పుడు సినిమాలు తగ్గించింది. అయినా ఇప్పటికీ ఏమాత్రం క్రేజ్ తగ్గని హీరోయిన్ ఐశ్వర్య. చాలా కాలం గ్యాప్ తర్వాత ఆమె నటించిన చిత్రం పొన్నియన్ సెల్వన్. డైరెక్టర్ మణిరత్నం రూపొందించిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తనయుడు అభిషేక్ బచ్చన్ ను వివాహం చేసుకున్నారు ఐశ్వర్య. వీరికి ఆరాధ్య బచ్చన్ కూతురు ఉంది. ఇదిలా ఉంటే.. ఒకప్పుడు భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఒకరు ఐశ్వర్య. మూడు దశాబ్దాల కెరీర్ లో ఎన్నో కోట్లు సంపాదించింది.

కేవలం సినిమాలే కాదు.. అటు బుల్లితెరపై వాణిజ్య ప్రకటనలలోనూ పెద్ద మొత్తంలో సంపాదిస్తుంది. అంతేకాకుండా.. అనేక అంతర్జాతీయ సౌందర్య ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. ఐశ్వర్య..అనేక కంపెనీలలో పెట్టుబడులు ఉన్నాయి. ప్రస్తుతం ఐశ్వర్య ఒక్కో సినిమాకు రూ. 10-12 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటుంది. ఇప్పటివరకు ఆమె వద్ద రూ. 800 కోట్లకు పైగా ఆస్తి ఉంది.

ఐశ్వర్య రాయ్ తన భర్త అభిషేక్, కూతురు ఆరాధ్య.. అత్తమామలు అమితాబ్, జయ బచ్చన్ సతో కలిసి ముంబైలోని జూహు పరిసర ప్రాంతంలో ఉన్న విలాసవంతమైన భవనంలో నివసిస్తున్నారు. ఈ భవనం ఖరీదు రూ. 112 కోట్లు. ఐశ్వర్య రాయ్ బచ్చన్ 2015లో బాంద్రా-కుర్లా కాంప్లెక్స్‌లోని ప్రీమియం రెసిడెన్షియల్ టవర్‌లో విశాలమైన 5-BHK అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసింది. 5,500 చదరపు అడుగుల అపార్ట్‌మెంట్ విలువ రూ. 21 కోట్లు. అలాగే.. దుబాయ్‌లో విలాసవంతమైన విల్లాను కొనుగోలు చేశారు. ముంబైలోని వర్లీలో మరో అద్బుతమైన అపార్ట్మెంట్ ఉంది. అపార్ట్‌మెంట్ స్కైలార్క్ టవర్స్‌లోని 37వ అంతస్తులో ఉంది. దాని ధర రూ. 41 కోట్లు.

ఇవి కూడా చదవండి

ఆమె కొన్ని సంవత్సరాల క్రితం రోల్స్ రాయిస్ ఘోస్ట్ చేసింది. దీని ధర రూ. 7.95 కోట్లు. ఆమె సుమారు రూ. 2.33 కోట్ల విలువైన లెక్సస్ ఎల్ఎక్స్ 570 .. అలాగే రూ. 1.56 కోట్ల విలువైన ఆడి ఎ8 ఎల్ ను కలిగి ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
iSmart News: మా తమ్ముడే పెద్ద దానకర్ణుడు..నా దగ్గర ఏమీ లేదు!
iSmart News: మా తమ్ముడే పెద్ద దానకర్ణుడు..నా దగ్గర ఏమీ లేదు!
డీఆర్‌డీఓ కొత్త డైరెక్టర్ జనరల్‌గా డాక్టర్ జగన్నాథ్ నాయక్ నియామకం
డీఆర్‌డీఓ కొత్త డైరెక్టర్ జనరల్‌గా డాక్టర్ జగన్నాథ్ నాయక్ నియామకం
సుడిగాలి సుధీర్ హైలెస్సో నుంచి మరో పోస్టర్..
సుడిగాలి సుధీర్ హైలెస్సో నుంచి మరో పోస్టర్..
కాంట్రాక్టు పనులకు బిల్లు రాలేదని బడికి తాళం
కాంట్రాక్టు పనులకు బిల్లు రాలేదని బడికి తాళం
కబ్జాదారుల నుంచి 1166 గజాల ప్రభుత్వ స్థలాన్ని కాపాడిన హైడ్రా..
కబ్జాదారుల నుంచి 1166 గజాల ప్రభుత్వ స్థలాన్ని కాపాడిన హైడ్రా..
నాగలితో దుక్కి దున్నిన మంత్రి పొన్నం.. ఇదిగో వీడియో
నాగలితో దుక్కి దున్నిన మంత్రి పొన్నం.. ఇదిగో వీడియో
IND vs ENG తొలిపోరు.. పిచ్ రిపోర్ట్ చూస్తే మైండ్ బ్లాంకే..?
IND vs ENG తొలిపోరు.. పిచ్ రిపోర్ట్ చూస్తే మైండ్ బ్లాంకే..?
రైతు భరోసా పడలేదా..? ఈ విధానంలో ఫిర్యాదు చేస్తే ప్రాబ్లం క్లియర్
రైతు భరోసా పడలేదా..? ఈ విధానంలో ఫిర్యాదు చేస్తే ప్రాబ్లం క్లియర్
హైవేలపై వంతెనల భద్రత కోసం NHAI కొత్త రూల్స్.. రంగంలోకి 12 ఐఐటీలు!
హైవేలపై వంతెనల భద్రత కోసం NHAI కొత్త రూల్స్.. రంగంలోకి 12 ఐఐటీలు!
తారక్‌ను ముద్దుగా 'నాన్నా'అని పిలిచే ముగ్గురు హీరోలు ఎవరో తెలుసా?
తారక్‌ను ముద్దుగా 'నాన్నా'అని పిలిచే ముగ్గురు హీరోలు ఎవరో తెలుసా?