Navdeep: మాదాపూర్ డ్రగ్స్ కేసు.. ఈడీ విచారణలో కీలక విషయాలు వెల్లడించిన నవదీప్.. మరికొందరు ప్రముఖుల పేర్లు బయటికి!
నవదీప్.. టాలీవుడ్‌లో ఆయనొక మిస్టర్ కాంట్రవర్సీ. అడపాదడపా రియల్ క్రైమ్ సీన్లలో కూడా మెరుస్తారు. ముఖ్యంగా డ్రగ్స్ కేసు అంటూ ఏదైనా బైటికొచ్చిందంటే.. అక్కడ కచ్చితంగా నవదీప్ పేరు ప్రస్తావనకు రావాల్సిందే. ఇప్పుడూ అదే జరిగింది. డ్రగ్స్ కన్‌జ్యూమర్‌గా అభియోగాలు ఎదుర్కొంటున్న హీరో నవదీప్.. డ్రగ్ పెడ్లర్స్‌తో కూడా సంబంధాలు పెట్టుకున్నారా?

నవదీప్.. టాలీవుడ్‌లో ఆయనొక మిస్టర్ కాంట్రవర్సీ. అడపాదడపా రియల్ క్రైమ్ సీన్లలో కూడా మెరుస్తారు. ముఖ్యంగా డ్రగ్స్ కేసు అంటూ ఏదైనా బైటికొచ్చిందంటే.. అక్కడ కచ్చితంగా నవదీప్ పేరు ప్రస్తావనకు రావాల్సిందే. ఇప్పుడూ అదే జరిగింది. డ్రగ్స్ కన్‌జ్యూమర్‌గా అభియోగాలు ఎదుర్కొంటున్న హీరో నవదీప్.. డ్రగ్ పెడ్లర్స్‌తో కూడా సంబంధాలు పెట్టుకున్నారా.. మనీలాండరింగ్‌కి పాల్పడ్డారా…? 2017 నాటి టాలీవుడ్ డ్రగ్స్ కేసులో నవదీప్ ప్రమేయం ఎంత? ఇవాళ ఈడీ ఎదుట విచారణకు హాజరైన నవదీప్.. ఈ ప్రశ్నలన్నిటికీ ఏమని బదులిచ్చారు..? మాదాపూర్ డ్రగ్స్ కేసులో పట్టుబడిన నిర్మాత వెంకటరత్నారెడ్డి, రామ్‌చంద్‌లను కదిలిస్తే హీరో నవదీప్ పేరు బైటికొచ్చింది. నవదీప్ తనతో కలిసి డ్రగ్స్ తీసుకున్నట్లు రామ్‌చంద్ తన వాంగ్మూలంలో క్లియర్‌గా చెప్పినట్టు తెలుస్తోంది. ఈ ఆధారంతోనే నవదీప్ పేరును నిందితుల జాబితాలో చేర్చారు. పరారీలో ఉన్నాడంటూ కమిషనర్ సీవీ ఆనంద్ ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చారు.
–ఇప్పటికే ఈ కేసు విషయంలో సెప్టెంబర్ 23న నవదీప్‌ను విచారించారు. ఈడీ అడిగిన కొన్ని ప్రశ్నలకు నవదీప్ సరైన సమాధానాలు ఇచ్చినా మరికొన్నిటిని దాటవేశారు. నిందితుడు రామ్‌చంద్ తనకు పదేళ్ల కిందటే పరిచయమని.. ఐనా తాను ఎవరికీ డ్రగ్స్ ఇవ్వలేదని క్లారిటీ ఇచ్చారు ఇచ్చారు నవదీప్. ఇప్పుడు 2017లో నమోదైన టాలీవుడ్ డ్రగ్స్ కేసును, మాదాపూర్ డ్రగ్స్ కేసును కలిపి నవదీప్‌ని విచారిస్తోంది ఈడీ. ఈ క్రమంలో వరుస ప్రశ్నలతో నవదీప్‌ని ఈడీ కార్నర్ చేసినట్టు తెలుస్తోంది.
1) నైజీరియన్లతో ఆర్థిక లావాదేవీలు ఎందుకు జరిపారు..? 2) డ్రగ్స్ కేసులో ఉన్న నైజీరియన్లతో మీకేంటి లింకు..? 3) ముగ్గురు నైజీరియన్ల మనీలాండరింగ్ గురించి మీకేం తెలుసు..? 4) మీ అకౌంట్ల వివరాలన్నీ ఈడీకి ఇవ్వగలరా..? 5) మేనేజర్, డ్రైవర్ అకౌంట్లతో ట్రాన్సాక్షన్లు చేశారా..? 6) కలహర్ రెడ్డి, రామ్‌చంద్‌తో లావాదేవీల సంగతేంటి..? 7) ఈవెంట్లకు సంబంధించిన రికార్డులన్నీ ఇస్తారా..?
ఇలా ప్రశ్నల మీద ప్రశ్నలతో నవదీప్‌ను ఇంటరాగేట్ చేసింది ఈడీ. ఈ విచారణలో మరికొంతమంది కీలక వ్యక్తుల పేర్లు బైటికొచ్చినట్టు తెలుస్తోంది. క్వశ్చనింగ్ తర్వాత బైటికొచ్చిన నవదీప్ మాత్రం.. తనదైన స్టయిల్‌లోనే రియాక్ట్ అయ్యారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.