Malli Pelli: ‘మళ్లీ పెళ్లి’ రిలీజ్ ముందే బిగ్ షాక్.. సినిమాను ఆపాలంటూ కోర్టును ఆశ్రయించిన రమ్య రఘుపతి..
విడుదలకు ముందు రోజే మళ్లీ పెళ్లి చిత్రయూనిట్‌కు బిగ్ షాక్. ఈ సినిమా విడుదలను ఆపాలంటూ కోర్టును ఆశ్రయించారు నరేష్ భార్య రమ్య రఘుపతి. ఈమేరకు ఆమె కూకట్పల్లి ఫ్యామిలీ కోర్టులో ఫిర్యాదు చేశారు.
విడుదలకు ముందు రోజే మళ్లీ పెళ్లి చిత్రయూనిట్‌కు బిగ్ షాక్. ఈ సినిమా విడుదలను ఆపాలంటూ కోర్టును ఆశ్రయించారు నరేష్ భార్య రమ్య రఘుపతి. ఈమేరకు ఆమె కూకట్పల్లి ఫ్యామిలీ కోర్టులో ఫిర్యాదు చేశారు. తన ప్రతిష్టను కించిపరిచేలా ఈ చిత్రంలో సన్నివేశాలు ఉన్నాయంటూ ఆరోపించారు. నరేశ్, పవిత్రా లోకేష్ జంటగా నటించిన ఈ సినిమా మే 26న థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది.
సీనియర్ నటుడు నరేష్.. పవిత్రా లోకేష్ జంటగా నటించిన చిత్రం మళ్లీ పెళ్లి. ఈ చిత్రానికి ఎంఎస్ రాజు దర్శకత్వం వహించగా.. నటుడు వ్యక్తిగత జీవితంలో చోటు చేసుకున్న కొన్ని సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఇప్పటికే రిలీజైన టీజర్, సాంగ్స్, ట్రైలర్ ఆకట్టుకోగా.. కొద్ది రోజులుగా ఈ మూవీ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.