AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

HIT 3 Movie: హిట్-3 వసూళ్ల సునామీ.. ఆ మైల్ట్ స్టోన్ దాటేసిన నాని సినిమా.. 4 రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?

చెప్పి మళ్లీ హిట్ మీద హిట్ కొడుతున్నాడు న్యాచురల్ స్టార్ నాని. ఇటీవలే కోర్టు సినిమాతో నిర్మాతగా సూపర్ హిట్ కొట్టిన నాని ఇప్పుడు హీరోగానూ మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. అతను నటించిన తాజా చిత్రం బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది.

HIT 3 Movie: హిట్-3 వసూళ్ల సునామీ.. ఆ మైల్ట్ స్టోన్ దాటేసిన నాని సినిమా.. 4 రోజుల్లో ఎన్ని కోట్లు వచ్చాయంటే?
Nani Hit 3 Movie
Basha Shek
|

Updated on: May 06, 2025 | 2:46 PM

Share

న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన చిత్రం హిట్-3: ది థర్డ్‌ కేస్‌. శైలేష్‌ కొలను తెరకెక్కించిన ఈ సైకో థ్రిల్లర్ మూవీలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. వాల్‌ పోస్టర్‌ సినిమా, నాని యూనానిమస్‌ ప్రోడక్షన్స్‌ బ్యానర్స్‌ పై ప్రశాంతి తిపిర్నేని నిర్మించిన ఈ చిత్రం మే 1న విడుదలైంది. మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. మొదటి మూడు రోజుల్లో రికార్డు కలెక్షన్లు సాధించిన ఈ మూవీ ఆదివారం (మే 04) మరింత దూకుడు కొనసాగించింది. తాజాగా ఈ సినిమా వంద కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఒక పోస్టర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. కేవలం నాలుగురోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 101 కోట్ల గ్రాస్‌ రాబట్టినట్లు ప్రకటించారు. కేవలం నాలుగురోజుల్లోనే వంద కోట్ల క్లబ్ లో చేరడంతో చిత్ర బృందంతో పాటు నాని అభిమానులు సంతోషంలో మునిగిపోతున్నారు.

హిట్‌-3 సినిమా విడుదలైన రోజునే అంటే మే01నే సూర్య ‘రెట్రో’, హిందీలో అజయ్ దేవగణ్ ‘రైడ్ 2’ వంటి స్టార్ హీరోల సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. అయితే వీటికి నెగెటివ్ టాక్ వచ్చింది. అదే సమయంలో హిట్-3 మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు భారీగా వస్తున్నాయి. వయలెన్స్ ఎక్కువగా ఉందని విమర్శలు వస్తున్నా కేవలం నానిని చూసేందుకు చాలా మంది ఆడియెన్స్ థియేటర్లకు వెళుతున్నారు.

ఇవి కూడా చదవండి

సెంచరీ కొట్టేసిన అర్జున్ సర్కార్..

కాగా నాని కెరీర్‌లో ఇప్పటి వరకు అత్యధిక కలెక్షన్స్‌ సాధించిన సినిమా దసరా (రూ.120 కోట్లు). హిట్-3 జోరు చూస్తుంటే అతి త్వరలో ఈ రికార్డు ను అధిగమించేలా ఉంది. హిట్-3తో ఇప్పటివరకు నాని కెరీర్ లో వంద కోట్ల సినిమాల సంఖ్య నాలుగుకు చేరుకున్నాయి. ఇంతకు ముందు దసరా, సరిపోదా శనివారం( రూ.101 కోట్లు), ఈగ (రూ. 100 కోట్లు)లు సినిమాలు ఉన్నాయి.

హిట్-3 ప్రమోషన్లలో నాని, శ్రీనిధి శెట్టి..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us