Gopichand: మరోసారి విలనిజం చూపించబోతున్న గోపిచంద్.. మహేశ్‌ను ఢీకొట్టనున్న హీరో..
టాలెంటెడ్ హీరో గోపిచంద్ హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు. కంటెంట్ ప్రాధాన్యత
టాలెంటెడ్ హీరో గోపిచంద్ హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస ప్రాజెక్టులతో దూసుకుపోతున్నారు. కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. ఇటీవల సంపత్ నంది దర్శకత్వంలో సీటీమార్ సినిమా చేశాడు. కబడ్డీ నేపథ్యంలో వచ్చిన ఈమూవీ పర్వాలేదు అనిపించుకుంది. ప్రస్తుతం గోపిచంద్ మారుతీ దర్శకత్వంలో పక్కా కమర్షియల్ సినిమా చేస్తున్నాడు. యాక్షన్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈమూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే… గోపిచంద్ కెరీర్ తొలినాళ్లలో విలన్ క్యారెక్టర్స్లలో అదుర్స్ అనిపించుకున్నాడు.
పవర్ ఫుల్ విలనిజం చూపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత హీరోగా మారి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు గోపిచంద్. తాజా సమాచారం ప్రకారం గోపిచంద్ మరోసారి విలనిజం చూపించడానికి రెడీ అయ్యారట. అది కూడా రాజమౌళి సినిమాలో.. సూపర్ స్టార్ మహేష్ బాబు.. రాజమౌళి దర్శకత్వంలో ఓ మూవీ రాబోతున్న సంగతి తెలిసిందే ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం గోపిచంద్‌ను సంప్రదిస్తున్నారట మేకర్స్. గతంలో మహేష్ సినిమాలో విలన్ పాత్ర నటించాడు గోపిచంద్. మరీ ఇప్పుడు నెగిటివ్ షేడ్ చూపించేందుకు ఒప్పుకుంటాడో లేదో చూడాలి. మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు.